Saturday, July 5, 2008

గడ్డి జ్యూస్ త్రాగుదామా? 2వ భాగం దీని ఉపయోగాలు

1. మల్టీ విటమిన్, మల్టీ మినరల్ పిల్స్ కన్నా మహత్తరంగా పనిచేయడం దీని విశిష్టత.

2. ఒక ఔన్స్ వీట్ గ్రాస్ జ్యూస్ దాదాపు ఒక కేజీ కూరగాయలతో సమానం.

3. వీట్ గ్రాస్ లో క్లోరోఫిల్, యాక్టివ్ ఎంజైమ్స్, విటమిన్స్ ఇతరత్రా మరెన్నో విలువైన పోషక పదార్ధాలు ఉన్నాయి.

4. వీట్ గ్రాస్ జ్యూస్ లో ఉన్న పి4డి1 అన్న ఎంజైమ్ డిఎన్ఎ లోపాలను సరిచేస్తుంది.

5. వీట్ గ్రాస్ జ్యూస్ రక్తాన్ని శుద్ధి చేస్తుంది, ఇంకా... లివర్ లోని టాక్సిన్స్ ను తొలగించి, లివర్ ను శుద్ధం చేస్తుంది.

6. వీట్ గ్రాస్ జ్యూస్ కేవలం 20 నిముషాల్లో జీర్ణం అవుతుంది.

7. దీనిలో విటమిన్ ఎ,బి,సి,ఇ,కె లు సమృద్ధిగా ఉన్నాయి. ఇవే కాక పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, సోడియం, సల్ఫర్ 17 రకాల ఎమినోయాసిడ్స్ కూడా ఉన్నాయి.

8. వీట్ గ్రాస్ జ్యూస్ లోని క్లోరోఫిల్ రక్తంలో ఎర్రరక్త కణాల సంఖ్యను పెంచుతుంది. ఎర్ర రక్తకణాలు పెరగడం వల్ల శరీరంలోని వివిధ ప్రధానాంగాలకు ఆక్సిజన్ సరఫరా సక్రమంగా, అధికంగా జరుగుతుంది. దీంతో బ్రెయిన్ తో పాటు శరీరంలోని ఇతర ప్రధానాంగాలు కూడా అద్భుతంగా చైతన్యవంతమై సమర్ధవంతగా పనిచేస్తాయి. హిమోగ్లోబిన్ ను పెంచుతుంది. రక్తహీనత తగ్గుతుంది.

9. చర్మ వ్యాధుల ఉధృతాన్ని నివారించి చర్మాన్ని ఈ జ్యూస్ ను రక్షించగలదు. ఈ వ్యాధులున్నచోట చర్మంపై ఈ జ్యూస్ ను అప్లయ్ చేయడం కూడా చేయాలి.

10. చుండ్రును కూడా నివారిస్తుంది. మాడుకు ఈ జ్యూస్ ను బాగా పట్టించి పావుగంట అనంతరం తలస్నానం చేయాలి.

11. జీర్ణశక్తిని పెంపొందిస్తుంది, రక్తపోటును నియంత్రిస్తుంది.

12. శరీరంలో హానికరమైన బాక్టీరియా ఉత్పన్నం కాకుండా వీట్ గ్రాస్ జ్యూస్ ఉపరిస్తుంది.

13. దంతక్షయాన్ని నివారించే శక్తి వీట్ గ్రాస్ జ్యూస్ కు ఉంది. జస్ట్ ఓ అయిదు నిముషాల పాటు పుక్కిలి పడితే చాలు.

14. మలబద్దకాన్ని నివారిస్తుంది.

15. అధిక ఆకలితో అమితంగా తింటూ బరువు పెరిగిపోతున్నామని బాధపడేవారిలో అధిక ఆకలిని తగ్గించి, బరువు పెరగడాన్ని నిరోధిస్తుంది.

16. వృద్ధాప్యంలో శరీరంలో ఎంజైమ్స్ బాగా తగ్గిపోతాయి. ఈ లోటును పెద్దవారిలో మహాత్తరంగా భర్తీ చేస్తుంది. ఇంకా... వయసు పెరిగే కొలదీ ఉత్పత్తి తగ్గిపోతాయి ఫలితంగా అజీర్ణ వ్యాధులు సంభవించడం, ఆకలి తగ్గిపోవడం, తిన్న ఆమారంలో విలువైన పోషక పదార్ధాలను మన శరీరం స్వీకరించలేకపోవడం జరుగుతుంది. తత్ఫలితంగా వృద్ధాప్యంలో నీరసం, నిస్సత్తువ ఆవహిస్తాయి. వృద్ధులలో ఈ లోపాన్ని చక్కగా సరిదిద్దుతుంది ఈ జ్యూస్.

17. ఆర్ర్ధయిటిస్ అనే కీళ్ళవ్యాధితో, వీక్ ఐ సైట్ ఉన్నవారికి, కిడ్నీ స్టోన్స్ తో బాధపడేవారికి, స్కిన్ ఎలర్జీస్ ఉన్నవారికి, గ్యాస్, జీర్ణ వ్యవస్థలో పలురకాల ఇన్ ఫెక్షన్స్ తో బాధపడేవారికి ఎంతో ఉపకరిస్తుంది.చూశారా!!! ఎన్ని ఉపయోగాల పట్టిక తయారయిందో!! ఇన్ని ఉఫయోగాలు ఉన్నపుడు దీన్ని పెంచడం అంత కష్టం కాదేమో!! ఆలోచించండి.
శుభం!!!

No comments: