గ్లాసుడు దానిమ్మ రసంతో గుండె పదిలం
ఆరోగ్యం కోసం గోధుమ గడ్డి (వీట్‌గ్రాస్) ని ప్రతీరోజూ తీసుకుంటే...
పైనాపిల్ పయోజనాలు
ఎసిడిటీ నుంచి విముక్తికి...
జాయింట్ పెయిన్ రిలీఫ్
లావు తగ్గాలంటే...
హై బీపీ తగ్గాలంటే...
అజీర్ణంతో బాధపడుతున్నవారు భోజనం తర్వాత అరకప్పు పైనాపిల్ జ్యూస్ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూను నిమ్మరసం, రెండుస్పున్లు తేనె, అల్లం ముక్కలు చిన్నవి వేసుకుని అన్నింటినీ మిక్స్ చేసుకుని ఆ మిశ్రమాన్ని అజీర్తిగా అనిపించినప్పుడు తాగాలి.
అజీర్తి వల్ల కడుపునొప్పిగా, ఇరిటేషన్‌గా అనిపిస్తున్నప్పుడు ద్రాక్షపళ్ళు తింటే ఉపశమనం కలుగుతుంది.
భోజనం అయిపోయిన తర్వాత పొట్టమీద ఐస్‌బ్యాగ్ తో మసాజ్ చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
నిమ్మరసం అజీర్తిని పోగొట్టడం లో బాగా పనిచేస్తుంది. ఇది అజీర్తితో కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడుతుంది. ఒక కప్పు వేడి నీటి లో కొంచెం నిమ్మరసం కలుపుకుని తాగాలి.
బేకింగ్‌సోడా, మంచినీళ్ళు సమపాళల్లో తీసుకొని గ్లాస్‌లో కలుపుకుని తీసుకుంటే వెంటనే ఉపశమనం కలుగుతుంది.
ఒక గ్లాసు నీటిలో జీలకర్ర వేసుకుని కాసేపు నానబెట్టి ఆ నీటిని తాగొచ్చు.
తాజా కొత్తెమీర ఆకులతో జ్యూస్ చేసి దానిలో చిటికెడు ఉప్పు కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని రోజుకు రెండుసార్లు తీసుకొవాలి.
భోజనం తర్వాత ఒక కప్పు అల్లంటీ తీసుకోవడం వల్ల అజీర్తి సమస్య తగ్గుతుంది.
250 మి.లీ నీటిలో ఒక టీ స్పూన్ మెంతులను వేసి నీరు సగానికి ఇంకే వరకు మరిగించి ఆకషయాన్ని తాగాలి. ఇలా రోజుకు నాలుగుసార్లు చేస్తే సైనసైటిస్ పూర్తిగా తగ్గుతుంది. సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు రోజుకు నాలుగు డోసులు తీసుకుంటూ తీవ్రత తగ్గే కొద్దీ డోసుల సంఖ్యను తగ్గించుకోవాలి.
ఒక టీ స్పూను జీలకర్రను వేయించి పొడిచేసి అందులో రెండు టీస్పున్ల తేనె కలిపి తీసుకోవాలి. ఇలా రోజుకు రెండుమోతాదులో తీసుకుంటే ఫలితం ఉంటుంది. సైనసైటిస్ కారణంగా పట్టేసినట్లు ఉంటే జీలకర్రను పలుచటి కాటన్ క్లాత్‌లో కట్టి వాసన పీలుస్తుంటే ఉపశమనం లభిస్తుంది.
రోజుకు ఒకసారి 300మి.లీ క్యారెట్ రసం లో 200మి.లీ. పాలకూర రసం కలిపి తీసుకుంటే సైనసైటీస్ తగ్గుతుంది.
300మి.లీ క్యారెట్ రసం లో వంద మిల్లీలీటర్ల కీరదోసరసం, అంతే మోతాదులో బీట్‌రూట్ రసం కలిపి తాగినా కూడా సైనసైటీస్ నుంచి ఉపశమనం కలుగుతుంది.
ఎసిడిటీతో బాధపడుతున్న వారు, భోజనం తర్వాత లవంగంలోని చిన్న ముక్కను నోట్లో వేసుకుని రసం మింగుతుండాలి.
బాదం పప్పులను రాత్రంతా నానబెట్టి, ఉదయం వాటిపై పొర తీసి పాలు, తేనెతో కలిపి ఉడకబెట్టుకుని తాగాలి. ఇలా 20-25 రోజుల పాటు చేస్తే జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. ప్రతి రోజూ ఏడు బాదం పప్పులు నేరుగా తిన్నా మంచి ఫలితం ఉంటుంది.
ముక్కు వెంట నీరు కారుతున్నట్టుగా జలుబు చేస్తే చేతి రుమాలులో రెండు, మూడు చుక్కల యూకలిప్టస్ ఆయిల్ వేసుకుని వాసన చూస్తుంటే మంచి ఇన్‌హేలర్‌గా పనిచేస్తుంది. పసుపు, యూకలిప్టస్ ఆయిల్ కలిపి ఆవిరి పడితే జలుబు నుండి ఉపశమనం కలుగుతుంది.
నోటి దుర్వాసన పోవాలంటే ఏలకులు, లవంగ మొగ్గలను నోట్లో వేసుకుని నములుతుండాలి.
అల్లం రసంలో, గోరు వెచ్చని తేనె కలిపి రాత్రి పడుకునే ముందు తీసుకుంటే ఎంత తీవ్రంగా ఉన్న దగ్గు అయినా తగ్గిపోతుంది.
జీలకర్ర, నల్ల ఉప్పు, నిమ్మరసం గోరువెచ్చని నీటిలో కలిపి వడకట్టి రోజూ ఉదయం ఒక గ్లాసుడు తాగితే కడుపు నొప్పి తగ్గుతుంది.
జీలకర్ర, ధనియాలు సమపాళ్ళలో తీసుకుని, దోరగా వేయించి, పొడిచేసి, అర టీ స్పూను చొప్పున రోజుకి మూడు సార్లు తీసుకుంటే శరీరంలోని వేడి తగ్గుతుంది.
పుట్టగొడుగులను కేవలం ఆహారంగా మాత్రమే కాదు.. రంగుల తయారీలోను ఉపయోగిస్తారు. సహజ రంగుల ఉత్పత్తిలో వీటి వాడకం అధికం. ఇవి గాఢమైన రంగులను వివిధ ఛాయల్లో ఉత్పత్తి చేయడానికి పనికొస్తాయి.
క్యాబేజీలో 91 శాతం నీరే ఉంటుంది.
ఎన్నిరకాల పండ్లున్నా... ఒక్క స్ట్రాబెర్రీలో మాత్రమే విత్తనాల అమరిక బయటికి కనిపించేలా ఉంటుంది.
సోయాపిండిలో గోధుమపిండిలో కంటే ఎక్కువ మోతాదులో కాల్షియం, ఐరన్ లభిస్తాయి.
యాపిల్‌లో ఉండే నీటిశాతం ఎంతో తెలుసా! అక్షరాలా.. 25 శాతం. అందుకే అది నీటిలో తేలుతుంది.
చూయింగ్ గమ్‌లు జీవక్రియ వేగాన్ని నియంత్రించి 25 శాతం నాజుగ్గా ఉండటానికి కారాణమవుతాయి.
కాఫీ రుచి ప్రపంచం మొత్తానికి తెలిసిన అత్యంత ప్రజాదరణ పొందిన సువాసన.
మానవులు తీసుకునే ఆహారంలో. ఎప్పటికీ పాడైపోని పదార్ధం తేనె.
స్ట్రాబెర్రీలో కంటే నిమ్మకాయల్లోనే తీపి ఎక్కువట.. తెలుసా!
ప్రపంచవ్యాప్తంగా అతిధి మర్యాదలకు గౌరవ సూచకంగా వాడుతున్న ఫలం అనాస.
నెలసరి రోజుల్లో రోజుకొక కోడిగుడ్డును ఉడకబెట్టి తింటే నీరసం, అలసట ఉండవు.
ఆహారంలో బి విటమిన్, క్యాల్షియం, మెగ్నీషియం, జింక్ సమృద్ధిగా ఉండేలా చూసుకోవాలి. అలా సాధ్యం కానప్పుడు డాక్టరు సలహా మేరకు అవన్నీ అందే విధంగా మందులు వాడితే కండరాలకు తగినంత శక్తి లభిస్తుంది. రుతుక్రమం బాధ తీవ్రత తగ్గుతుంది.
శరీరంలో క్యాల్షియం తగినంత ఉన్నప్పుడు ఈ సమయంలో నొప్పులు కలగవని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా మహిళలు రోజుకు 800 మిల్లీ గ్రాముల క్యాల్షియం తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే రుతుక్రమం రోజుల్లోనే కాకుండా ప్రతిరోజూ మూడుకప్పుల పాలు తాగాలి.
గొంతు పట్టేసినట్లున్నా, దగ్గు వదలకుండా వున్నా గోరు వెచ్చటి పాలలో చిటికెడు మిరియాల పొడి కలిపి తాగాలి. ఇలా ఉదయం, సాయంత్రం, రాత్రి తీసుకుంటే రెండు రోజుల్లో బాధ తగ్గుతుంది.
వదలకుండా ముక్కు కారుతుంటే గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు లేదా ఒక వెల్లుల్లి రేకను చిదిమి వేసుకుని తాగాలి.
చలికాలంలో పిల్లలకు తరచుగా మందులు వేయడం కంటే నాలుగైదు రోజులకొకసారి ఒక టీ స్పూను వాము పొడిని తినిపిస్తుంటే ఆరోగ్యంగా ఉంటారు.
