Saturday, July 5, 2008

గడ్డి జ్యూస్ త్రాగుదామా?

ఏదో ఆయుష్మాన్ భవ అని ఓ బ్లాగు మొదలుపెట్టి ఏవో ఆరోగ్య చిట్కాలు అంటూ చెపుతూ... ఏదో దయ తలచి ఈ బ్లాగు చూస్తున్నాము కదా!! అని.... ఇలా చివరికి గడ్డి, గాదం, చిట్టు, తవుడు గురించి కూడా వ్రాస్తున్నారు... ప్చ్.... ఏంటో? అని తల గోక్కొకండి దయచేసి. విషయం ఏమి లేకుండా అడ్డమైన గడ్డి గురించి అనవసరంగా ఎందుకు వ్రాస్తాను చెప్పండి. ఇలాంటివి సేకరించడానికి ఎంత కష్టపడతానో తెలుసా? అంత అవసరం ఏంటో? అని మీరు అనుకోవచ్చు. నాకు తెలిసిన నాలుగు మంచి విషయాలు మరో నలుగురికి తెలిస్తే... నమ్మకమున్నవారు, పాటించగల్గినవారు ఆచరిస్తారనే ఆశ తప్ప ఇంకేమి లేదు.సరే గడ్డి అంటే ఏమి లేదండి ఇపుడు మనం తెలుకోబోయేది ‘గోధుమ గడ్డి’ గురించి. సరే ఇలా గడ్డి అనడం నామోషిగా ఉందంటే స్టైల్ గా ఇంగిలిపీసులో వీట్ గ్రాస్ అని చెప్పకోవచ్చు.వీట్ గ్రాస్ ను ఎలా పెంచాలంటే......గోధుమల్ని (బన్సీ గోధుమలు వగైరాలు ఉంటాయండి.. కానీ నాటు గోధుమలు తీసుకోండి) ముందు 8 గంటల సేపు నాన పెట్టాలి. తర్వాత ఓ తడిగుడ్డలో వేసి మూట కడితే మరుసటి రోజుకు మొలకలు వస్తాయి. వాటిని నేలలో లేదా కుండీల్లో మంచిమట్టితో పాటు సేంద్రీయ ఎరువుల్ని కూడా 75:25 నిష్పత్తిలో కలిపి దానిలో వెయ్యాలి. గోధుమలు మొలకెత్తే సమయంలో నేల తేమగా ఉండాలి. మొలకెత్తేంత వరకు నీడలో ఉంచడం మంచిది లేదా ఇవి మొలకెత్తే నేలపై తీవ్రమైన ఎండ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి.మూడు రోజుల్లో దాదాపు 2 అంగుళాల ఎత్తు వరకు మొలకలు వస్తాయి. ఈ పరిస్థితుల్లో కూడా డైరెక్ట్ ఎండ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఎండిపోయే ప్రమాదం ఉంది. ఏడెనిమిది అంగుళాలు పెరిగాక, వీట్ గ్రాస్ కట్ చేసుకునేందుకు సిద్ధం అయినట్లన్నమాట. అపుడు మంచి కత్తెరతో నేల లేదా కుండీ పై నుంచి 2,3 సెంటీమీటర్ల ఎత్తున కత్తిరించండి. ఈ మొక్కల్ని జ్యూసర్ లో వేసే ముందు పరిశుభ్రంగా కడగండి.రోజూ ఒక ఔన్స్ జ్యూస్ తో ప్రారంభించి 40 రోజుల తర్వాత 2 ఔన్స్ లు త్రాగండి. దీన్ని పరగడుపుతో త్రాగాలి. లేదా ఇది త్రాగే ముందు 2 గంటల వరకు ఎటువంటి ఆహారం తిని ఉండకూడదు. ఉదయం దంతదావనం అవ్వగానే త్రాగితే మంచిది.ఇది పెరిగే సమయంలో తెగులు వంటివి కన్పిస్తే ఆ భాగం కత్తిరించి తీసేయ్యండి. ఒకవేళ అవసరానికి మించి గ్రాస్ తయారయితే కట్ చేసి ఎయిర్ టైట్ కంటెయినర్ లో ఉంచి ఫ్రిజ్ లో ఉంచితే వారం రోజులు నిల్వ ఉంటుంది.ష్...... హమ్మ గడ్డి అంటే ఏంటో గాని... దాన్ని పెంచడానికి ఇంత కష్టపడ్డాం సరే!!! మరి దాని ఉపయోగాలు ??? అబ్బో చాలానే ఉన్నాయండి. మొత్తం ఒకే టపాలో అంటే...... పాపం మీరంతా ఎన్ని బ్లాగులు చదవాలి, మీ బ్లాగులు వ్రాసుకోవాలి. కాబట్టి బ్లాగమ్మల్లారా....... బ్లాగయ్యల్లారా........ మిమ్మల్ని విసిగించను. ఆసక్తిగా ఉంటే మరో టపాలో వ్రాసే ఉపయోగాల కోసం వేచి యుండండి...నేను కూడా 3 సార్లు ఈ జ్యూస్ రుచి చూసానండీ!! తియ్యగా బాగానే ఉంది కానీ!!! స్థలాభావము మరియు సమయాభావము వల్ల నాకు కుదరటం లేదు. మళ్ళీ మొదలుపెట్టాలి.
శుభం!!!
27 May, 2008

శుభం!!!27 May, 2008

No comments: