Wednesday, September 17, 2008
Monday, July 7, 2008
బతుకమ్మ
బతుకమ్మ పండుగ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తెలంగాణా ప్రాంతములో ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ (గౌరి) పండగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది.
.
విషయ సూచిక |
బతుకమ్మ పండుగ విశిష్టత
సెప్టంబరు, అక్టోబరు నెలలు తెలంగాణా ప్రజలకు పండుగల నెలలు. ఈ నెలలలో రెండు పెద్ద పండుగలు జరపబడతాయి. ఈ పండుగలకు కనీసం పదిహేను రోజులు అటువైపు, ఇటువైపు అంతా పండుగ సంరంభాలు, కుటుంబ కోలాహలాలు, కలయకలుతో నిండిపోయుంటుంది. ఈ పండుగలలో ఒకటి బతుకమ్మ పండుగ, మరియొకటి దసరా (విజయ దశమి). అయితే బతుకమ్మ పండుగ మాత్రం, తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమయిన పండుగ. తెలంగాణ సాంస్కృతిక ప్రతీక ఈ పండుగ. ఇతర చోట్ల పూలు, నీళ్లతో జరుపుకునే పండుగలు ఎన్ని ఉన్నా, అవి ఏవీ కూడా బతుకమ్మ పండుగతో సరిపోలవు.
ఈ పండుగ వర్షాకాలపు చివరిలో, శీతాకాలపు తొలి రోజులలో వస్తుంది. అప్పటికే వర్షాల వలన చెరువలన్నీ మంచి నీటితో నిండి ఉంటాయి. రకరకాల పువ్వులు రంగు రంగులలో ఆరుబయలలో పూసి ఉంటాయి. వీటిలో గునుక పూలు, తంగేడి పూలు బాగా ఎక్కువగా పూస్తాయి. బంతి, చేమంతి, నంది వర్ధనం లాంటి పూలకు కూడా ఇదే సమయం. సీతాఫలాలు (శిల్పక్క పండ్లు అంటారు) కూడా ఈ సమయంలో ఒక పెద్ద ఆకర్షణ. సీతాఫలాన్ని పేదవాని ఆపిల్ అంటారనేది తెలిసినదే. అలాగే జొన్న పంట కోతకు సిధ్ధంగా తలలూపుతూ ఉంటుంది. వీటన్నింటి నేపధ్యంలో తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతమయిన రంగురంగుల పువ్వులతో కీరిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు.
పండుగ సంబరాలు
ఈ పండుగ సద్దుల బతుకమ్మ (బతుకమ్మ చివరి రోజు మరియు దసరాకు రెండు రోజుల ముందర) రోజుకు ఒక వారం ముందు మొదలవుతుంది. ఈ రోజుల్లో ఆడపడుచులు అందరూ అత్తవారింటి నుంచి కన్నవారింటికి చేరుకుని స్వేచ్ఛావాయువులు పీలుస్తూ ఈ పూల పండుగ జరుపుకోవటానికి తయారవుతారు.ఈ వారం రోజులలో వీరు రోజూ చిన్న బతుకమ్మలు చేసి, ప్రతీ సాయంత్రం దాని చుట్టూ తిరుగుతూ ఆడుతారు. ఆ తరువాత దగ్గరలో ఉన్న జలాలలో నిమజ్జనం చేస్తారు.
అయితే చివరి రోజు అత్యంత మనోహరంగా ఉంటుంది. ఆ రోజు మగవారంతా పచ్చిక బయళ్ళలోనికి పోయి తంగేడి, గునుక పూలను భారీగా ఏరుకుని వస్తారు. ఆ తరువాత ఇంటిళ్ళపాదీ కూర్చుని ఆ గునగ పూలు, తంగేడు, కలువ, మరియు ఇతర రకాల పూలతో బతుకమ్మని తయారు చేస్తారు. ఇందులో గునగ పూలు మరియు తంగెడు పూలు ముఖ్య భూమిక ను పోషిస్తాయి.
ఈ పూలని జాగ్రత్తగా ఒక రాగి పళ్ళెం (తాంబలం)లో వలయాకారంగా, రంగులు మార్చుకుంటూ పేరుస్తారు. ముందుగా తంగెడు ఆకులు, పూలు పళ్లెంలో లేదా తాంబోలం లో పేర్చుతారు, ఆపై తంగేడు పూలతో కట్టలుగా కట్టిన కట్టలను చివరలు కోసి రంగులతో అద్దిన వాటిని పేర్చుతారు. మధ్య మధ్యలో ఇతర రకాల పూలను ఉపయోగిస్తారు. ఈ అమరిక ఎంత పెద్దదిగా ఉంటే అంత అందంగా ఉంటుంది. తెల్లని గునుక పూలను రంగులతో అద్ది, మధ్యలో తంగేడి పూలను పెడతారు. పేర్చడం అయ్యాక పైన పసుపుతో చేసిన గౌరి మాతను పెట్టి చుట్టు దీపాలతో అలంకరిస్తారు. దీనిని గృహంలో దైవ స్థానంలో అమర్చి పూజిస్తారు. ఇలా తయారు చేసిన బతకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరి దేవిని కీర్తిస్తూ ఆడవారు పాడుతారు. ఆడవారు వారికి ఉన్న అన్ని రకాల ఆభరణాలను దరించి కొత్త బట్టలు కట్టుకుంటారు. ఇలా చాలా సేపు ఆడాక మగవారు వాటిని చెరువులో నిమజ్జనం చేస్తారు. ఆపై ఆ పళ్లెంలో తెచ్చిన నీటితో ఆడవారు వాయినమమ్మా వాయినం అంటూ వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు.
ఆపై ఇంటి నుండి తీసుకువచ్చిన పెరుగన్నం మరియు సత్తుపిండి( మొక్కజొన్నలు, లేదా వేరుశనగ లేదా పెసర విత్తనాలను దోరగ వేయించి వాటిని పిండి చేసి వాటితో చక్కెర పిండి లేదా బెల్లం మరియు నెయ్యి తగినంత కలిపి తయారు చేస్తారు)లను ఇచ్చి పుచ్చుకొని తింటారు
చివరి రోజు సాయంత్రం, ఆడపడుచులు అందరూ చక్కగా దుస్తులు, అభరణాలు ధరించి బతుకమ్మను వాకిలిలో పెడతారు. చుట్టుపక్కల ఉన్న వారు కూడా వారి బతుకమ్మలను ఇదే విధంగా అమర్చి వాటి చుట్టూ పెద్ద వలయాకారంలో చేరుతారు. ఐక్యత, సోదరభావం, ప్రేమను కలపి రంగరిస్తూ మానవ హారం ఏర్పరిచి పాటలు పాడుతారు. ఒకరు ముందుగా పాట మొదలుపెడితే మిగిలినవారు వారితో గొంతు కలుపుతూ పాడుతారు. ఈ జానపద గీతాలు చుట్టు పక్కలా ప్రతిధ్వనిస్తూ ప్రత్యేకమైన తెలంగాణా సంస్కృతిని ఆవిష్కరిస్తాయి.
చీకటి పడుతుంది అనగా,స్త్రీలందరూ ఈ బతుకమ్మలను తలపై పెట్టుకుని ఊరిలో ఉన్న పెద్ద చెరువు గానీ, తటాకంవైపు గానీ ఊరేగింపుగా బయలుదేరుతారు. ఈ ఊరేగింపు అందంగా అలంకిరించుకున్న స్త్రీలు, బతుకమ్మలతో అత్యంత సుందరంగా, వైభావయానంగా ఉంటుంది.ఈ ఊరేగింపు కొనసాగినంత సేపూ, జానపద గీతాలతో వీధులు మారుమోగుతాయి. జలాశయం చేరుకున్న తరువాత, మెల్లగా బతుకమ్మలను పాటలు పాడుతూ,ఆడుతూ నీటిలో జారవిడుస్తారు. ఆ తరువాత "మలీద" (చక్కెర మరియు రొట్టెతో చేసినది) అనే పిండి వంటకాన్ని బంధు మిత్రులకు పంచిపెడతారు. ఆ తరువాత ఖాళీ తాంబలంతో పాడుతూ, బతుకమ్మను కీర్తిస్తూ ఇంటికి చేరుతారు. ఈ వారం రోజులూ,ఈ పాటలన్నీ అర్ధరాత్రి వరకూ వీధులలో మారు మ్రోగుతూనే ఉంటాయి.