పాలకూర రసం తాగినట్లయితే జుట్టు బాగా పెరుగుతుంది. పాలకూర రసం తాగడానికి ఇబ్బందిగా అనిపిస్తే అరకప్పు క్యారెట్ రసంలో అరకప్పు పాలకూర రసం కలుపుకుని తాగవచ్చు.
ఆహారంలో ఎక్కువ భాగం ఆకుపచ్చని కూరగాయలు, పాలు, పండ్లు, మొలకెత్తిన ధాన్యాలు, 'వెజిటబుల్, ఫ్రూట్ సలాడ్లు' తీసుకుంటుంటే జుట్టురాలడం తగ్గడమే కాకుండా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది కూడ.
ఒబెసిటీతో బాధపడుతుంటే బరువు తగ్గడం కోసం ఆహార నియంత్రణ పాటించడం కోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరంలేనట్లే ఉంది ఈ ఆక్యుప్రెషర్ చిట్కాలను చూస్తే. శరీరంలో ప్రెషర్ పాయింట్లను గుర్తించి కరెక్ట్‌గా అక్కడ ఒత్తిడి కలిగించే చిన్నపాటి వ్యాయామం ద్వారా ఆకలిని అదుపు చేయవచ్చు. పై పెదవి మధ్యభాగంలో, ముక్కుకు కింది భాగంలో, నాభికి ఒక అంగుళం కింద, ఒక అంగుళం పైన వేళ్ళతో నొక్కాలి. ఇలా రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు చేయాలి. ఒక్కొక్కసారి ఐదు నిమిషాలపాటు చేయాలి.
ఆహారాన్ని బాగా నమిలి తినే అలవాటున్న వాళ్ళలో ఒబేసిటీ తక్కువగా చూస్తాం. నమలకుండా మింగే అలవాటుండి, ఒబెసీటీతో బాధపడుతున్న వాళ్ళు ఇప్పటికైనా ఆహారాన్ని నమిలి తినడం అలవాటు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. నోట్లో పెట్టుకున్న పదార్ధం మెత్తగా గ్రైండ్ అయ్యే వరకు నమలడం అలవాటు చేసుకుంటే తిన్న ఆహారంలోని పోషకాలు సక్రమంగా శరీరానికి అందడంతోపాటు ఒబేసిటీ కూడా తగ్గుతుంది. ఎక్కువ సేపు నమలడం ద్వారా ఎక్కువ పరిమాణంలో ఆహారాన్ని తీసుకోలేరు, పైగా శరీరానికి తగినంత తినగానే జీర్ణవ్యవస్థ ఇకచాలని హెచ్చరికలు జారీ చేస్తుంది.
టొమాటో రసం కాని గుజ్జు కాని ముఖానికి పట్టించి గంట తర్వాత కడిగేస్తే మొటిమలు, మచ్చలు పోతాయి. ముఖం మీద అదనపు జిడ్డు తొలగిపోతుంది.
పుదీనా ఆకులను గ్రైండ్ చేసి క్రమం తప్పకుండా ముఖానికి పట్టిస్తుంటే నెల రోజులకు మొటిమలు పూర్తిగా పోతాయి.
ఏ ఫేస్ ప్యాక్‌లోనయినా తేనె కలుపుకోవచ్చు. తేనె ముఖంపై ముడతలను పోగొట్టడంతోపాటు చర్మాన్ని కాంతివంతం చేస్తుంది.
కొత్తిమీర రసంతో మర్దన చేస్తే పెదవులు ఎర్రబడతాయి, మృదుత్వాన్ని సంతరించుకుంటాయి.
ప్రకృతి ప్రసాదించిన వనమూలికలతో అద్భుతమైన వైద్యం చేయవచ్చని నిరూపించారు భారాతీయ వైద్యులు. వీటిలో అల్లం ప్రాధాన్యం మరీ ఎక్కువ. ముఖ్యంగా పసిపిల్లలున్న ఇంట్లో అల్లం, శొంఠి ఉండడం ఆనావాయితీ.
పిల్లలకు అజీర్తి, కడుపునొప్పి వస్తే ఒక స్పూను అల్లం రసం కాని చిటికెడు శొంఠి పొడికాని ఇవ్వాలి. పెద్దవాళ్ళు కూడా మోతాదు పెంచి తీసుకోవచ్చు.
జలుబు, ఫ్లూ జ్వరంతో బాధపడుతున్నప్పుడు తేనెలో అల్లం ముక్కలు కాని, శొంఠిపొడి కాని కలిపి తీసుకోవాలి.
తలనొప్పి, జ్వరం ఉన్నప్పుడు అల్లంరసం కాని, అల్లం టీ కాని తాగితే ఉపశమనం కలుగుతుంది.
పైత్యంతో వాంతులవుతుంటే శొంఠిని తేనెతో కలిపి చప్పరించాలి.
వేవిళ్ళ సమయంలో అయ్యే వాంతుల నివారణకు కూడా అల్లం బాగా పనిచేస్తుంది. నోరు రుచి లేనట్లు ఉండడాన్ని పోగొడుతుంది.
జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు రోజుకు మూడుసార్లు, అల్లంతో తయారైన హెర్బల్ టీని తాగచ్చు. అయితే రోజులో నాలుగుసార్లకు మించి అల్లం టీ తాగితే ఆరోగ్యానికి మంచిది కాదు. మరీ ముఖ్యంగా కడుపులో అల్సర్ ఉన్న వాళ్ళు అసలు తాగకూడదు.
అల్లం టీ తాగినప్పుడు ఆహ్లాదంగా అనిపించకుండా కడుపులో వికారం కాని మరే సైడ్ ఎఫెక్ట్ కనిపించినా అల్సర్ వంటి సమస్యలున్నాయేమోనని డాక్టర్‌ని సంప్రదించడం అవసరం.
రెండు టీ స్పూన్ల గోరు వెచ్చటి నీటిలో ఒక టీ స్పూన్ అల్లం రసం కలిపి తాగితే గ్యాస్ బాధ తగ్గుతుంది.
అజీర్తి చేస్తే శొంఠి పొడిలో నెయ్యి, బెల్లం కలిపి ఉండలు చేసి రోజూ ఉదయం, రాత్రి భోజనం చేసిన తర్వాత తింటే జీర్ణక్రియ సక్రమమవుతుంది.
శొంఠిపొడి, నెయ్యి, బెల్లం, వెన్న కలిపి తింటే శరీర జీవరక్షక వ్యవస్థ మెరుగవుతుంది.
అరగ్రాము ఏలకుల పొడిలో ఒక టీ స్పూన్ కలిపి తింటే వాంతులు, వికారం తగ్గుతాయి.
సోడాలో చిటికెడు మిరియాల పొడి కలిపి తాగితే వాంతులు అదుపులోకి వస్తాయి.
ఒక గ్లాసుపాలలో ఒక టీ స్పూన్ నెయ్యి కలిపి తాగితే అసిడిటీ తగ్గుతుంది.
రోజూ ఐదు గ్రాముల త్రిఫల చూర్ణాన్ని ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించి చల్లారిన తర్వాత తాగితే కొవ్వు కరిగిపోతుంది. బరువు తగ్గుతారు.
బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఒక పద్ధతి లేకుండా ఆహార నియమాలు పాటించడం వల్ల అనుకున్న ఫలితాలు రాకపోగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
కఠిన ఉపవాసం ఉండటం, తగ్గించి తినడం మంచిది కాదు. ఇలా చేస్తే శరీరంలోని జీవ రక్షక వ్యవస్థ (మెటబాలిజం) దెబ్బతింటుంది.
ఎక్కువ సేపు తినకుండా గ్యాప్ ఇచ్చి ఒకేసారి ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం సాధారణంగా చేసే పొరపాటు. బరువు తగ్గాలంటే తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవాలి.
భోజనం చేసేటప్పుడు మనసు తినేదాని మీదే కేంద్రీకరించాలి. టీవీ చూస్తూ, పుస్తకం కాని పేపర్‌కాని చదువుతూ, కబుర్లు చెప్పుకుంటూ తినే అలవాటు మానుకోవాలి. ఏం తింటున్నామో? ఎంత తింటున్నామన్నది తెలియకుండా ఎక్కువ తినేది ఇలాంటప్పుడే. మెదడు ఇతర విషయాల మీద కేంద్రీకృతమై ఉన్నప్పుడు సరిపడినంత తిన్నామన్న సంకేతాలను పంపించదు. 'ఏంటో మీతో మాట్లాడుతూ ఎక్కువ తినేశా. బాగా హెవీగా ఉంది.' అనే మాట అప్పుడప్పుడు వింటుంటాం. అది ఇదే.
డయాబెటిస్‌ను కంట్రోల్ చేయడానికి సోయాబీన్ బాగా పని చేస్తుంది. పోషకాలు మెండుగా ఉండి తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారంగా సోయాబీన్‌ను ప్రపంచ వ్యాప్తంగా న్యూట్రిషనిస్టులు గుర్తించారు.
పెరిగే పిల్లలకు సోయాబీన్ మంచిపోషణనిస్తుంది. దేహదారుడ్యానికి, పెరుగుదలకు దోహదం చేస్తుంది.
శరీరం పెరుగుదలతోపాటు మెదడును వికశింప చేస్తుంది.
క్రమం తప్పకుండా సోయాబీన్ తింటే శరీరంలో కొలెస్ట్రాల్ నిల్వలు చేరవు. ఎప్పటికప్పుడు కొలెస్ట్రాల్‌ను కరిగించి వేస్తుంది.
ఆర్ధరైటిస్, గుండె, మెదడు, కిడ్నీలు, కళ్ళ సమస్యలను దూరం చేస్తుంది.
వ్యాయామం శక్తికి మించి చేయకూడదు.
