Monday, July 7, 2008

దసరా

దసరా పండుగ విజయదశమి నాడు జరుపుకోవడం జరుగుతుంది. తెలుగు వారు దసరాని పది రోజులు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది. తెలంగాణా లో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు. తెలంగాణా పల్లెల్లో ప్రతి అమావాస్య కి స్త్రీలు పట్టు పీఠంబరాలు దరించటం ఆనవాయితీ. విజయదశమి రోజు న చరిత్ర ప్రకారం రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భమున రావణ వధ, జామ్మీ ఆకుల పూజా చేయటం రివాజ.ు శరత్ ఋతువు లో వస్తాయి కాబట్టి (డా.శేషగిరిరావు)వీటిని శరన్నవరాత్రులని అన్నారు. జగన్మాత అయిన దుర్గా దేవి ,మహిషాసురుడనే రాక్షసుని తో 9 రాత్రులు యుద్ధము చేసి ఆయన్ని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషము తో పండగ జరుపుకున్నారు,అదే విజయదశమి.దేవీ పూజ ప్రాధాన్యత ఈశాన్యభారతదేశము లో హెచ్చుగా ఉంటుంది.