[మార్చు] పండుగ కధ
ఈ బతుకమ్మ పండుగ వెనుక చాల కథలు ఉన్నాయి. బాగా ప్రాచుర్యంలో ఉన్నదిది : ఒక బాలిక భూస్వాముల ఆకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంటే, ఆమెను ఆ ఊరి ప్రజలు చిరకాలం "బతుకమ్మా !" అని దీవించారంట అందుకనే ఈ పండుగ స్త్రీలకు సంబంధించిన, బతుకమ్మను కీర్తిస్తూ జరుపుకునే పండుగ. స్త్రీలందరూ ఈ సందర్భంగా వారు ఎటువంటి ఆపదల పాలు కారాదనీ, పతులు మరియు కుటుంబం చల్లగా ఉండాలనీ గౌరమ్మను ప్రార్ధిస్తారు.
ఇంకొక వృత్తాంతములో దక్షిణ భారతాన్ని పాలించిన చోళ వంశ చక్రవర్తి ధర్మాంగదుడు సంతానము లేక అనేక పూజలు పునస్కారాలు చేయగా ఈయన భార్య గర్భవతియై లక్ష్మీ దేవి అనుగ్రహముతో ఒక కూతుర్ని కన్నది. పసిబిడ్డైన లక్ష్మి అనేక గండములను గట్టెక్కినది కావున ఈమె తల్లితండ్రులు బతుకమ్మా అని నామకరణము చేసినారు. అప్పటినుండి యువతులు మంచి భర్తను ప్రసాదించాలని కోరుతూ బతుకమ్మను కొలవడము ఆన్వాయితీ అయ్యిందని ఈ కథ చెబుతున్నది.
బతుకమ్మ పండుగ ప్రకృతిని అరాధించే పెద్ద పండుగ. పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృధ్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి, భూమితో, జలంతో, మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకోబడుతుంది. ఈ సంబరాలు జరుపుకునే వారం అంతటా స్త్రీలు "బొడ్డెమ్మ" (మట్టితో చేసే దుర్గాదేవి బొమ్మ) ను బతుకమ్మతో పాటూ చేసి నిమజ్జనం చేస్తారు
దీపావళి
భారతీయ సంస్కృతి కి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి.
దీప మాళికల శోభతో వెలుగొందే గృహాంగణాలు, ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండివంటల ఘుమఘుమలు, బాణసంచా చప్పుళ్ళు, ఈ దివ్య దీపావళి సోయగాలు!
విషయ సూచిక |
దీపం జ్యోతి పరబ్రహ్మమ్
భిన్నత్వంలో ఏకత్వాన్ని సృజించే ఈ దీపావళి కోటి కాంతుల రవళి- విరిసే చైతన్య దీప్తుల జావళి. కొత్త ఆశలతో , ఆశయాలతో ఈ దీపావళి మానవ జీవితంలో పారమార్థిక వెలుగు రేఖ లను పూయిస్తుందని హైందవజాతి ప్రగాఢ విశ్వాసం.
" దీపం జ్యోతి పరబ్రహ్మమ్
దీపం సర్వతమోహరమ్
దీపేన సాధ్యతే సర్వమ్
సంధ్యా దీపం నమామ్యహమ్ "
అంటూ మహిళామణులంతా ప్రార్థిస్తూ ఆశ్వయుజ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో దీపాలను వెలిగిస్తారు. చివరకు ఈ దీపాలను ముత్తయిదువులు కార్తీక పౌర్ణమికి సముద్ర స్నానాలను ఆచరించి జీవనదులలో వదులుతారు. ఇవి సౌభాగ్యానికి, సౌశీల్యానికి, సౌజన్యానికి ప్రతీకలుగా భావిస్తారు. పైగా ఈ దీపావళి శరదృతువులో అరుదెంచటం విశేషం. మనోనిశ్చలతకు, సుఖశాంతులకు అనువైన కాలమిది.
సత్యం-శివం-సుందరం
పంచభూతాలలో ప్రధానమైనది అగ్ని. ఈ అగ్ని ప్రాణికోటి మనుగడకు ఉపకరించే తేజస్సును, ఆహారాన్ని ఐహికంగాను, విజ్ఞాన ధర్మగరిమను ఆధ్యాత్మికంగాను ప్రసాదిస్తుంది. ఈ దీపాల వెలిగింపు ద్వారా మూడు రంగులు ప్రధానంగా మనకు గోచరమవుతాయి. నీలము, పసుపు, తెలుపు- ఈ మూడు రంగులు మానవ మనుగడకు అవశ్యకమైన సత్త్వరజస్తమోగుణాల సమ్మేళనంగా ఆర్యులు చెబుతుంటారు. ఈ మూడు రంగులను జగతిని పాలించే లక్ష్మి, సరస్వతి, దుర్గలుగా భావిస్తారుట పౌరాణికులు. అంతేకాక సత్యం-శివం-సుందరం - అవి దీప ప్రజ్వలన ద్వారా త్రిజగన్మాతలను ఆరాధించినట్లును, మానవులకు విజ్ఞానం, వివేకం, వినయాలకు సంకేతమని సందేశాత్మకంగా గైకొంటారు భారతీయులు.
" అంధతమిస్రంచ దక్షిణాయనమేవచ
ఉత్తరాయణే తస్మా జ్యోతిర్దానం ప్రశస్వతే "
అంధ తమ్స్రమనేది ఒక నరకం, దక్షిణాయన పాపకాలం నుండి తప్పించుకొని తరించడానికి ఉత్తరాయణ పుణ్యకాలంలో జ్యోతి ని దానం చేయుట ఉత్తమోత్తమమైన కార్యంగా భావిస్తారు హైందవులు.
ఆశ్వయుజ మాసంలో వచ్చే బహుళ చతుర్ధశి , అమావాస్య లు పరమ పవిత్ర పర్వదినాలు. భక్తి విశ్వాసాలతో , ఆనందోత్సాహాలతో దేశమంతటా పిల్లలూ, పెద్దలూ అందరూ కలసి జరుపుకునే పండుగ రోజులివి.
నరక చతుర్దశి
ఆశ్వయుజ బహుళ చతుర్దశి నరక చతుర్దశి గా ప్రసిద్ధి పొందింది. నరకాసురుడు నే రాక్షసుడు చెలరేగి సాధు జనాలను పీడిస్తూ దేవ, మర్త్య లోకాలలో సంక్షోభాన్ని కలిగిస్తుంటాడు. కృతయుగం లో హిరణ్యాక్షుని వధించిన వరాహస్వామి కి, భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మిస్తాడు నరకుడు. అతడు లోక కంటకుడైనా మహావిష్ణువు వధించరాదని, తల్లియైన తన చేతిలోనే మరణించేలా వరం పొందుతుంది భూదేవి. మహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానునిగా అవతరించినప్పుడు భూదేవి సత్యభామ గా జన్మింస్తుంది.
అప్పటికి నరకాసురుడు లోక కంటకుడై చేస్తున్న అధర్మకృత్యాలను అరికట్టడానికి సత్యభామా సమేతంగా తరలి వెళ్తాడు శ్రీకృష్ణుడు. వారి మధ్యజరిగిన భీకర సంగ్రామంలో భూదేవి అంశ అయిన సత్యభామ శరాఘాతాలకు మరణిస్తాడు నరకుడు.
తన పుత్రుని పేరైనా కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్థశిగా పిలువబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు. నరకుని చెరనుండి సాధుజనులు, పదహారువేలమంది రాజకన్యలు విడిపించబడ్డారు, ధ్రర్మం సుప్రతిష్టమైంది.
నరకుని మరణానికి సంతోషంతో మర్నాడు అమావాస్య చీకటిని పారద్రోలుతూ దీపాలతో తోరణాలు వెలిగించి బాణాసంచా కాల్చి పండుగ జరుపుకోవడం, అదే దీపావళి పండుగగా ప్రసిద్ది చెందడం జరిగాయి.