వ్యాయామం చేస్తున్నంతసేపు వేరే ఏ ఆలోచనలు చేయకూడదు.
ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం కంటే ఒక కప్పు పాలు లేదా ఒక గ్లాసు ఫ్రూట్ జ్యూస్ తాగి కాని ఒక పండు తిన్న తర్వాత కాని వ్యాయామం చేయడం మంచిది.
ఆయుర్వేదం ప్రకారం యోగాసనం, ప్రాణాయామం చేస్తే మంచి ఫలితాలుంటాయి. ఇవి శరీరాన్ని మనసును ఏకకాలంలో సాంత్వన పరుస్తాయి.
బ్రిస్క్ వాక్ కూడా మంచి వ్యాయామం.
వ్యాయామం చేసేటప్పుడు పూర్తి శ్రద్ధతో చేయాలి తప్ప బలవంతంగా చేయకూడదు. ఇష్టపూర్వకంగా చేయకుండా మొక్కుబడిగా అయిందనిపిస్తే శరీరం సానుకూలంగా స్పందించదు.
కాకరకాయలు, ములక్కాయలు బరువు పెరగకుండా కాపాడతాయి. బరువు అదుపులో ఉంచుకోవాలన్నా, తగ్గాలన్నా ఆహారంలో వీటిని తరచుగా తినవచ్చు.
తేనెకు కొవ్వును కరిగించే గుణం ఉంది. క్రమం తప్పకుండా తీసుకుంటే అధిక బరువును తగ్గిస్తుంది.
తేనె, నిమ్మరసం తీసుకుంటూ ఉపవాసం ఉంటే ఒంట్లో ఉన్న కొవ్వు త్వరగా కరగడం ప్రారంభమవుతుంది. ఒక టీ స్పూన్ తేనె, ఒక నిమ్మ చెక్క ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోవాలి. ఇలా రోజులో ఎన్నిసార్లయినా తాగవచ్చు.
పని ఒత్తిడిలో బ్రేక్‌ఫాస్ట్ తీసుకోకుండా ఒకేసారి మధ్యాహ్న భోజనం చేసే అలవాటు గృహిణులలో చాలామందికి ఉంటుంది. ముఖ్యంగా బరువు తగ్గడం కోసం డైటింగ్ చేసేవాళ్ళు ఇలా చేస్తుంటారు. దీనితో బరువు తగ్గడం కంటే ఇతర శరీర సమస్యలను ఎదుర్కొనవలసి రావచ్చు. రోజూ తప్పని సరిగా బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాలి. ఆహారం తీసుకోవాల్సిన క్రమంలో ఒకటి మిస్ అయినా శరీరంలో జీవరక్షణ దెబ్బ తింటుంది.
చిన్నపిల్లలకు మాంసాహారం అలవాటు చేసేటప్పుడు చేపలను తినిపించడం మంచిది. నమలడంతో పాటు ఇవి జీర్ణం కావడం కూడా సులభం. పిల్లలకు రెండవ సంవత్సరం నుంచి వారి ఆహారంలో చేపలను చేర్చవచ్చు.
పిల్లలకు మొదటిసారి కొనే షూ తేలికగా ఉండేలా చూడాలి. పాదాలకు గాలి తగిలే విధంగా లెదర్ లేదా క్లాత్‌తో తయారైనది మాత్రమే వాడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాస్టిక్ సోల్ ఉన్న వాటి జోలికి వెళ్ళకూడదు.
డయేరియాతో బాధపడే పిల్లలకు శరీరంలో నీటి శాతం త్వరగా తగ్గుతుంది. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా చల్లటి నీటిలో చక్కెర, ఉప్పు కలిపి తరచుగా పట్టించాలి. దీనికి బదులుగా ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ప్యాకెట్‌ను నీటిలో కలిపి తాగించాలి. ఇవి అన్ని మందుల దుకాణాలలోనూ దొరుకుతాయి.
సోడాలో చిటికెడు ఉప్పు, మిరియాలపొడి కలిపి తాగితే గ్యాస్ట్రిక్ సమస్య తగ్గుతుంది.
విషపురుగు కరిచినప్పుడు కరివేపాకు కాయలరసం, నిమ్మరసం సమపాళ్ళలో కలిపి గాయం మీద రాస్తే విషం హరిస్తుంది.
ధనియాల పొడిలో చక్కెర కలిపి రోజుకు రెండు మూడు సార్లు తినిపిస్తే పిల్లలో పక్క తడిపే అలవాటు పోతుంది.
రోజుకు ఒకసారి రెండు - మూడు ఏలకులను ఒక టీ స్పూన్ తేనెలో కలిపి తింటే కళ్ళు లాగడం వంటి సమస్యలు తగ్గుతాయి.
దోమల లాంటివి కుట్టినప్పుడు ఆ ప్రదేశంలో సబ్బు రాస్తే దురద తగ్గి తాత్కాలికంగా ఉపశమనం లభిస్తుంది.
రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెలో కొద్దిగా కర్పూరం వేసి వేడిచేసి చిన్నపిల్లల ముక్కుపై, వెన్నుపై మసాజ్ చేస్తే జలుబు, జ్వరానికి ఉపశమనం కలుగుతుంది.
శొంఠి పొడిని ఏలకులు, తేనె లేదా చక్కెరతో కలిపి తింటే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.
జలుబుతో బాధపడుతుంటే తేనె కలిపిన నిమ్మరసం తీసుకోవాలి.
నోటి నుంచి దుర్వాసన వస్తుంటే రోజూ ఉదయాన్నే ఐదు గ్లాసుల నీళ్ళు తాగాలి.
జఠాహంపి వేర్లను మెత్తగా దంచి పొడి చేసి రోజూ రెండు గ్రాముల పొడి నీళ్ళలో కలిపి తాగితే రక్తం శుభ్రపడుతుంది. మొటిమలు తగ్గుతాయి. ముఖం, శరీరం కాంతివంతమై చర్మవ్యాధులు తగ్గుతాయి.
శొంఠిపొడి, నెయ్యి, బెల్లం సమపాళ్ళలో కలిపి ఉదయాన్నే తింటే జలుబు తగ్గుతుంది.
మిరియాల పొడి పావు టీ స్పూన్, శొంఠిపొడి అర టీ స్పూన్, తులసి ఆకుల పొడి అర టీ స్పూన్ కాని తాజా ఆకులు నాలుగైదు తీసుకుని ఒక గ్లాసు నీటిలో వేసి నీళ్ళు సగానికి ఇంకే వరకు మరిగించాలి. ఈ టీని రోజుకు రెండు మూడుసార్లు తాగితే జలుబు పూర్తిగా వదిలిపోతుంది.
అల్లం టీ ఆరోగ్యానికి మంచిదే కాని ప్రతి రోజు తాగకూడదు. జీర్ణవ్యవస్థ సొంతంగా తన పని తాను చేయడానికి అవకాశం ఇవ్వాలి.
రోజూ క్రమం తప్పకుండా పసుపు కడుపులోకి చేరితే రింగ్ వార్మ్స్ చేరవు. కడుపులో నులిపురుగులు ఉన్నట్లనిపిస్తే ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాసుడు గోరువెచ్చని నీటిలో అరటీ స్పూను ఉప్పు, చిటికెడు పసుపు కలుపుకుని తాగాలి.
వేయించిన జీలకర్ర పొడి, నల్ల ఉప్పు వేసి మజ్జిగలో కలిపి తాగితే డయేరియా తగ్గుతుంది.
బాగా దగ్గు వస్తున్నప్పుడు సత్వరమే తగ్గడానికి కరక్కాయను బుగ్గన పెట్టుకుని కొద్దికొద్దిగా రసం మింగితే ఫలితం ఉంటుంది.
పంటినొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే రెండు చుక్కల లవంగ నూనెను దూదిమీద వేసి నొప్పి ఉన్న చోట పెట్టాలి. లవంగ నూనెకు బదులుగా లవంగం కూడా వాడొచ్చు.
కొత్త చెప్పులు నొక్కుకుని కాయలు కాసిన చోట నిమ్మచెక్కని ఉంచి కట్టుకట్టి రాత్రంతా ఉంచాలి.
జిగట విరేచనాలు అవుతుంటే రెండు స్పూన్ల పెరుగులో ఒక స్పూను మెంతులు వేసి తింటే విరేచనాలు తగ్గుతాయి.
ఉదయాన్నే మొదటగా ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి తాగాలి. ఇది జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది. కెఫీన్ ఉన్న పదార్ధాలు ఆరోగ్యానికి హాని చేస్తాయి.
ఉపాహారంగా నూనె లేకుండా వండిన తేలికగా జీర్ణమయ్యే పదార్ధాలనే తీసుకోవాలి. ఇది రోజువారీ పనులను ఉల్లాసంగా చేయడానికి పనిచేస్తుంది.
నిద్రపోయే ముందు ఒక గ్లాసు వేడిపాలలో కొద్దిగా శొంఠిపొడి, ఏలకుల పొడి వేసుకుని తాగాలి. అల్లం అయితే కఫాన్ని తొలగిస్తుంది.
ఆహారంలో ఆకుకూరల వంటి పీచు పదార్ధాలు మెండుగా ఉన్నవి తినడానికి వీలుకానప్పుడు తొక్కతో సహా తినగలిగిన పండును తప్పని సరిగా చేర్చాలి.
మధ్యాహ్నం రెండు గంటల లోపే గట్టి ఆహారం తీసుకోవాలి. ఆ తర్వాత తీసుకునేవన్నీ తేలికగా జీర్ణమయ్యేవిగా ఉండాలి. రాత్రి భోజనం వీలైనంత తక్కువగా ఉండాలి.
డయాబెటిస్ అదుపులో ఉండడానికి క్రమం తప్పకుండా రోజుకు నాలుగైదు మిరియాలు తినాలి.