దీపావళి
దీపావళి అంటే దీపోత్సవం. ఆ రోజు దీప లక్ష్మి తన కిరణాలతో అమావాస్య చీకట్లను పాలద్రోలి జగత్తును తేజోవంతం చేస్తుంది. ఆ వేళ సర్వశుభాలు, సంపదలు ప్రసాదించే లక్ష్మీదేవిని పూజించడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. దివ్వెల పండుగ దీపావళినాడు లక్ష్మీదేవిని పూజించడానికి కారణం శాస్త్రాలలో క్రింది విధంగా చెప్పబడింది.
తైలే లక్ష్మీర్జలే గంగా దీపావళి తిథౌవసేత్!
అలక్ష్మీ పరిహారార్థం తైలాభ్యంగో విధీయతే!.
దీపావళినాడు నూనెలో ( ముఖ్యంగా నువ్వులనూనె) లక్ష్మీదేవి, నదులు, బావులు, చెరువులు మొదలైన నీటి వనరులలో గంగాదేవి సూక్ష్మ రూపంలో నిండి వుంటారు. కనుక ఆ రోజు నువ్వుల నూనెతో తలంటుకుని సూర్యోదయానికి ముందు నాలుగు ఘడియలు అరుణోదయ కాలంలో అభ్యంగన స్నానం తప్పకుండా చేయాలి. ఇలా చేయుడం వల్ల దారిద్ర్యం తొలగుతుంది, గంగానదీ స్నాన ఫలం లభిస్తుంది, నరక భయం ఉండదనేది పురాణాలు చెపుతున్నాయి.
అమావాస్యనాడు స్వర్గస్థులైన పితరులకు తర్పణం విడవడం విధి కనుక దీపావళినాడు తైలాభ్యంగన స్నానం తరువాత పురుషులు జలతర్పణం చేస్తారు. యమాయ తర్పయామి, తర్పయామి తర్పయామి' అంటూ మూడుసార్లు దోసెట్లో నీరు విడిచిపెట్టడం వల్ల పితృదేవతలు సంతుష్టిచెంది ఆశీర్వదిస్తారు.
స్త్రీలు అభ్యంగన స్నానానంతరం కొత్త బట్టలు కట్టుకుని ఇండ్ల ముందు రంగురంగుల ముగ్గులు తీర్చి గుమ్మాలకు పసుపు , కుంకుమలు రాసి మామిడాకు తోరణాలు కట్టి సాయంత్రం లక్ష్మీపూజకు సన్నాహాలు చేసుకొంటారు. రకరకాలైన రుచికరమైన భక్ష్యభోగ్యాలతో నైవేద్యానికి పిండివంటలు సిద్దం చేయడం, మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె పోసి పూజాగృహంలో, ఇంటి బయట దీప తోరణాలు అమర్చడం, ఆ రోజంతా ఎక్కడలేని హడావుడి, ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాంటాయి.
దిబ్బు దిబ్బు దీపావళి
దిబ్బు దిబ్బు దీపావళి
మళ్ళీ వచ్చే నాగులచవితి...
అంటూ చిన్న పిల్లలంతా గోగునార కట్టలకి చిన్న చిన్న గుడ్డ ముక్కల్ని కట్టి వెలిగించి దిష్టి తీయడాన్ని మనం సంప్రదాయం గా కొన్ని ప్రాంతాలల్లో చూస్తూంటాం. సాయంత్రం ప్రదోష సమయంలో దీపాలు వెలిగించి, ముందుగా పిల్లలు దక్షిణ దిశగా నిలబడి దీపం వెలిగించడాన్ని ఉల్కాదానం అంటారు. ఈ దీపం పితృదేవతలకు దారి చూపుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ దీపం వెలిగించిన తరువాత కాళ్ళు కడుక్కుని ఇంటిలోపలకు వచ్చి తీపి పదార్థం తింటారు. అటు తరువాత పూజాగృహంలో నువ్వులనూనెతో ప్రమిదలు వెలిగించి దీపలక్ష్మికి నమస్కరించి కలశంపై లక్ష్మీదేవిని అవాహన చేసి విధివిధానంగా పూజిస్తారు. పూజానంతరం అందరూ ఉత్సాహంగా బాణాసంచా కాల్చడానికి సంసిద్దులౌతారు. చిచ్చుబుడ్లు, విష్ణుచక్రాలు, భూచక్రాలు, మతాబులు, కాకరపువ్వొత్తులు, కళ్ళు మిరుమిట్లుగొలుపుతుంటే మరో ప్రక్క సీమటపాకాయల ఢమఢమ ధ్వనులతో మ్రోగుతుంటాయి పరిసరాలన్నీ. ఈ విధంగా బాణాసంచా కాల్చడానికి ఒక ప్రయోజనం చెప్పబడింది పురాణాలలో, ఆ వెలుగులో, శబ్దతరంగాలలో దారిద్ర్య దు:ఖాలు దూరంగా తరిమి వేయుబడి లక్ష్మీకటాక్షం సిద్దిస్తుందని, అంతేకాక వర్షఋతువులో ఏర్పడిన తేమవల్ల పుట్టుకువచ్చే క్రిమి కీటకాలు బాణాసంచా పొగలకి నశిస్తాయి.
అసుర నాశనానికి, ధర్మ ప్రతిష్టాపనకు గుర్తుగా అమావాస్యనాడు జరుపుకునే దీపావళి పండుగనాడు లక్ష్మీదేవికి ప్రతీకగా వెలుగులు విరజిమ్మే దీపలక్ష్మిని పూజించడం సర్వశుభాలు ప్రసాదిస్తుంది.
దీపావళి చుట్టూ అనేకానేక కథలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు సత్యభామ సహకారంతో నరకాసురుణ్ణీ వధించాడు గనుక ప్రజలు ఆనందంతో మరునాడు దీపావళి సంబరం చేసుకుంటారని ఒక కథ. ఇంకో కథకూడా ఉంది. లంకలో రావణుని సంహరించి , రాముడు సీతాసమేతంగా అయోధ్య కు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు ఆనందంతో ఈ పండుగ జరుపుకున్నారని చెబుతారు. ఉత్తరాదివారు ముఖ్యంగా వ్యాపారులు దీపావళి రోజును కొత్త సంవత్సరంగా పాటిస్తారు. ఆ రోజు లక్ష్మీదేవి పూజచేసి కొత్త ఖాతా పుస్తకాలు తెరుస్తారు. దీపావళి పండుగల్లాంటివే ప్రపంచంలోని అన్ని సమాజాల్లోనూ ఉన్నాయి.
దసరా
ఉగాది
ఉగాది, తెలుగువారు జరుపుకునే పండుగలలో ముఖ్యమయినది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. ఉదయాన లేచి తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. దేవస్థానములకు వెళ్ళి పూజలు చేయిస్తారు. పంచాంగ శ్రవణం వింటారు.
విషయ సూచిక |
ఉగాది ప్రాముఖ్యం
చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించారని నమ్ముతారు. అంతే కాదు వసంత ఋతువు కూడా అప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవితానికి నాందికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు. [1]
ఉగాది పచ్చడి
ఉగాదినాడు షడ్రుచుల సమ్మేళనం - తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తింటారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సండేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు.
ఉగాది పచ్చడికి మనశాస్త్రాలలో "నింబ కుసుమ భక్షణం" మరియు "అశోకకళికా ప్రాశనం " అని వ్యవహరించే వారు.ఋతు మార్పు కారణంగా వచ్చే వాత,కఫ ,పిత్త దోషాలను హరించే ఓఉషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైంది.ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్దతిలో ఉప్పు'వేపపువ్వు,చింతపండు,బెల్లం,పచ్చిమిరప కాయలు,మామిడి చిగుళ్ళు మరియు అశోక చిగుళ్ళు వేసి చేసేవాళ్ళు.ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
త్వామష్ఠ శోక నరాభీష్ట
మధుమాస సముద్భవ
నిబామి శోక సంతప్తాం
మమ శోకం సదా కురు
ఈ మంత్రం చదువుతూ ఉగాది పచ్చడి తినాలని శాస్త్రాలు చెప్తున్నాయి.ఉగాది పచ్చడి చేసే ఆచారం ఆహారం లో ఉండే ఓఉషధ గుణాన్ని,వృక్షసంరక్షణ అవసరాన్ని,ఆయుర్వేదానికి ఆహారానికి గల సంభందాన్ని చెప్పాడమే కాక హిందూ పండుగలకు,ఆచారాలకు సముచిత ఆహారానికి గల సంబంధాన్ని చాటిచెప్తుంది.
ఉగాది ప్రసాదం
ఉగాది రోజున దేవునికి నైవేద్యం పెట్టవలసిన ప్రశాదంలో ముఖ్యంగా పానకం ,వడపప్పు చోటు చేసుకుంటాయి.ఉగాదితో వేసవి ఆంభం అవుతుంది కనుక వేసవి తాపం తట్టుకోవడానికి పానకం లాంటి నీరాహారం తినడం ఆవసరాన్నిఇది గుర్తు చేస్తుంది అలాగే వడపప్పు కూడా వడ పప్పు లో వాడే పెసరపప్పు చలవచేస్తుం కనుక వేసవిలో కలిగే అవస్థ లను ఇది కొంత తగ్గిస్తుంది.ఇలాంటి ఆహారాన్ని ఉగాది రోజునే కాక ఈ రుతువు మొత్తం తీసుకోవాలన్నా సూచన ఈ ఆచారంలో నిబిడీకృతమై ఉంది.ఉగాదికి విసన కర్రలను పంచే ఆచారం ఉంది.ప్రస్థుత కాలంలో ఉన్న పంఖా లాంటి,ఏసీ మరియు ఎయిర్ కూలరు లాంటి వసతులు లేనికాలంలో వేసవిలో సంభవించే గాలి లేమిని విసనకర్రాలు కొంత తీరుస్తాయి కనుక ఈ ఆచారం ఉగాదితో ప్రారంభం అవుతుంది.
విశేషాలు
- ఈ పండుగ తెలుగు వారికి తెలుగు సంవత్సరము ప్రకారముగా తొలి పండుగ.
- ఈ పండుగ ప్రతీ సంవత్సరము చైత్ర శుద్ధ పాడ్యమి రోజున వస్తుంది.
- ఈ రోజు ప్రతి ఊరిలో దేవాలయాలలో, కూడళ్ళలో, సాంసృతిక సంస్థలలో ఆ సంవత్సరం అంతటా జరిగే మార్పులు, వార ఫలితాలతో పంచాంగ శ్రవణం జరుగుతుంది.
- ఈ రోజు ప్రతి వారు కొత్తగా పనులు మొదలు పెట్టడం, కొత్తగా కార్యక్రమాలు ప్రారంబించడం చేస్తారు.
- ఈ పండుగను యుగాది (యుగ+ఆది) అని కూడా అంటారు.
- తమిళులు మేష సంక్రాంతి మొదటి రోజు ఉగాది జరుపుకుంటారు.
- కృతయుగంలో కార్తికశుద్ధ అష్టమి రోజు ఉగాది జరుపుకునేవారు.
- త్రేతా యుగంలో వైశాఖ శుద్ధ తదియ రోజు ఉగాది జరుకునేవారు.
- ద్వాపరయుగంలో మాఘశుద్ధ అమావాస్య రోజు ఉగాది జరుపుకునే వారు.
- శ్రీరాముడు,విక్రమాదిత్యుడు,శాలివాహనుడు పట్టాభిషిక్తులైంది చైత్ర శుద్ధ పాడ్యమి రోజే.
- వరాహమిహిరుడు పంచాంగాన్ని జాతికి అంకితం చేసింది చైత్ర శుద్ధ పాడ్యమి రోజే.
- కొత్త లెక్కలు ఆరంభించే రోజు ఉగాది.
- పంచంగ శ్రవణం చేసేరోజు ఉగాది.
a-z
jokes
temple
exam
journey
results
pancard
bank
statement
online
internet]
india
suryapet
america
names
cheif minsiter
prime minister
assembly
parallament
kashmir
delhi
mumbai
hyderabad
telangana
kolkata
festivals
beatiful
zoo park
flower park
childhern paly gound
games
circket
fun
comedy
movies
bollywood
tollywood
hollywood
hero
herione
make up
Sunday, July 6, 2008
మిగిలింది
భర్త : అవుననుకో! కాని.. పమాత్రమే ఇంకా ఓ వెయ్యి రూపాయలు
లోపం
"ఏమన్నాడు?" ఉత్సాహంగా అడిగింది మాల.
"నలభై రకాల పరీక్షలు చేయించాడు. ఆర్నెల్ల మందులు వాడించాడు. అయినా ఫలితం కనిపించలేదు"
"ఇంతకూ లోపం ఎవరిలో ఉందని నీ అనుమానం?"
"Doctorలో ఉందనుకుంటున్నాను" నిమ్మళంగా అన్నది లక్ష్మి. ళ్ళషాపు వాడికి
బరువు
"హు.... ఏం తగ్గడమో ఏమో? మా గుర్రం మాత్రం ఇరవై కేజీలు బరువు తగ్గింది" నిట్టూరుస్తూ చెప్పింది దుర్గ. బాకీ ఇవ్వాల్సి ఉంది.
Paper
"ఇదివరుకుట్లా weekly కొనడం మానేశానోయ్. ప్రతి వారం పత్రిక కొనగానే చుట్టుపక్కలున్న ప్రతి గాడిద అడిగేవాడే. విసుగెత్తి మానేశాను." చెప్పాడు కామేశం.
"మరి ఈ weekly ఎవరిది?".
"పక్కింటి వారిది. ఇప్పుడే అడిగి తెచ్చాను."
ప్రశాంతం
"చచ్చేముందైనా కాస్త ప్రశాంతంగా చద్దామని యువరానర్" దవడలాడించాడు తాతారావు.
కల
"మరి వచ్చిందా?" కుతూహలంగా అడిగాడు నరసింహుడు.
"రాక రాక తెల్లవారుఝామున ఒక కల వచ్చింది" చెప్పాడు పండు.
"ఇంకేం. దేవుడు నీ మొర ఆలకించాడన్నమాట" అన్నాడు నరసింహుడు.
"నా బొంద ఆలకించడం. శాంతకుమారి, ఋష్యేంద్రమణి వచ్చారు" అని అన్నాడు పండు.
చెముడు
"అదెంత భాగ్యమోయ్! నా పని అదే కదా. కాకపోతే రెండు వేల రూపాయలు నా Fees అవుతుంది" చెప్పాడు Doctor.
"బాబ్బాబు... చచ్చి మీ కడుపున పుడతాను. పిల్లలు కలవాణ్ణి. అంతిచ్చుకోలేను ఓ మూడు వేలల్లో పని అయ్యేట్లు చూడండి." Doctor కాళ్ళు పట్టుకున్నాడు పుల్లయ్య.
అప్పు
"హమ్మయ్య బతికించావు. ఇంకా నన్ను అడుగుతావేమోనని హడలి ఛస్తున్నా" పారిపోతూ అన్నాడు రఘు.
మంత్రం
"ఏం లేదు. నువ్వు తల ఎత్తినప్పుడు అరవై ఏళ్ళ బామ్మలా, తలదించినప్పుడు ఇరవై ఏళ్ళ అప్సరసలా ఉన్నావన్నా. అంతే!" చెప్పాడు రాజు.
Family Planning
"Oh Yes.... ఎందుకైనా మంచిది మీతోపాటు మీ ఆవిడను కూడా చేయించుకోమని చెప్పాండి" పరధ్యానంగా అన్నాడు Doctor.
శపథం
"Very good.... చాలా మంచి పని. మరి ఎవరిచేతైనా అలామాన్పించావా?" అడిగాడు కృష్ణమూర్తి.
"ఇప్పటికి 999 మంది చేత ఆ అలవాటు మాన్పించాను"
"అద్భుతం! ఇంకొక్కడేగా మిగిలింది! అది కూడా పూర్తి చేయకపోయావా?"