లో బిపి సమస్య ఉంటే రోజూ ఉదయాన్నే మూడు మిరియాలు తింటే రక్త ప్రసరణ క్రమబద్ధం అవుతుంది.
రోజూ ఆహారంలో మిరియాలు కాని మిరియాలపొడి కాని తీసుకుంటే అది రక్తంలో కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా నివారిస్తుంది.
గొంతు ఇన్ఫెక్షన్ తగ్గాలంటే ఒక టీ స్పూన్ తాజా అల్లం రసం లేదా చిన్న అల్లం ముక్క, చిటికెడు మిరియాల పొడి, రెండు టేబుల్ స్పూన్ల తేనె కలిపి ఉదయం ఒక సారి రాత్రి పడుకోబోయే ముందు ఒకసారి తినాలి.
కాఫీ, టీలు ఉత్తేజాన్నిచ్చే పానీయాలుగా తెలుసు. అలాగని ఎక్కువ మోతాదులో తీసుకుంటే క్రమంగా ఆరోగ్యసమస్యలను సృష్టిస్తాయని కూడా తెలుసు. గ్రీన్ టీ తాగితే మెదడు ఉత్తేజితం కావడంతోపాటు ఆరోగ్యం మెరుగవుతుంది కూడ.
చైనాలో దాదాపుగా నాలుగు వేల సంవత్సరాలుగా దీనిని అనేక అనారోగ్యాలను దూరం చేసే ఆరోగ్యప్రదాయినిగా వాడుతున్నారు. ఇందులో కేట్‌చిన్ పాలీఫెనోల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగా పని చేసి క్యాన్సర్ కణాలను చంపడంలో సమర్ధంగా పనిచేస్తాయి. శరీరంలోని ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను తగ్గిస్తాయి.
గ్రీన్ టీ అంటే మనం మామూలుగా తాగే పౌడర్‌తోనే పాలు లేకుండా చేసేది మాత్రమే అనుకుంటే పొరపాటే. ప్రధానంగా ఆకు ఒకటే అయినా పౌడర్ తయారీలో తేడా ఉంటుంది. మార్కెట్‌లో గ్రీన్ టీ పౌడర్ ప్రత్యేకంగా దొరుకుతుంది.
ప్రతిరోజూ ఆపిల్ తినడం వల్ల కిడ్నీలో రాళ్ళ సమస్య తగ్గుముఖం పడుతుంది. సాధ్యమైనప్పుడు తాజా పండును తీసుకుంటూ, సాధ్యం కానప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా ఆపిల్ సైడర్ వెనిగర్‌ను తీసుకోవచ్చు.
అన్ని రకాల పండ్లలోకి పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువ. పైగా ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కాబటి పుచ్చకాయ కిడ్నీ సమస్యలను సమర్ధంగా నివారిస్తుంది. ఇవి అందుబాటులో ఉన్న సీజన్‌లో వీలయినంత ఎక్కువగా తీసుకుంటే మంచిది. కిడ్నీ సమస్య దరి చేరకుండా ఉండడానికి ఆపిల్‌కు ప్రత్యామ్నాయంగా పుచ్చకాయ బాగా పని చేస్తుంది.
రుతుక్రమంలో అపసవ్యతలతో బాధపడుతుంటే ఒక టీ స్పూన్ వెన్నను కరిగించి అందులో పావు టీ స్పూన్ ఇంగువను(పౌడర్ లేదా చిన్న ముక్క) వేయించాలి. దీనిని ఒక గ్లాసు మజ్జిగలో కాని ఇతర సూప్‌లు లేదా డ్రింకులతో కాని కలిపి తీసుకోవాలి.
లో బిపి ప్రాబ్లమ్ ఉన్నవారు రాత్రి పడుకునే ముందు ఎప్సమ్ సాల్ట్ నీటిలో వేసుకుని స్నానం చేస్తే బ్లడ్ ప్రెజర్ క్రమబద్ధమౌతుంది.
నాలుగు ఎండు అత్తిపళ్ళను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఆ నీటితో సహా తీసుకోవాలి. ఇలాగే ఇదే మోతాదులో ఉదయం నానబెట్టి సాయంత్రం తినాలి. ఇలా మూడు నుంచి నాలుగు వారాల పాటు తింటే పైల్స్ సమస్య అదుపులోకి వస్తుంది. పండ్లను నానబెట్టే ముందు వేడినీటితో శుభ్రం చేయాలి.
మామిడి టెంకలో ఉండే జీడిని నీడలో ఎండబెట్టి పొడిచేసి, రెండుగ్రాముల పొడిని నీటితో కాని తేనెతో కాని తీసుకోవాలి. బ్లీడింగ్ పైల్స్‌కు ఇది బాగా పని చేస్తుంది. ఈ పొడి ఒకసారి చేసుకుని నిల్వ చేసుకోవచ్చు.
వంద గ్రాముల ముల్లంగిని తురిమి, ఒక టీ స్పూన్ తేనె కలిపి రోజూ రెండుసార్లు తీసుకోవాలి. 60 మి.లీ ముల్లంగి రసంలో ఉప్పు కలిపి రోజుకు రెండుసార్లు తాగాలి. ముల్లంగిని మెత్తగా పేస్టు చేసి పాలతో కలిపి తీసుకోవచ్చు. ఇది వాపు, నొప్పితో కూడిన పైల్స్‌ను కూడా తగ్గిస్తుంది.
కిడ్నీలో రాళ్ళు ఉండి బాధపడుతుంటే ప్రతిరోజూ ఆపిల్ తినడం వల్ల సమస్య తగ్గుతుంది. సాధ్యమైనప్పుడు తాజా ఆపిల్ తీసుకుంటూ దొరకనప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా ఆపిల్ సైడర్ వెనిగర్‌ను తీసుకోవచ్చు.
ఒక టీ స్పూన్ వెన్నను కరిగించి అందులో పావు టీ స్పూన్ ఇంగువ కలిపి వేయించాలి. దీనిని ఒక గ్లాసు మజ్జిగలో కాని ఇతర సూప్‌లు లేదా డ్రింకులతో కలిపి తీసుకుంటే రుతుక్రమంలో అపసవ్యతలు క్రమబద్ధం అవుతాయి.
పిప్పిపన్నుకి లవంగం పెడితే నొప్పి తగ్గుతుంది. లవంగనూనె వేస్తే పిప్పికి కారణమైన బ్యాక్టీరియా నశిస్తుంది. దీనిని స్వయంగా చేయడం కంటే నిపుణుల చేత చేయించుకుంటే మంచిది.
కడిపులో గ్యాస్ ఉత్పత్తి అవుతూ తరచుగా త్రేన్పులు వస్తుంటే ఐదు రోజులకొకసారి ఉదయం పరగడుపున అరకప్పు నీటిలో ఒక టీ స్పూన్ వెనిగర్ కలిపి తాగాలి.
అర టీ స్పూను ఆవపొడిలో మూడు టీ స్పూన్ల నీరు కలిపి ఈ మిశ్రమాన్ని ముక్కు రంధ్రాల్లో వేసుకోవాలి. ఈ చిట్కా మైగ్రేన్‌ను తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది.
బాగా వేడి చేసినప్పుడు కూడా తలనొప్పి వస్తుంది అలా వచ్చినప్పుడు పుచ్చకాయ రసంలో పంచదార కలుపుకుని తీసుకోవాలి.
రెండు ముక్కు రంధ్రాల్లోను కరిగించిన నెయ్యికాని, పెరుగుగాని 2-4 చుక్కలు వేసుకోవాలి. ఇలా వారం రోజులపాటు క్రమం తప్పకుండా చేయాలి.
గ్లాసు నీటిలో ఒక టీ స్పూను తేనె కలుపుకుని ఉదయాన్నే తీసుకోవాలి. దీర్ఘకాలికంగా తలపోటు ఉన్నవారికి ఇది మంచి చిట్కా.
దీర్ఘకాలికంగా తలపోటుతో బాధపడే వాళ్ళు ప్రతి రోజూ ఉదయం ఒక తాజా ఆపిల్‌ని తీసుకోవడం మంచిది. ఇలా కనీసం వారం రోజులైనా చేయాలి.
అల్లంపొడిని కొద్దిగా వేడిచేసి మెత్తటి వస్త్రంలో చుట్టి నుదుటిపై కాపడం పెట్టుకోవడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది.
గంధపు చెక్కతో తీసిన తాజా గంధాన్ని నుదుటిపై రాసుకోవాలి. పూర్తిగా ఆరిన తర్వాత చేతితో రబ్ చేసి నీటితో కడగాలి. ఈ చిట్కా పాటించడం చాలా సులభం, నొప్పి కూడా త్వరగా పోతుంది.
కొబ్బరినీళ్లు, చెరుకురసం సమపాళల్లో కలుపుకుని తాగితే తలపోటు నుండి ఉపశమనం కలుగుతుంది.
బేకింగ్ సోడాకు, నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని బాహుమూలాల వద్ద రాసుకుంటే దుర్వాసన తగ్గుతుంది.
30మి.లీ నీటిలో పది చుక్కలు ఎసన్షియల్ ఆయిల్ వేసి బాహుమూలాల వద్ద రాసుకోవాలి.
డీయోడరెంట్లు బదులు చెమట ఎక్కువగా పట్టే ప్రదేశంలో బేబీ పౌడర్ లేదా టాల్కమ్ పౌడర్ రాసుకోవాలి.
స్నానానికి ఉపయోగించే నీటిలో కొన్ని చుక్కలు రోజ్ వాటర్ కలుపుకోవాలి. ఇలా చేస్తే ఎలాంటి డీయోడరెంట్లు వాడనవసరం లేదు. ఇది చర్మాన్ని శుభ్రం చేస్తుంది.