"అదే చూస్తున్నా. నేను కూడా మానేద్దామా, వద్దా అని" గొణిగాడు బ్రాందిమూర్తి.
ఈ bus ఎక్కడికి వెళ్తుంది
"గుంటూరు వెళ్తుంది" అని బదులిచ్చాడు conductor.
"మరి board మీద విజయవాడ అని రాసి ఉంది కదా?" అని ప్రశ్నించాడు ప్రయాణికుడు.
"నువ్వు బస్సెక్కి వెళ్తావా? లేక బోర్డ్ ఎక్కి వెళ్తావా?" అని కసురుకున్నాడు conductor.
అచ్చొచ్చేది
"దానికంత విచారం దేనికిరా? కోడిగుడ్ల వ్యాపారంలోకి దించు రాణిస్తాడు" చెప్పాడు సీతాపతి.
మళ్ళీ
"భయపడకోయ్... operation success అనేదాంట్లో అణుమాత్రం సందేహం లేదు. కానీ నిన్న operation చేస్తున్నప్పుడు మా doctor గారి రత్నాల ఉంగరం మీ పొట్ట్లో జారి పదిపోయిందట" చెప్పాడు compounder.
అవకాశం
"చాలా సంతోషం బాబూ. అమ్మాయినేమైనా ప్రశ్నలు అడగదలుచుకుంటే ఇప్పుడే అడుగు. పెళ్ళైన తరువాత నీకు ఆ అవకాశం రాకపోవచ్చు" ఆనందం పట్టలేక అన్నాడు సుందరి తండ్రి రాజనాల
అన్యాయం
"అంత అన్యాయం ఏం జరిగిందిరా?" నవ్వుతూ అడిగాడు తండ్రి.
"లేకపోతే! మా టీచరేమో పుస్తకం చూస్తూ పాఠం చెబుతుంది. మమ్మల్ని మాత్రం చూడకుండా పాఠం అప్పజెప్పమంటుంది, తప్పుకాదూ" ముక్కుపుటలు విశాలం చేస్తూ అన్నాడు ప్రమోద్.
దిష్టి
"మీరు కూర్చోండి. డాక్టరు గారు లోపల ఉన్నారు" అన్నాడు కాంపౌండరు.
"త్వరగా పిలవండి ప్లీజ్"
"వస్తారుండమ్మా డాక్టరుగారికి రాత్రి నుంచి తలపోటుగా వుంటే వాళ్ళమ్మ చేత దిష్టి తీయించుకుంటున్నారు" చెప్పాడు కాంపౌం
విలువ
"చిత్తం సార్" వెళ్ళి రెండు నిమిషాల్లో తెచ్చాడు సర్వర్.
"ఆహా... కమ్మగా ఉన్నాయ్... ఉప్పు చక్కగా సరిపోయింది. పిండి రోట్లో రుబ్బారా?" తింటూ అడిగాడు బ్రహ్మానందం.
"అవును సార్"
"ఎంతైనా గ్రైండర్లో రుబ్బితే ఇంత రుచి రాదు. చాలా బాగున్నాయి. మరో నాలుగు పట్రా"
"థ్యాంక్యూ సార్. మీరైనా ‘చెమట’ విలువ గ్రహించారు" వెళ్ళాడు సర్వర్.
jokes
coffee
"అత్తగారింటికి వెళ్ళినప్పుడు మీకు మెదటిసారి కఫీ ఎలా ఇస్తారో మా స్పెషల్ కాఫీ ఎప్పుడూ అలాగే ఉంటుంది" చెప్పాడు సర్వర్.
పేరు
"మీ పేరు?" అడిగాడు అధికారి.
"శ్రీ...శ్రీ...శ్రీ...శ్రీ...శ్రీ...శ్రీ...శ్రీ...శ్రీనివాస్ సర్" చెప్పాడు అభ్యర్థి.
"ఏంటి... అన్ని శ్రీ లెందుకు మీకు?"
"న...న...న...న...న... నాకు నత్తి సార్"
ఇంటివాడు
"మరింకేమండీ! ఇప్పుడు మీరు ఒక్క ఇంటివారే కదా! నా జ్యోతిష్యాన్ని తిడతారేం?" అన్నాడు జ్యోతిష్కుడు.
అలవాటు
"సిగరెట్స్ తాగడం మానేశాను" అన్నాడు ఆరుద్ర.
"అదేం పెద్ద గొప్ప? నేను అలా చాలాసార్లు మానేశాను" అన్నారు ముళ్ళపుడి.
దేవుడా.....
ఓ మంచి దేవుడా.....
నువ్వు నాకు ఫ్లాప్ అవ్వడానికి
- జాన్నీ ఇచ్చావ్.....
- గుడుంబా శంకర్ ఇచ్చావ్....
- బాలు ఇచ్చావ్.....
- బంగారం కూడా ఇచ్చావ్....
ఇలాగే మన స్టేట్‍లో ఉన్న ఏడుగురు హీరోలకి ఇస్తావని.....
అలాగే మన countryలో ఉన్న 150 మంది హీరోలకి....
అదే చేత్తో ప్రపంచంలో ఉన్న ????? - నాకు number correctగా తెలియదు.....
ఎంత మంది ఉంటే అంతమందికీ ఇవే flops ఇస్తావని
అంటే as it is గా ఇవే flops కాదు...
వాళ్ళు ఏ సినిమా తీస్తే ఆ సినిమా
- స్టాలిన్
- అశోక్
- మున్నా
- సైనికుడు
- విక్రమార్కుడు
- ....
అలాగే ఇస్తావని కోరుకుంటున్నాను.....
నువ్వు ఇస్తావ్ నాకు తెలుసు....
ఎందుకంటే... basically you are GOD....
you are very good GOD....
అంతే....That's all....
నా ప్రార్ధన మీ అందరికీ కొంచెం కొత్తగా అనిపించొచ్చు....
బరువు
"dcotor.. doctor... రేపు సాయంత్రం ఆరుగంటలలోగా నేను కనీసం 20 కిలోల బరువు పెరగాలి. ఏవైనా మంచి మందులు చెప్పండి" రొప్పుతూ అన్నాడు.
"ఇదేంటి కవిగారూ... అందరూ బరువు తగ్గడానికి మందులకోసం వస్తారు. మీరు పెరగాలంటారేంటి?" ఆశ్చర్యంగా అన్నాడు doctor.
ఇల్లు ఇల్లాలు
"ఆ.... అదేం లేదురా! ఎన్నేళ్ళు పోయినా అదే ఇల్లు, అదే ఇల్లాలు" నవ్వుతూ అన్నాడు సీతారాం.
"శివం సంస్థవారు రేపు నాకు సన్మానం చేసి రూపాయి నాణాలతో తులాభారం తూస్తారట" చెప్పాడు కవి.
Biscuit
"కాకి తినెది ఎంగిలి మెతుకులు. అవైతే నేనూ మొత్తం చెల్లికే ఇచ్చేవాడిని" అన్నాడు టింకు.
నమ్మకం
"మనతో పాటు మీ నర్స్ కూడా ఉంటే బాగుంటుంది డాక్టర్..." అన్నది కామేశ్వరి.
"అదేంటమ్మా.... నామీద నమ్మకం లేదా?" బాధగా అన్నాడు డాక్టర్.
"మీ మీద కాదండి. బయటున్న మాఆయనకు నా మీద నమ్మాకం లేదు" చెప్పింది కామేశ్వరి.
బాధ
"ఏంటండీ.... రాత్రి పన్నెండయింది. పైగా మన పెళ్ళిరోజు. ఇలా తాగొచ్చారేంటీ" కోపంగా అంది అంబిక.
"అవును అంబీ... ఆ బాధను మర్చిపోవడానికే ఇలా తాగొచ్చాను" సోఫాలో కూలబడుతూ అన్నాడు పరమేశం.
రచయిత్రి
"అబ్బా.. చాలా కష్టపడ్డారన్నమాట" అన్నాడు విలేఖరి.
"అవును రాయడం వారం రోజుల్లో అయింది. Publisher వెతకడానికి 20 సంవత్సరాలు పట్టింది" అన్నది కామాక్షి.