బాహుమూలాలను వెనిగర్‌తో శుభ్రం చేఉకోవాలి.
ప్రతిరోజూ పరగడుపున 500 మి.గ్రాల గోధుమ గడ్డిని గ్లాసు నీటితో తీసుకోవాలి. దీనిలో ఉండే క్లోరోఫిల్ శరీరం నుండి వచ్చే చెడు వాసనను తగ్గిస్తుంది.
డయేరియా వంటి వ్యాధులున్నప్పుడు, వచ్చి తగ్గిన వెంటనే కూడా స్విమ్మింగ్ చేయకూడదు. సంబంధిత బ్యాక్టీరియా నీటిలో చేరి తర్వాత పుల్‌లో దిగిన వాళ్లకు సోకే అవకాశం ఉంటుంది.
పూల్‌లోని నీటిని మింగకూడదు. పిల్లలు నీటిలో ఉక్కిరిబిక్కిరి అయినప్పుడు నీటిని మింగేస్తారు. అలా జరిగిన రోజే డాక్టరును సంప్రదించి ఇన్‌ఫెక్షన్ సోకకుండా ముందస్తుగా వేసుకునే మందులు వాడాలి.
ఎండాకాలం వచ్చినదంటే స్విమ్మింగ్ పూల్స్ నిండుగా కనిపిస్తాయి. ఈత దేహానికి చక్కటి వ్యాయామం మాత్రమే కాక ఎండ నుంచి చక్కటి సాంత్వన కూడా కలుగుతుంది. పైగా పిల్లలకు సెలవులు వచ్చేస్తాయి. ఇవన్నీ కలిసి అందరినీ స్విమ్మింగ్ పుల్స్ వైపు అడుగులు వేయిస్తాయి. జాగ్రత్తలు తీసుకోకుంటే కొన్ని ప్రత్యేకమైన రుగ్మతుల బారిన పడే ప్రమాదముంది.
మహిళలకు ఎదురయ్యే గర్భాశయంలో ట్యూమర్స్ వంటి సమస్యల నుంచి రక్షించుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. గర్భాశయంలో అనవసర టిష్యూల పెరుదలను నిరోధిస్తుంది.
ఇందులో ఉండే లైకోపిన్ సమర్ధమైన యాంటీ ఆక్షిడెంట్. ఇది క్యాన్స్‌ర్ కారక సెల్స్‌ను నివారించడంలో బాగా పని చేస్తుంది.
ఇందులో విటమిన్ కె సమృద్ధిగా ఉంటుంది కాబట్టి రక్తం గడ్డకట్టని సమస్యతో బాధపడే వాళ్లు క్రమం తప్పకుండా ఆహారంలో టొమాటోను చేర్చుకోవాలి.
వీటిలోని నికోటినిక్ యాసిడ్ బ్లడ్‌లో కొలెస్ట్రాల్ స్ధాయిని తగ్గిస్తుంది. ఈ కారణంగా గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి.
నేచురల్ యాంటీసెప్టిక్‌గా పనిచేసి ఇన్‌ఫెక్షన్‌లను రానీయకుండా నివారిస్తుంది.
లివర్ సిర్రోసిస్ సమస్యను రాకుండా నివారిస్తుంది.
గ్లాసుడు దానిమ్మ రసంతో గుండె పదిలం
ఇందులో యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరం లోని ఫ్రీరాడికల్స్‌ను నియంత్రించి ఆరోగ్యానికి కాపాడడానికి సహకరిస్తాయి. క్యాన్సర్ వంటి రోగాలను నివారిస్తాయి.
రక్తనాళాలు, గుండె గదులు పటిష్టమవుతాయి. గుండె సంబందిత రోగుల మీద చేసిన పరిశోధనలో ఈ విషయం స్పష్టమైనది. కరోనరీ హార్ట్ డిసీజ్ పేషెంట్స్‌కు మూడు నెలల పాటు రోజుకు 250మి.లీ దానిమ్మరసం ఇచ్చినప్పుడు వారిలో రక్తనాణాల పనితీరు, రక్త ప్రసరణ 17 శాతం వృద్ధి చెందినట్లు ఇటలీలోని హెల్త్ యూనీవర్సిటీ నిర్ధారించింది.
కీళ్ల మధ్య ఉండే జిగురు వయసు పై బడే కొద్దీ తగ్గుతుంటుంది. దాంతో ఆస్టియో ఆర్ధరైటీస్ వంటి వ్యాధులు వస్తుంటాయి. దానిమ్మ రసం తీసుకుంటే జిగురు తగ్గకుండా ఉంటుంది.
ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఇందులో ఉండే శరీరానికి అవసరమైన రసాయనాలు క్యాన్సర్ నివారిణిగా పనిచేస్తాయి.
ఒంట్లో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను అదుపు చేస్తుంది.
బ్లడ్ ప్రెషర్‌ను క్రమబద్దీకరిస్తుంది. హైపర్ టెన్షన్, లో బీపి సమస్యలు తగ్గుతాయి.
ఇందులో ఎ, సి, ఇ, విటమిన్, ఫోలిక్ యాసిడ్, ఫైబర్ పొటాషియం, నియాసిన్‌లు ఉంటాయి.
గర్భిణిగా ఉన్నప్పుడు రోజూ దీనిని తీసుకుంటే పుట్టే పాపాయికి మేధోవికాసం బావుంటుంది.
ఆరోగ్యం కోసం గోధుమ గడ్డి (వీట్‌గ్రాస్) ని ప్రతీరోజూ తీసుకుంటే...
శరీరంలోని విషపదార్ధాలను సమర్ధంగా విసర్జింపచేస్తుంది.
కొత్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది.
హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది.
గాయాలు త్వరగా మానడానికి దోహదం చేస్తుంది.
జీర్ణశక్తిని వృద్ది చేస్తుంది, కాలేయాన్ని శుభ్రపరుస్తుంది.
రక్తాన్ని శుభ్రపరిచి, రక్తప్రసరణ వ్యవస్ధ పునర్నిర్మాణానికి సహయపడుతుంది. దీనిని గ్రైండ్ చేసి రసాన్ని రోజూ తాగవచ్చు. దీనిని మిక్సీలో కాని బ్లెండరులో కాని వేస్తే అందులోని ఔషద గుణాలు పోతాయి. చేత్తో నలపడం ద్వారా కాని, రాతి గ్రెండర్ లేదా రుబ్బురోలు వాడాలి. ఎలక్ట్రానిక్ జ్యూసర్ కూడా వాడవచ్చు.
గడ్డిలో కొద్దిగా నీటిని వేసి గ్రెండ్ చేయాలి. పేస్టులా వచ్చిన తరువాత కొద్దిగా నీటిని కలిపి రసం తీసుకోవాలి. తిరిగి అదే గడ్డిలో మరికొంత నీటిని కలిపి గ్రెండ్ చేసి రసం పిండాలి. ఇలా గడ్డిలోని పచ్చదనం పోయి తెల్లగా వచ్చేవరకు చేయాలి. ఈ రసాన్ని రోజుకు ఒక గ్లాసు తీసుకుంటే పైన చప్పిన ప్రయోజనాలన్నీ అందుతాయి.
పైనాపిల్ పయోజనాలు
పైనాపిల్ తరచుగా తీసుకుంటే మలబద్ధకం దరిచేరదు. ఇర్రెగ్యులర్ బొవెల్ మూవ్‌మెంట్‌కు ఇది చక్కటి మందు.
పైనాపిల్ దంతాలు, చిగుళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. జ్యూస్ తాగడానికంటే ముక్కలుగా తీసుకుంటే మంచిది. రోజూ ఒక కప్పు పైనాపిల్ ముక్కలు తింటే పై ప్రయోజనాలన్నీ సొంతమవుతాయి.
ఇందులో కొవ్వు పదార్ధాలు ఉండవు. శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు ఉంటాయి కాబట్టి బరువు తగ్గడానికి డైటింగ్ చేసే వాళ్ళు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.
పైనాపిల్‌లో సి విటమిన్, బ్రొమెలైన్ ఎంజైమ్ ఉంటాయి. మ్యూకస్‌ను పలుచబరిచి బ్రాంకైటిస్, డిఫ్తీరియా, గుండెపట్టేసినట్లు ఉండడం వంటి వ్యాధులను నివారిస్తాయి.
పేగులలో ఉండే సన్నని పురుగులను పైనాపిల్ పూర్తిగా హరిస్తుంది. క్రమం తప్పకుండా తీసుకుంటే పేగులను, కిడ్నీలను శుభ్రపరుస్తుంది.
ఎసిడిటీ నుంచి విముక్తికి...
భోజనం చేసిన ప్రతిసారీ కొద్దిగా బెల్లం ముక్కను నోట్లో పెట్టుకుని రసాన్ని మింగుతూ ఉండాలి.
గ్లాస్ మంచినీటిలో టీ స్పూన్ బేకింగ్ సోడా కలుపుకుని తాగాలి.
గ్లాస్ నీటిలో టీ స్పూన్ జీలకర్ర వేసి మరగకాచి తాగుతూ ఉన్నా సమస్య తగ్గుముఖం పడుతుంది.
రోజుకు మూడు, నాలుగుసార్లు కొబ్బరి నీళ్ళు తాగాలి.
టీ స్పూన్ అల్లంరసంలో అర టీ స్పూన్ తేనె, చిటికెడు పసుపు కలిపి రోజుకు మూడుసార్లు తీసుకుంటే సమస్య ఉండదు.
అరగ్లాస్ పాలను వేడిచేసి అందులో పావు టీ స్పూన్ పసుపు, పంచదార కలిపి వెచ్చగా ఉన్నప్పుడే తాగాలి.
చూయింగ్ గమ్ నములుతూ ఉన్నా ఎసిడిటీ సమస్య రాదు.
జాయింట్ పెయిన్ రిలీఫ్
బొప్పాయి గింజలతో తయారయిన టీ రోజుకు 6-7 సార్లు తీసుకోవాలి. ఇలా రెండు నుండి మూడు వారాలు తీసుకోవడం వల్ల కీళ్ళనొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.
వెల్లుల్లి రేకులను వెన్నలో వేయించి తీసుకోవడం వల్ల జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి.
ఒక టీ స్పూన్ పసుపును వేడి నీటిలో కలుపుకుని కనీసం రోజుకు మూడు సార్లు తీసుకోవడం వల్ల కీళ్ళవాతం కొంత వరకు తగ్గుతుంది.
పళ్ళన్నింటిలోనూ అరటి పండు కీళ్ళ నొప్పులకు మంచి ఔషధంలా పనిచేస్తుంది. ఇది బలాన్ని ఇస్తుంది.
క్యారట్ జ్యూస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల లిగమెంట్స్‌కు బలం చేకూరుతుంది.
రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని వెనిగర్‌తో జాయింట్స్ దగ్గర రబ్ చేసుకోవాలి.
గోముఖాసనం వేయడం అలవాటు చేసుకోవడం వల్ల కీళ్ళనొప్పులను దూరం చేసుకోవచ్చు.
లావు తగ్గాలంటే...
ఊబకాయం తగ్గించడంలో తేనె ఒక అద్భుతమైన ఔషధంగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజూ తేనెను గోరు వెచ్చని నీటిలో కలిపి తాగాలి. మొదటిరోజు పది గ్రాముల తేనెతో మొదలు పెట్టి నెమ్మదిగా మోతాదును పెంచుతుండాలి. లేదా ఒక టీ స్పూను తాజా తేనె, సగం నిమ్మకాయ రసాన్ని గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి తరచూ తీసుకుంటుండాలి.
ఒబెసిటీ సమస్య నుండి బయటపడటానికి పుదీనా కూడా ఉపకరిస్తుంది. పుదీనా ఆకులతో చేసిన పచ్చడిని భోజనంలో తీసుకుంటుండాలి.
ప్రతిరోజూ ఉదయం 10-12 కరివేపాకు ఆకులు తింటే బరువు తగ్గుతారు. ఇలా వదలకుండా మూడు నెలలపాటు చేస్తేనే ప్రయోజనం ఉంటుంది. అలాగే టొమాటా కూడా ఉదయం అల్పాహారానికి ముందు తీసుకోవాలి. ఇలా 3 నెలలు చేయాలి.
హై బీపీ తగ్గాలంటే...
అధిక రక్తపోటును అదుపు చేయడంలో వెల్లుల్లి బాగా పని చేస్తుంది. రోజుకు రెండు లేదా మూడు వెల్లుల్లి రేకలను పచ్చిగానే తినాలి. ఇది బ్లడ్ ప్రెషర్‌ని అదుపు చేయడమే కాకుండా తల తిరిగినట్లుండడం, నిరుత్సాహం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను కూడా తొలగిస్తుంది.
తాజా ఉసిరిక రసంలో అంతే మోతాదులో తేనె కలుపుకుని పరగడుపున తీసుకుంటే బ్లడ్ ప్రెషర్ అదుపులోకి వస్తుంది.
గుండె గదుల పనితీరును క్రమబద్దీకరించి, హైబీపీని కంట్రోల్ చేయడంలో ద్రాక్ష బాగా పని చేస్తుంది.
నిమ్మకాయ బిపిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఇది దాదాపుగా ఏడాది అంతటా అందుబాటులో ఉంటుంది. నిమ్మరసంతో పాటు తొక్క కూడా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
పుచ్చకాయ గింజలలో బీపీని అదుపు చేసే గుణం ఉంది. పుచ్చకాయ రసాన్ని(గింజలతో సహా గ్రైండ్ చేసినది) తీసుకుంటే రక్తనాళాలను పటిష్టపరిచి ప్రసరణ వేగాన్ని చేస్తుంది.
Friday, December 10, 2010
triphala ayurvedic powder
ఉసిరి, కరక్కాయ, తానికాయల మిశ్రమాన్ని త్రిఫల అంటారు. చలువచేసే గుణం ఉసిరి సొంతం. మలబద్ధకాన్ని పోగొడుతుంది. కర క్కాయ కాలేయ లోపాలను సరిదిద్దుతుంది. నాడీ సంబంధిత ఇబ్బందులను తొలగిస్తుంది. తానికాయ ఆస్తమా చికిత్సకు ఉపకరిస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. త్రిఫలచూర్ణం త్రిదోష రసాయనంగా పరిగణిస్తారు. మానవశరీర ఆరోగ్యంలో ప్రముఖపాత్ర వహించే వాత, పిత్త, కఫదోషాలను త్రిఫల చూర్ణం సరిచేస్తుంది. వాతం నాడీవ్యవస్థకు, పిత్తం జీవన క్రియలకు, కఫం శారీరక నిర్మాణానికి సంబంధించినది. ఈ మూడింటిని మెరుగుపరిచేగుణం త్రిఫలకు ఉంది. త్రిఫలాల మిశ్రమంఉసిరి, కరక్కాయ, తానికాయల మిశ్రమమైన త్రిఫలచూర్ణాన్ని నేటికీ అనేక ప్రాంతాల్లో ప్రతి రోజూ సేవిస్తారు. పిత్త దోషం చేత జీర్ణక్రియ మందగిస్తుంది. కఫదోషంతో కండరాలు, ఎముకలు, శరీర నిర్మాణ సంబంధమైన వ్యాధులు కలుగుతాయి. దగ్గు, గొంతు బొంగురు నివారణకు త్రిఫలచూర్ణం సేవించాలి. ప్రేగు గోడలకు కొత్తశక్తినిచ్చేందుకు, కడుపులో మంటను నివారించేందుకు, మొలలు తగ్గించేందుకు త్రిఫల ఉపయోగిస్తారు. ఉసిరిఉసిరిలో సి విటమిన్ అత్యధికంగా వుంటుంది. ఉసిరిలో టానిక్ ఆమ్లం, గ్లోకోజ్, ప్రొటీన్, కాల్షియంలు ఉన్నాయి. ఉసిరి పిత్తదోషాన్ని సరిచేస్తుంది. శరీరాన్ని చల్లబరుస్తుంది. సాఫీ విరోచనానికి దోహదపడుతుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. జ్వరాన్ని తగ్గిస్తుంది. కడుపులో వాపు, పేగుగోడల వాపు, కడుపులో మంటలు, పుండ్లకు ఉసిరి విరుగుడు. మలబద్దకం తగ్గిస్తుంది. విరోచనాలు, కాలేయ లోపం, కడుపులో మంటలను నిరోధిస్తుంది. బత్తాయితో పోలిస్తే 20 రెట్లు అధికంగా సి విటమిన్ ఉసిరిలో వుంది.తానికాయతానికాయ వగరు, ఘాటురుచి కలిగి వుంటుంది. దీనిలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఎలర్జీలను నివారిస్తుంది. ప్రేగుల్లో చేరిన పరాన్న జీవులను సంహరిస్తుంది. గొంతులో ఏర్పడిన ఇబ్బందులను తొలగిస్తుంది. రక్తస్రావాన్ని అరికడుతుంది. కఫదోషాలను నివారిస్తుంది. శరీరంలో అదనంగా చేరిన శ్లేష్మాన్ని తొలగిస్తుంది. ఉబ్బస వ్యాధులను నివారిస్తుంది. శ్వాసకోశ సమస్యలు, ఎడతెగని దగ్గులను నివారిస్తుంది. కరక్కాయత్రిఫలచూర్ణంలోని ముఖ్యమైన ఫలాల్లో కరక్కాయ ఒకటి. విరోచనాలను కట్టిస్తుంది. ఛాతీలో మంటను తగ్గిస్తుంది. కాలేయం సరిగా పనిచేసేటట్లు చేస్తుంది. వాత దోషాలను అరికడుతుంది. కండరాలు తీవ్రంగా కొట్టుకోవటాన్ని తగ్గిస్తుంది. నాడీ సంబంధిత ఇబ్బందులను తొలగిస్తుంది. మలబద్ధకాన్ని తొలగించి, నాడీ స్థిరత్వాన్నిస్తుంది. శారీరక బలహీనతను, అనవసరపు ఆదుర్దాలను తొలగిస్తుంది. జీర్ణాశయపు గోడలను బలోపేతం చేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆహారంలోని పోషకాలను గ్రహించేశక్తిని మెరుగుపరుస్తుంది.వాడే విధానంత్రిఫల తయారీకోసం వాడే మూడు ఫలాలను విడివిడిగా, నిర్ణీత మోతాదులో వాడాలి. ఈ మూడు ఫలాలకు జీర్ణవ్యవస్థను మెరుగురిచే శక్తి వుంది. కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది. కాలేయానికి చెరుపు చేసే విషపూరిత పదార్థాలను త్రిఫల తొలగిస్తుంది. త్రిఫలను నీటిలో కలిపిన కషాయంగా, రాత్రి పూట పాలు లేదా తేనెతో తీసుకోవాలి. వైద్యుని సలహాననుసరించి రోజూ రెండు నుండి అయిదు గ్రాముల త్రిఫల చూర్ణం ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు.