బెలూన్
"శుభమస్తు.. ఏం బాబూ నాదస్వరం నేర్చుకుంటావా? నెలకు నాలుగు వందలౌతుంది" అన్నాడు నారదన్.
"లేదంకుల్.. నా బెలూన్ ఎంతసేపు ఊదినా గాలి పోవడం లేదు. కొంచెం గాలి ఊది పెడతారేమోనని వచ్చాను" అన్నాడు.
అగ్ని ప్రమాదం
"అయ్యో..... అయ్యో... ఆ భవనం అలా కాలిపోతుంటే అలా చోద్యం చూస్తారేంటి. వెంటనే Fire stationకి phone చెయ్యండి" అరిచాడు.
"ఆ కాలిపోయేది Fire Stationఏ నాయనా" బదులిచ్చాడో ఆసామి.
సినిమా
గోపీ : అవును Teacher. సినిమా ADsలో ఏ మందు వేసుకోవాలో చూపిస్తారని.
లాంఛనాలు
"ఎందుకండీ నా కలాంటివేమీ వద్దు. ఒక washing machine, ఒక grinder ఇప్పించండి చాలు. నాకు పని తప్పుతుంది" అనాడు “ముందుచూపుతో” నారాయణ.
దగ్గు
అరగంట సేపు దగ్గిన తరువాత భార్యకు మండిపోయింది.
"అబ్బబ్బ... మీదగ్గు వినలేకపోతున్నాను" అన్నది.
"నన్ను మాత్రం ఏమి చేయమంటవు. ఇంతకన్న పెద్దగా దగ్గటం నావల్ల కాదు. ఖళ్ ఖళ్ ఖళ్...."
చదువు
"భయపడకు ఆనంద్.... Suddenగా పులి ఎదురొచ్చినప్పుదు చేతులు రెండు పక్కలకు జూపి దిష్ఠి బొమ్మలా కదలకుండా నిలుచుంటే పులి ఏమీ చేయదని మొన్న ఒక పత్రికలో చదివాను." ధైర్యం చెప్పాడు సంజీవి.
"నువ్వు చదివావు సరే. మరి ఆపులి ఆ పత్రిక చదివిందా అని" వణుకుతూ అన్నాడు ఆనంద్.
రహస్యం
"క్షమించండి సార్.... ఇవన్నీ రహస్యాలని ఇంతవరకూ నాకు తెలియదు" చల్లగా అన్నాడు ఆంజనేయులు.
ఆటగాడు
"ఏమైంది? మరి ఆటగాడు కాదా అతను" అడిగింది శ్రీదేవి.
"ఆటగాడే.... తోలుబొమ్మల్ని ఆడిస్తుంటాడటా పల్లెటూర్లలో.." ఏడ్చింది సుమలత.
పరాయి స్త్రీ
"ఏఁ.. మీ నాన్న నీకు ఏ అమ్మాయినీ ప్రేమించడానికి ఛాన్స్ ఇవ్వడా?.... తనే ముందు enter అవుతాడా!!!?" అంటూ అనుమనంగా అడిగిందా Hi-tech lover.
సామెతలు - ప్రేమ, పెళ్ళి
"త్వరగా ప్రేమించు అని".
"మరి.. నిదానమే ప్రధానమంటే?"
"కాస్త ఆలోచించి పెళ్ళి చేసుకో అని".
Parking
"Sorry.... ఇది no parking zone", చెప్పాడు police.
"మరిక్కడ వంద scooterలు ఉన్నాయ్?"
"వారెవరూ మీలా నన్ను అడగలేదు" చెప్పడు police. .
తెలివితేటలు
"అవును నిజమే. నా తెలివితేటలన్నీ నా దగ్గరే ఉన్నాయి" అన్నది రాధ.
Steel సామాను
"Camp ఆ నా బొందా? Steel సామాన్లవాడిని నేను officeకి వెళ్ళగానే రమ్మన్నావుగా. అందుకె నాజాగ్రత్తలో నేనుండాలి" బయలుదేరాడు శ్రీధర్.
మాయం
"ఓ! ఇప్పుడర్థమైంది. నా తలలోకి వచ్చిన నొప్పి మీదేనా?" తలపట్టుకుని అన్నాడు అర్జున్రావు.
పిసినారితనం
"సర్లే, ఈపూలను Fridgeలో పెట్టి రోజుకొకటి జడలో గుచ్చుకో" అన్నాడు శాంతారాం.
సిగ్గు లేదా?
నేరస్థుడు : మరి మీకు? నేను అప్పుడప్పుడు మాత్రం వస్తున్నాను. మీరు రోజూ వస్తున్నారుగా?
ఎలా వెళ్ళాలి
"జుట్టు బాగా పెంచుకుని వెళ్ళాలి." చెప్పాడా పెద్దమనిషి..
తెలుసుకుందామని....
"జోగినాధం.... లోపలికెళ్ళి సువర్చల గారున్నారేమో చూడూ" అన్నాడు రామనాధం.
"అమ్మో... వాళ్ళింట్లో పెద్ద కుక్క ఉన్నది. మీద పడి పీకుతుంది." భయంగా అన్నాడు జోగినాధం.
"అది తెలుసుకుందామనే గదా నేను నిను అడుగుతున్నది...." అన్నడు రామనాధం
పుట్టిన రోజు
రాము : August 14 న teacher.
Teacher : ఏ సంవత్సరం?
రాము : ప్రతి సంవత్సరం.
Teacher : !!!!!
అమ్మావా??
శ్రోత : ఇంతవరకు ఏమైనా అమ్మావా?
రచయిత : ఆ!....., ఒక వాచీ, ఉంగరం...
మలుపులు
"అదేంటి సార్.... కథల్లో
గెడ్డం
"ఓ నలభై, ఏభై సార్లు" చెప్పాడు సుధాకర్.
"ఏంటి... అన్నిసార్లా... నీకేమైనా పిచ్చా?"
" కాదురా... ఈమధ్య సెలూన్ స్టార్ట్ చేశాను" ఎన్నో మలుపులుండాలని మీరే కదా అన్నారు?" కళ్ళు విశాలం చేస్తూ అన్నది సులోచన.
పెళ్ళికి తొందర
"అప్పుడే ఏం తొందర దాని పెళ్ళికి?" ఆశ్చర్యంగా అన్నాడు సహదేవరావు.
"దానికి బట్టలుతుక్కోవడం చాలా శ్రమగా ఉందట" చెప్పింది అన్నపూర్ణ.
నిద్ర
"ఏదైనా government ఉద్యోగం సంపాదించండి. మీసమస్య తీరుతుంది." చెప్పాడు Doctor.
రక్షించండి
వెంటనే నలుగురు యువకులు నీటొలో దూకి ఒక ముసలమ్మను బయటకు తెచ్చారు. ఎంత వెతికినా అక్కయ్య కనిపించలేదు.
"సారీ బాబూ.... మీ బామ్మను మాత్రమే రక్షించగలిగాం. అక్క కనిపించలేదు" విచారంగా అన్నారు యువకులు.
"Thanks uncles.. మునిగిపోయింది మా బామ్మే" అన్నాడు రవి.
యువకులు తెల్లముఖాలు వేశారు.
ఉత్తరాలు
"అవును. డబ్బు పంపమని మానాన్నకు రాస్తూంటాను" నిబ్బరంగా చెప్పాడు రమణ.
(దీన్నే కాస్త modernగా ...
"ఏమిటి కేవలం computer మీద బతుకుతున్నావా? బ్లాగులు వగైరా రాస్తున్నావా ఏమిటి?" కుతూహలంగా అడిగాడు రాజ్.
"అవును. డబ్బు online transfer చెయ్యమని మా Daddyకి E-mail పంపిస్తూ ఉంటాను" నిబ్బరంగా చెప్పాడు అరవింద.)
చినగదు
"గుడ్డ చాలా బాగుంది. కానీ వద్దులే" అన్నాడు అప్పారావు.