ఈ మూడు ఫలాల పొడులను సమపాళ్ళలో కలిపడం వలన ఇది శక్తివంతమౌతుంది. సమపాళ్ళలో కాక మూడుపాళ్ళు ఉసిరి, రెండు పాళ్ళు తానికాయ, ఒకపాలు కరక్కాయ కలిపిన త్రిఫల చూర్ణం, త్రిఫల మాత్రల రూపంలో కూడా తీసుకోవచ్చు. అజీర్ణం, విరేచనాలు వంటి ఇబ్బందులు ఉన్నప్పుడు రెండు స్పూన్ల నీటిలో ఒక స్పూన్ త్రిఫల చూర్ణం వేసి మరిగించి వడగట్టి ఆ కషాయానికి కొద్దిగా నీరు కలిపి తీసుకోవాలి. మలబద్ధకం బాధిస్తున్నప్పుడు అయిదు గ్రాముల త్రిఫలచూర్ణాన్ని కొద్దిగా తేనెతో కలిపి ఒక ముద్దగా చేసి అరకప్పు పాలతో పాటుగా పడుకునేముందు తాగితే ఇబ్బంది తొలగిపోతుంది. ఒక చెంచా త్రిఫ లచూర్ణం రెండు స్పూన్ల కొబ్బరి నూనెలో మరిగించి వడగట్టి ఆ నూనెను తలకు రాసుకుంటే శిరోజాలకు మంచిటానిక్‌లా పనిచేస్తుంది. తలస్నానం తరువాత త్రిఫల చూర్ణం కషాయంతో చివరిగా తలమీద పోసుకుంటే శిరోజాలు నల్లగా నిగనిగలాడుతూ ఉంటాయి. చర్మరక్షణకుత్రిఫల రక్తాన్ని శుద్ధిచేస్తుంది. రక్తశుద్ధితో చర్మవ్యాధులు తొలగిపోతాయి. ఎటువంటి చర్మతత్వం కలిగినవారికైనా త్రిఫల మేలు చేస్తుంది. చర్మ కోమలంగా ఉండేలా చేస్తుంది. చర్మానికి మెరుగునిస్తుంది. శరీరంలో పేరుకున్న విషపదార్థాలను తొలగిస్తుంది. చర్మంలోని రక్తనాళాల్లో రక్తప్రసరణను పెంచి చర్మాన్ని పరిశుభ్రంగా ఉంచుతుంది. చర్మానికి పోషణనిస్తుంది. చర్మానికి సహజంగా రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. కొందరి చర్మం సున్నితంగా వుండి ఎలర్జీలకు గురి అవుతుంది. ఈ లోపాన్ని త్రిఫల సరిచేస్తుంది. సూర్యరశ్శివలన కలిగే దుష్ప్రభావాలను కూడా త్రిఫల నిరోధిస్తుంది.ంతేకాదు త్రిఫల చూర్ణాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే రుతుచక్ర సమస్యలను కూడా అరికట్టవచ్చు. రుతుచక్రం సరిగ్గా లేనివారు వైద్యుని సలహామేరకు త్రిఫల చూర్ణాన్ని వాడవచ్చు.

health tips
వృద్ధాప్యంలోనూ ఆరోగ్యంగా…
By ధన్వంతరి on October 11, 2010 in ఆయుర్వేదంTags: అతిమధురం, ఆయుర్వేదం, ఉసిరికాయ, కరక్కాయ, గలిజేరు, జీడి గింజలు, తానికాయ, తిప్ప సత్తు, తులసి, త్రిఫల, పిప్పళ్ళు, మండూక పర్ణి, మలబద్ధకం, వృద్ధాప్యం
ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకుంటే వృద్ధాప్యంలో అయినా చలాకీగా ఉండవచ్చు. అక్టోబర్ వృద్ధుల మాసం. ప్రతి సంవత్సరం ఈ నెల మొదటి తారీకును ప్రపంచ వయోధికుల లేదా వృద్ధుల దినంగా పాటిస్తున్నారు. ఆయుర్వేదం వృద్ధులు జీవించినంత కాలం ఆరోగ్యవంతం గా, వ్యాధులకు దూరంగా బతికేందుకు తోడ్పడుతుంది. ఈ శాఖను ఆయుర్వేదంలో జర చికిత్స అంటారు. అంటే వృద్ధాప్య థెరపీ. దీనికి రసాయన అనే మరో పర్యాయపదం కూడా ఉన్నది. అంటే వ్యాధి నిరోధక, స్వయం సంరక్షక చర్యలు అని అర్ధం. ఆయుర్వేదం ప్రకారం 70 ఏళ్ళు దాటిన సంవత్సరానికి వృద్ధాప్యం ప్రారంభమవుతుంది. కానీ నలభై దాటినప్పటి నుంచే వృద్ధాప్య లక్షణాలు ప్రారంభం కావడం నేటి అనుభవం. శక్తి, బలం క్షీణించి, జీవితాన్ని చురుకుగా గడపలేకపోతారు. ఈ దశలో వ్యక్తిని అలసట, నిస్సత్తువ ఆవరిస్తాయి. భౌతిక, మానసిక కార్యకలాపాలు కుంటుపడతాయి. జ్ఞాపకశక్తి, మేధస్సు క్షీణించడం ప్రారంభమై వ్యాధులు త్వరగా ప్రభావితం చేస్తుంటాయి.
ఆయుర్వేదం ప్రకారం రస, రక్త, మాసం, మేధస్, అస్థి, మజ్జ, శుక్ర ధాతులతో కూడినది మానవ శరీరం. శరీరంలో చోటు చేసుకునే మార్పుల వల్ల ఈ ధాతువులు క్షీణిస్తాయి. ఈ ధాతువులలో సారంతరగిపోవడంతో రోగనిరోధక శక్తి తగ్గి వ్యాధులు త్వరగా సంక్రమించే సున్నితమైన ఆరోగ్య పరిస్థితులు ఏర్పడతాయి. వృద్ధాప్యంలో ఈ ధాతువుల సామర్ధ్యాన్ని పెంచలేం కానీ వాటిని సంరక్షించి పునరుజ్జీవింపచేయవ చ్చు. రసాయన చికిత్స లాభాలను ఆయుర్వేద గ్రంథాలు సవివరంగా పే ర్కొంటాయి. జీవితాన్ని పొడిగించడం, జ్ఞాపకశక్తిని పెంచడం, ఇన్ఫెన్లు, వ్యాధులు రాకుండా నిరోధక శక్తిని, మనస్సును యవ్వన స్థితిలో ఉంచేం దుకు సాయపడడం, వ్యక్తి ఛాయతో పాటు గొంతును మెరుగుపరచడం ద్వారా సమాజంలో గౌరవనీయంగా జీవించేందుకు, సంపూర్ణ ఆరోగ్యా న్ని సాధించేందుకు ఈ ప్రత్యేక చికిత్స అభివర్ణిస్తుంది. ఆయుర్వేదం వృద్ధాప్య సమస్యలను గుర్తించడమే కాదు అటువంటివి సంభవించకుండా నిరోధించే చికిత్సలను రూపొందించింది.
వృద్ధాప్య సమస్యలు:
అశక్తత, నిస్సత్తువ, వ్యాధులు, మరణం పట్ల భయం అన్నవి వృద్ధాప్యంలో ప్రధానంగా కనుపించే సమస్యలు. వయోధికులలో కనుపించే ఇతర సమస్యలు-కేంద్ర నరాల వ్యవస్థ, మెదడు: పక్షవాతం, సయాటికా, అల్జీమర్స్ వ్యాధి, పార్కిన్సన్స్ వ్యాధి, మూర్ఛ, న్యూరోసిస్, సైకోసిస్, మానసిక సమస్యలు, నిద్రలేమి.గుండె, రక్త నాళాలు: ఆంజినా పెక్టోరిస్, హృదయదమని లోపాలు, హైపర్‌టెన్సివ్ గుండె జబ్బులు, గుండెపోటు, గుండెకు సంబంధించిన ఇతర సమస్యలే కాకుం డా జన్యుపరమైన, జీవక్రియా సంబంధ సమస్యలైన మైలాయిడ్ లుకేమియా.
కాలేయం, పిత్తాశయ సమస్యలు: తీవ్రమైన హెపటైటిస్, పిత్తాశయంలో రాళ్ళు, సిరోసిస్.
జీర్ణాశయ సమస్యలు: మలబద్ధకం, ఊబకాయం, చక్కెర వ్యాధి
ఊపిరితిత్తులు: బ్రాంకైటిస్, ఎంఫిసీమా, ఆయాసం వంటి సమస్యలు
కీళ్ళు: రుమెటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, స్పాండిలైటిస్, ఆస్టియో పొరాసిస్, సొరియాటిక్ ఆర్థరైటిస్ వంటివి వచ్చే ప్రమాదం ఉంటుంది.
మూత్రవాహిక: పురుషులలో ప్రోస్ట్రేట్ గ్రంధి పెరగడం, నెఫ్రైటిస్, చక్కెర వ్యాధి వల్ల రీనల్ సమస్యలు రావడం వంటిపలు సమస్యలు వస్తాయి.
చర్మం, కండరాలు: సొరియాసిస్, హెర్పిస్, డెర్మటోసెస్, జుట్టు, గోళ్ళ వ్యాధులు, మోటార్ న్యూరాన్ వ్యాధివల్ల సంక్రమించే రోగాలు ఉంటాయి.
వినాళగ్రంధి (ఎండోక్రైన్ గ్లాండ్స్): హైపో, హైపర్ థైరాయిడిజమ్, నపుంశకత్వం, స్ర్తీ, పురుషులలో మెనోపాజ్ సిండ్రోమ్ తదితర సమస్యలు.
ఇంద్రియాలు : చత్వారం, గ్లకోమా, పాక్షిక లేదా పూర్తి చెవుడు, మెనీర్స్ సిండ్రోమ్, వెర్టిగో వంటివి సంభవిస్తాయి.
సులువైన చర్యల ద్వారా వృద్ధాప్యాన్ని, దానికి సంబంధించిన వ్యాధులను నిరోధిం చడం సాధ్యమని ఆయుర్వేదం చెప్తుంది. సరళమైన, నిరాడంబర జీవనమే దాని రహస్యం. ఆయుర్వేదం ప్రకారం ఆహారం, నిద్ర, బ్రహ్మచర్యాలే వ్యాధిరహిత జీవితాన్ని గడిపేందుకు మూలమైన స్తంభాలు. మితాహారం శరీర జీవసంబంధ ప్రక్రియను క్రమబద్ధం చేస్తుంది.
మితాహారం, నిరాడంబర జీవనశైలే వ్యాధి రహిత సుదీర్ఘ జీవితానికి మంత్రం. జీవనశైలి విషయంలో చేయాల్సినవి, చేయకూడనివి ఆయుర్వేదంలో నిర్దిష్టంగా పేర్కొన్నారు. అది ఒక ప్రత్యేకశాఖగా ఉంది.సంపూర్ణాహారాన్ని తీసుకొని, క్రమబద్ధమైన జీవితాన్ని గడుపుతూ తన మాటలలో, చేతలలో సమతులంగా ఉంటూ, కోరరానివి కోరకుండా, నిజాయితీగా, క్షమాబుద్ధితో పెద్దల ఎడల గౌరవంతో జీవించే వారికి ఎటువంటి వ్యాధులు సంక్రమించవు. పంచకర్మతో పాటుగా జీవన శైలిలో మార్పులతో పాటు అనేక ఆయుర్వేద మందుల తయారీని ఆయుర్వేద గ్రంథాలు వివరిస్తాయి.
వృద్ధాప్య సంరక్షణలో ఉపయోగపడే మొక్కలు:
ఆముదం: ఆముదం విరేచనకారి అని అందరికీ తెలుసు.అయితే వృద్ధాప్య సమస్యలను నిరోధించడం, చికిత్స చేయడంలో ఈ మొక్కకున్న ఉపయోగాలు కొద్ది మందికే తెలుసు.1. ఆముదం వేరును నాలుగు భాగాల నీళ్ళలో అది ఒక వంతు వచ్చే వరకు మరిగించి రోజూ తీసుకుంటే వృద్ధాప్యంలో వచ్చే వాత సంబంధ వ్యాధులను నిరోధించవచ్చు.2. 8-10 ఆముదం గింజలను పొట్టుతీసి 200 మిల్లీలీటర్ల పాలు, 50 గ్రాముల బెల్లం వేసి మరిగించి, ప్రతి రోజూ సాయంత్రం ఈ పాయసాన్ని తీసుకుంటే వృద్ధాప్య సంబంధమైన ఆర్థరైటిస్ సమస్యలను నివారించవచ్చు.3. గోధుమపిండిలో స్వచ్ఛమైన ఆముదాన్ని కలిపి చపాతీలు చేసుకొని తింటే డయాబెటిస్, ఆర్థరైటిస్ సమస్యలే కాక మలబద్ధకం కూడా తగ్గుతుంది.
తామరపువ్వు: వృద్ధులకు అత్యంత ఉత్తమమైన టానిక్ ఇది. అనేక ప్రాంతాలలో ప్రజలు అందుకే తామర కాడలను కూరలాగా చేసుకుంటారు. తామరాకును విస్తరిగా ఉపయోగిస్తారు. ఇది కణాలను సంరక్షిస్తుందని జపాన్‌లో చేసిన పరిశోధనలలో రుజువైంది. తామర రేకులు కొలస్ట్రాల్‌ను తగ్గించడమే కాక గుండె, మెదడుకు రక్తప్రసరణను మెరుగు పరుస్తాయి.
ఏలక్కాయి: వృద్ధాప్య సమస్యలకు సంబంధించిన అన్ని ఆయుర్వేద మందులలో దీనిని సాధారణంగా ఉపయోగిస్తారు. ఇది మంచి ఆంటాసిడే కాక వాయుహరి కూడా. జీర్ణక్రియను పెంచడమే కాక అసిడిటీ, కళ్ళె వంటి వ్యాధులలో ఉపశమనాన్ని ఇస్తుంది.
ఉసిరికాయ: ఆరోగ్యాన్ని పెంపొందించే, వయసును నిరోధించే మూలిక ఇది. కొలెస్ట్రాల్ వల్ల వచ్చే గుండె వ్యాధుల, రక్త ప్రసరణ సమస్యల బారి నుంచి కాపాడుతుంది. చలికాలంలో అవసరమైన కేలరీ డైట్ సప్లిమెంట్‌ను అందిస్తుంది.
తులసి: రోగనిరోధక శక్తిని పెంచడమే కాక చలికాలంలో వచ్చే జలుబు, దగ్గులను తగ్గిస్తుంది.
కరక్కాయ: ఆయుర్వేదం ప్రకారం వ్యాధులను, వృద్ధాప్యాన్ని నిరోధించడంలో అత్యున్నతమైన మందు ఇది. కరక్కాయపొడి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఇది అన్ని వయసుల వారూ తీసుకోవచ్చు. అలాగే పైల్స్ వంటి వ్యాధులను తగ్గించడంలో ఇది గొప్పగా పని చేస్తుంది.
త్రిఫల: ప్రాచీన విజ్ఞానం ప్రకారం ఇది ఉత్తమమైన వయో నిరోధక చికిత్స. అయితే దీనిని వివిధ రుతువుల్లో వివిధ పదార్ధాలతో కలిపి తీసుకోవాలి.1. వర్ష రుతువులో – సైంధవ లవణంతో కలిపి2. శరత్ రుతువు – పంచదారతో కలిపి3. హేమంత రుతువు – శొంఠితో కలిపి4. శిశిర రుతువులో – పిప్పళ్ళతో కలిపి5. వసంత రుతువు – తేనెతో కలిపి6. గ్రీష్మ రుతువు – బెల్లంతో కలిపి
తానికాయ: ఇది త్రిఫలాలలో ఒకటి. దీనిని మలబద్ధకం, విపరీతమైన కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు, లివర్, స్ల్పీన్ సమస్యల్లోనూ, కంటి వ్యాధులు, బాలనెరుపుకు ఉపయోగిస్తారు.
తిప్ప సత్తు: రోగనిరోధక శక్తిని కాపాడడంలో పెంచడంలో ఇది ప్రముఖమైనది. వాత తత్వం ఉన్నప్పుడు నెయ్యితో కలిపి, పిత్త తత్త్వంలో పటిక బెల్లం, కఫ తత్వం ఉన్నవారు తేనెతో కలిపి తీసుకోవాలి. గౌటీ ఆర్థరైటిస్‌లో ఆముదంతో కలిపి తీసుకోవాలి. మలబద్ధకం ఉన్నప్పుడు బెల్లంతో కలిపి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు అల్లం పొడితో కలిపి తీసుకోవాలి.
మండూక పర్ణి: దీనిని మందుగా కన్నా కూడా ఆహారంగా మన దేశంలో ఎక్కువగా తీసుకుంటారు. దీనికి ఒత్తిడిని తగ్గించే, జ్ఞాపక శక్తిని పెంచే లక్షణాలు ఉన్నాయి. అల్జిమీర్స్ వంటి వ్యాధులలో ఉపయుక్తం.
అతిమధురం: పిల్లలలో వచ్చే జలుబు, దగ్గులకు దీనిని చిట్కా వైద్యంగా వాడుతుంటారు. నోటి అల్సర్లకు ఇది మంచి మందు. వృద్ధాప్యంలో శ్వాసకోశ సమస్యలకు మంచి మందని చరకుడు అభిప్రాయపడ్డాడు.
గలిజేరు: ఇది గ్రామాలలో దొరికే మూలిక. దీనిని ఆహారంగా తీసుకోవచ్చు. దీనివేర్లలో పొటాషియం నైట్రేట్ అధికంగా ఉంటుంది. మూత్ర నాళ సంబంధ సమస్య, కొన్ని గుండె సంబంధ వ్యాధు చికిత్సలో ఉపయోగపడుతుంది.
పిప్పళ్ళు: ఇది జీర్ణప్రక్రియకు ఉపయోగపడుతుంది. ఆర్థ్రైటిస్, మలబద్ధకం వంటి వాటిలో ఉపశమనాన్ని ఇస్తుంది.
జీడి గింజలు: ఇది అత్యుత్తమ పునరుజ్జీవనిగా ఉపయోగపడుతుంది. దీనిలో కాన్సర్ నిరోధక శక్తిని ఇటీవలి అధ్యయనాలు వెల్లడించాయి. టిష్యూల నిర్మాణంలో, వాటిని ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడటం వల్ల దాని గింజలను వృద్ధాప్య సంబంధిత సమస్యలను నివారించేందుకు సూచిస్తారు.
వృద్ధాప్యంలో వచ్చే కీళ్ళ నొప్పులను తగ్గించేందుకు ఇంట్లోనే చేసుకుని వాడదగ్గ కషాయం:
మెంతులు: 100 గ్రా, జీలకర్ర : 50 గ్రా, మిరియాలు – 05 గ్రామూడింటిని కొద్ది నేతిలో వేయించి పొడి చేసుకొని ఉంచుకోవాలి. ఒక చెంచా పొడిని తీసుకొని ఒక గ్లాసు పాలలో వేసి దానిని కొద్ది సేపు మరగించి రోజుకు ఒకటి రెండు సార్లు తీసుకోవాలి. ఒక వారం రోజులలోనే తేడా కనుపిస్తుంది. ఉపశమనం కలిగే వర కూ ఎన్ని రోజులైనా దీనిని తీసుకోవచ్చు.

Subscribe to:
Comments (Atom)