"అదేం సార్.. పెద్ద ఖరీదేం కాదు"
"ఖరీదు సంగతి కాదు. నాకు రెండు మీటర్లు చాలు. కానీ చినగదంటున్నావు కదా! ఎలా చించిస్తావు?" అడిగాడు అప్పారావు.
వయసు
"ఏం మందిచ్చాడేం?" కుతూహలంగా అడిగాడు ఏకాంబరం.
"వయసు పెరుగుతున్నది కదా. అందుకే అలసట అన్నడు. అంతే! మర్నాటి నుంచి నలుగురు మనుషుల పని చకచక చేస్తున్నది" అన్నడు చిదంబరం.
అనుభవం
"ఏం అలా అంటున్నారు?"
"ఏం లేదు. నేను ముప్పై సంవత్సరాల నాటి కథలు కాపీ కొడితే మీరు ఏభై సంవత్సరాల నటి కథలు కాపీ కొడుతున్నారు."
రైలు ప్రయణం - పెళ్ళికి ముందు, తరువాత
రాము, సీతల పెళ్ళి నిశ్చితార్ధం అయిపోయింది. ఇద్దరూ హైదరాబాదులో software ఉద్యోగం. వాళ్ళ కుటుంబాలు (అమ్మా, నాన్నలు మటుకు విశాఖపట్టణంలో). ఒక weekend ఇద్దరూ విశాఖపట్టణం కలిసి వెళ్తున్నారు.
సమయం : 22:00 hrs
సీత : ఏంటి ఇంత త్వరగా station కి వచ్చారు?
రాము : నేను మామూలుగా రైలు 22:30 కి అంటే 22:00 కల్లా station కి వచ్చేస్తాను.
రాము : సరే. నేను అలా వెళ్ళి water bottle కొనుక్కొని వస్తాను.
సీత : సరే
ఒక రెండు నిమిషాల తరువాత రాము పరుగెత్తుకుంటూ వస్తాడు. Water bottleతో పాటు చిన్ని చిన్ని గుండెలు (brittania little hearts) biscuit packet కూడా తీసుకు వచ్చాడు.
సీత : ఎందుకు అలా పరుగెత్తి వస్తున్నారు? మెల్లగా రావచ్చు కదా?
రాము : మ్.. అంటే.. నువ్వు ఒక్క దానివే ఉన్నావు కదా. అందుకని.
సీత : అయ్యో.. అసలు ఎప్పుడూ నేను ఒక్కదానినే ప్రయాణం చేస్తాను. ఇదే మొదటిసారి ఇంకొకరితో కలిసి వెళ్ళటం.
రాము : సరే పద వెళ్ళి రైల్లో కూర్చుందాము.
రాము, సీత రైలు ఎక్కుతారు.
సీత : side upper side lower book చేసారా?
రాము : అవును. ఇలా అయితే హాయిగా ఎదురు ఎదురుగా కూర్చుని ఎంచక్కా కబుర్లు చెప్పుకోవచ్చు.
అవీ ఇవీ అన్నీ మాట్లాడుకుంటున్నారు. మిగతా ప్రయాణికులు అంతా నిద్రపోయారు కానీ వీళ్ళు మాత్రం మాట్లాడుటూనే ఉన్నారు. ఇంతలో ఒక పెద్ద మనిషి వచ్చి " మీరు కొంచెం మెల్లగా మాట్లాడుకోండి. మా నిద్రను disturb చేస్తున్నారు".
సరే అని రాము, సీత తలుపు దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక గంటెసేపు కూర్చి, మాట్లాడుకుని వచ్చి తమ తమ berth ల లో పడుకున్నారు.
పెళ్ళైన తరువాత
పెళ్ళైన తొమ్మిది నెలల తరువాత మళ్ళీ రాము, సీత ప్రయాణమయ్యారు. ఇద్దరూ train ఎక్కారు.
సీత : ఏ బెర్త్??
రాము : రెండు upper berths book చేసాను (మనసులో వెధవ నస ఉండదు)
సీత : హమ్....
రాము : సరే water bottle ఇవ్వు.
సీత : water bottle లేదు. Stationలో కొందామని అనుకున్నాను.
రాము : ముందే చెప్పి ఏడవచ్చు కదా? ఇప్పుడు చూడు train బయలుదేరడానికి ఇంకా 5 నిమిషాలు మాత్రమే ఉన్నది.
సీత : మీరు ఇలానే అనుకుంటూ కూర్చుంటే, ఆ 5 నిమిషాలు కూడా ఉండదు.
రాము : (ఛీ ఎధవ బతుకు)
రాము : పరిగెత్తుకుంటూ వెళ్ళి నీళ్ళు తీసుకొని వస్తాడు. (ఈ సారి నీళ్ళు మాత్రమే. చిన్ని చిన్ని గుండెలు లేవు)
train time అయ్యింది , బయలు దేరింది.
సీత (ఆవిలిస్తూ) : సరే నేను బాగా అలసిపోయి ఉన్నాను. నేను పడుకుంటున్నాను.
రాము : సరే పడుకో. (కొంచెం సేపు నేను ప్రశాంతంగా ఉండచ్చు)
TC వచ్చి ticket సరి చూసిన తరువాత రాము కూడా నిద్ర పోవడానికి ఉపక్రమించాడు. కానీ ఎంతకీ నిద్ర పట్టడంలేదు. పక్కనే side upper ,side lower berth లో ఉన్న జంట మాట్లాడుకుంటున్నారు.
ఆ జంట సరేనని, మెల్లగా train తలుపు వైపు వెళ్ళి .........
****************************
జీవిత ప్రయాణం అలా సాగిపోతుంటుంది.....
ముందుగా
"ఏం లేదు సార్. మా ఆవిడ కూడా ఉద్యోగం చేస్తుంది. ముందుగా ఎవరైతే ఇంటికి చేరుతారో వాళ్ళు వంట చేయాలి" రహస్యం చెప్పాడు వెంకట్రావు.
జ్ఞాపకశక్తి
"ఉంది సార్... నూట ఇరవై రూపాయలు" అన్నాడు షాపతను.
"Thank You" డబ్బులిచ్చి పుస్తకం తీసుకునివెళ్తున్నాడు రామకృష్ణ.
"Excuse me sir... చదవనప్పుడు ఈ పుస్తకం మీకెందుకు" అని అడిగాడు షాపతను.
"What?.. నేను చదవనా? ఎవర్న్నారు?" కోపంగా అన్నాడు రామకృష్ణ.
"ఇదే పుస్తకం మీరు గతంలో నాలుగుసార్లు కొన్నారు!!!" గుర్తు చేశాడు షాపతను.
అపరకర్ణుడు
"ఓ చిన్న సాయం చెయ్యండి. మీరు వెంటనే తిరిగి వెళ్ళి అవన్ని ఒట్టి పుకార్లని వారందరితో చెప్పండి" అన్నాడా కోటీశ్వరుడు
సమ్మక్క సారక్క జాతర


జంపన వాగులో స్నానం చేసే భక్తులు జాతర దృశ్యం
జాతరలో జన సముద్రం
జాతరలో మరొక దృశ్యం.
సమ్మక్క సారక్క జాతర (Sammakka Sarakka Jatara) అనేది వరంగల్ జిల్లా, తాడ్వాయి (వరంగల్ జిల్లా మండలం) మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర.
వరంగల్లు జిల్లాకేంద్రము నుండి 110 కిలోమీటర్ల దూరములోతాడ్వాయి మండలములో ఉన్నమారుమూల అటవీ ప్రాంతమైన మేడారం లో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య ఈచారిత్రాత్మకమైన ఈ జాతర జరుగుతుంది . సమస్త గిరిజనుల సమారాధ్య దేవతలు, కస్టాలను కడతేర్చే కలియుగ దైవాలుగా, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపధ్భాందవులుగా, యావదాంద్ర దేశములోనే గాక అఖిలభారత దేశములోనే వనదేవతులుగా పూజలందుకుంటున్నారీ సమ్మక్క-సారక్క. దేశములోనే అతి పెద్ద గిరిజన జాతరగా గణతికెక్కిన మేడారం జాతర గిరిజన సాంప్రదాయ రీతుల్లో జరుగుతుంది .
మన రాష్ట్రము నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఒరిస్సా ,చత్తీస్‌గఢ్,జార్ఖండ్ రాస్ట్రాల నుండి కూడా లక్షల కొద్ది భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు .1996 లో ఈ జాతరను రాస్ట్రప్రభుత్వము రాష్ట్ర పండుగగా గుర్తించింది .
విషయ సూచిక
2 జాతర విశేషాలు
3 జాతర ఫొటోలు
4 మూలాలు, వనరులు
ఎవరీ సమ్మక్క-సారక్కలు?
12 వ శతాభ్దములో నేటి కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతములోని 'పొలవాసను'పాలించే గిరిజన దొర మేడరాజు ఏకైక కుమార్తె సమ్మక్క ను ఆయన మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్ద రాజుకిచ్చి వివాహము చేసారు. ఈ దంపతులకు సారలమ్మ ,నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానము కలిగారు. రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పొలవాస పై దండెత్తేడు.ఆయన దాడికి తట్టుకోలేక మేడరాజు మేడారం పారిపోయి అజ్ఞాతవాసము గడుపుతుంటాడు. మేడారాన్ని పాలించే కోయరాజు 'పగిడిద్దరాజు' కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటక పరిస్థితుల కారణముగా కప్పము కట్టలేకపోతాడు. కప్పం కట్టకపోవడం, మేడరాజుకు ఆశ్రయం కల్పించడం ..కోయ గిరిజనులలో సార్వభౌమునికి వ్యతిరేకంగా విప్లవభావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణముతో పగిడిద్ద రాజుపై ఆగ్రహం చెందిన ప్రతాపరుద్రుడు అతడిని అణచివేయడానికి తన ప్రధాన మంత్రి యుగంధరుడితో సహా మాఘశుద్ద పౌర్ణమి రోజున మేడారం పై దండెత్తుతాడు.
సాంప్రదాయ ఆయుధాలు ధరించి పగిడిద్ద రాజు, సమ్మక్క, సారక్క,నాగమ్మ, జంపన్న, గోవిందరాజులు వేర్వేరు ప్రాంతాలనుండి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితం గా పోరాటము చేస్తారు. కాని సుశిక్షితులైన అపార కాకతీయ చేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు యుద్ధములో మరణిస్తారు. పరాజయవార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు. అప్పటి నుండి సంపెంగవాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందినది.
ఇక సమ్మక్క యుద్ధభూమిలో కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్పుతిప్పలు పెడుతుంది, వీరోచితం గా పోరాటం సాగించింది. గిరిజన మహిల యుద్ధనైపుణ్యానికి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు ధారలతోనే యుద్ధభూమినుంచి నిష్క్రమించి చిలుక గుట్టవైపు వెళుతూ మార్గమధ్యములోనే అద్రుశ్యమైనది. సమ్మక్క ను వెదుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు, కాని ఆ ప్రాంతములో ఒక పుట్ట దగ్గర పసుపు, కుంకుమలు గల భరిణె లభించినది. దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘ శుద్ద పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపు కుంటున్నారు.
జాతర విశేషాలు
జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు. రెండవ రోజున చిలుకల గుట్టలో భరిణెరూపములో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్టిస్తారు. దేవతలు గద్దెలపై ప్రతిష్టించే సమయములో భక్తులు పూనకంతో ఊగిపోతారు. మూడవ రోజున అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువుతీరుతారు. నాలుగవ రోజు సాయంత్రము ఆవాహన పలికి దేవతలను ఇద్దరినీ తిరిగి యదాస్థానానికి తరలిస్తారు. వంశ పారంపర్యముగా వస్తున్న గిరిజనులే పూజార్లు కావడం ఈ జాతర ప్రత్యేకత. తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారము(బెల్లము)నైవేద్యము గా సమర్పించుకుంటారు.
అప్పులు హద్దులు దాటితే తప్పవు చిక్కులు
అవసరానికి తగ్గ సోమ్ము మనదగ్గర లేనప్పుడు ఇతరుల దగ్గర తిరిగి చెల్లించే ప్రాతిపదికలో సొమ్ము తీసుకోవడాన్ని అప్పుగా చెప్పవచ్చు. అప్పు అన్నది ఎప్పటినుంచో ఉన్నా గతంలో అప్పు అన్నది అందరికీ అందుబాటులో ఉండేది కాదు. అయితే నేడు అప్పు అనేది అనేక రకాలుగా మనకు అందుబాటులో ఉంది. అప్పు రూపంలో కేవలం సోమ్మే కాదు వస్తువుల దగ్గరనుంచి మరెన్నో మనకు అప్పుగా లభిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో అప్పులు మనల్ని వెతుక్కుని మరీ వస్తున్నాయి. అయితే దొరుకుతోంది కదాని మన రాబడికి మించి అప్పులు స్వీకరిస్తే చివరకు అవే మన కొంప ముంచేస్తాయి. నేటి కాలంలో వాయిదాల పేరుతో ప్రతిది అందరికీ అందుబాటులోకి వచ్చింది. దీంతో కొందరు ఆదాయానికి మించి వాయిదాల రూపంలో అప్పులు చేసేస్తుంటారు. చివరకు అన్ని రకాల వాయిదాలు కలిసి నెత్తిన పడ్డప్పుడు లబోదిబో అంటుంటారు. ఇలా వాయిదాల పేరుతోనే, మరో రూపంలోనో అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఉండడానికి ఆర్థిక నిపుణలు కొన్ని సూచనలు చేస్తున్నారు. వాయిదా రూపంలో కానీ, మరో రూపంలో కానీ ఏదైనా అప్పు తీసుకునేటప్పుడు దాని అవసరం మనకు ఏమాత్రం ఉందన్న విషయాన్ని ముందుగా ఆలోచించాలి. అలాగే ప్రస్తుతం తీసుకుంటున్న అప్పుతో కలిపి నెలవారీ మనం చెల్లించాల్సిన వాయిదాలు ఎంత అన్న విషయాన్ని ఈ సందర్భంగా పునః సమిక్షించుకోవాలి. ఇలా ఆలోచించడం వల్ల తాజాగా తీసుకోబోయే రుణం మిమ్మల్ని బాధించే అవకాశాలు తగ్గుతాయి. అలాగే వాయిదాల రూపంలో ఏదైనా వస్తువో గృహ అలంకరణ సాముగ్రినో కొనుగోలు చేసే ముందు అది తమ తాహత్తుకు తగినిదా, దాని అవసరం తమకు నిజంగా ఉందా అన్న విషయం కూడా ఆలోచించాలి. ఎందుకంటే మనకొచ్చే ఆదాయాన్ని బట్టి మన ఖర్చులు, హోదాలు ఉన్నప్పుడే జీవితం సాఫీగా సాగిపోతుంది. అలా కాక ఆదాయాన్ని మించి ఖర్చులు ఉంటే బరువెక్కిన ఓడలా బ్రతుకుబండి సైతం ఎప్పుడో ఒకప్పుడు మునిగిపోక తప్పదు. అందుకే వాయిదాల రూపంలో తీసుకునే అప్పుల విషయంలోనూ జాగ్రత్త వహించక తప్పుదు. మొత్తంగా చెప్పాలంటే మీ ఆదాయంతో పోల్చినపుడు మీ వాయిదాల చెల్లింపు నిష్పత్తి 30 శాతానికి మించకుండా ఉన్నప్పుడే మీరు అవసరానికి మాత్రమే అప్పుల వైపు చూస్తున్నారని అర్థం. అలాంటి పరిస్థిలో మీ ఆర్థిక స్థితి ఉంటేనే మీరు జీవితంలో ఆనందంగా ఉండగలరు.
నిజాం తలవంచిన రోజు…
సూర్యాపేట
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
టైం జోన్
భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము
సూర్యాపేట
జిల్లా(లు)
నల్గొండ
గ్రామాలు
17
జనాభా• జనసాంద్రత• మగ• ఆడ• అక్షరాశ్యత శాతం• మగ• ఆడ
240,662 (2001)• 40/కి.మీ² (104/చ.మై)• 122605• 118057• 70.00• 79.51• 59.86