Saturday, July 5, 2008

2వ భాగం - సూర్య చికిత్స - సూర్య శక్తిని సీసాలో బంధిద్దామా?




గమనిక : కొన్ని వ్యాధులలో (ఉదా...కు బి.పి., షుగర్) ఇలాంటి చికిత్సా విధానాలను వాడుతున్నాం కదాని హఠాత్తుగా అల్లోపతి చికిత్సను నిలిపివేయకూడదు. క్రమం తప్పక పరీక్ష చేయించుకుంటూ.. సోలరైజ్డ్ డోస్ క్రమంగా పెంచుకుంటూ మందు బిళ్ళల డోస్ క్రమంగా తగ్గించుకోవాలి.సరే ఇంక సోలరైజ్డ్ మెడిసన్స్ ఉపయోగాలు, వాడే విధానం తెలుసుకొందామా!!!.ఈ సోలరైజ్డ్ మెడిసన్స్ ను ఖాళీ కడుపుతో తీసుకోవాలి. లేదా భోజనానికి ఓ గంట ముందుగా తీసుకోవాలి.మధుమేహ వ్యాధితో బాధపడేవారు ప్రతిరోజూ మూడుపూటలా మూడు కప్పుల గ్రీన్ వాటర్ త్రాగుతుండాలి. వేసవిలో గ్రీన్ వాటర్ కు సమంగా బ్లూ వాటర్ కలుపుకొని, చలికాలంలో గ్రీన్ వాటర్ కు ఆరంజ్ వాటర్ సమపాళ్ళలో కల్పుకొని త్రాగాలి. ఇలా...రొటీన్ మందులకు అదనంగా వాడుకుంటుంటే... శరీరం మధుమేహం వలన శిధిలం కాకుండా, సైడ్ ఎఫెక్ట్సు రాకుండా కాపాడగల్గుతాయి.రక్తపోటుతో బాధపడేవారు గ్రీన్ వాటర్ రెండుసార్లు, బ్లూ వాటర్ రెండు సార్లు తీసుకుంటే ఫలితం ఉంటుంది. ఈ మందుల్ని.... బి.పి మందులకు జతగా వాడుకోవచ్చు. ఒకవేళ లోబ్లడ్ ప్రెజర్ తో బాధపడుతున్నట్టయితే... గ్రీన్ వాటర్ రెండు, మూడుసార్లు, ఆరంజ్ వాటర్ రెండు, మూడు సార్లు తీసుకోవాలి.రక్తహీనతతో బాధపడేవారు... ఆరంజ్, గ్రీన్ వాటర్ రోజుకు ఒక్కొక్కదాన్ని రెండు లేక మూడుసార్లు త్రాగాలి. ఈ సోలరైజ్డ్ వాటర్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ ను బలోపేతం చేయటమే కాక.... రక్తవృద్ధికి తోడ్పడతాయి.గ్రీన్ మెడిసన్ ఎటువంటి వ్యాధినైనా నెమ్మదింపచేస్తాయి. కండరాలను చైతన్యవంతం చేసి.... వాటికి శక్తినిస్తాయి. రక్తాన్ని శుభ్రపరచడమే కాకుండా.... రక్తంలో, శరీరంలో చేరుకున్న పలు వ్యర్థాలను బయటకు పంపేస్తాయి. నెర్వస్ సిస్టమ్... శక్తివంతగా రూపోందించబడుతుంది ఇంకా... బ్రెయిన్ సమర్థవంతంగా పనిచేయగల్గుతుంది. అజీర్ణంతోపాటు జీర్ణపరమైన ఏ ఇబ్బందినయినా తొలగించగలవు. ఎగ్జిమా వంటి చర్మవ్యాధుల్లో ఈ మెడిసన్స్ వ్యాధి నిర్మూలనకు సహకరిస్తాయి. లివర్, కిడ్నీకి సంబంధించిన వ్యాధులతో బాధపడుతూ చికిత్స పొందేవారు... వీటిని వాడటం వల్ల చికిత్సాకాలం తగ్గుతుంది.ఒక కప్పు గ్రీన్ వాటర్ ఉదయాన పరగడుపున, ఒక కప్పు ఆరంజ్ వాటర్ ఉదయం, రాత్రి భోజనానంతరం తీసుకుంటే ఎంత సివియర్ మలబద్దకాన్నయినా మంచి ఫలితముంటుంది.బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ తో బాధపడేవారు.... ఆరంజ్ వాటర్ ని రోజూ రెండు సార్లు తీసుకుంటుండాలి.కళ్ళు నీరు కారుతున్నా, కళ్ళు ఎర్రబడినా, దురదలుగా ఉన్నా, కళ్ళలో నొప్పి ఉన్నా గ్రీన్ వాటర్ తో కళ్ళు రోజుకు రెండు మూడుసార్లు కడగాలి. ‘ఐ’ డ్రాప్స్ గా కూడా రెండు మూడు సార్లు వేస్తుండాలి.నిద్రలేమితో బాధపడేవారు... సోలరైజ్డ్ బ్లూ ఆయిల్ తో తల పై మర్దన చేసుకోవాలి. పిరీయడ్స్ సమయంలో ఆడవారిలో వచ్చే తలనొప్పికి సోలరైజ్డ్ బ్లూ ఆయిల్ నుదురు పై రాయాలి.పిరీయడ్స్ సమయంలో అధికఋతుస్రావంతో బాధపడేవారు బ్లూ మెడిసన్స్ వాడవచ్చు.చెవి నొప్పిగా ఉంటే... సోలరైజ్డ్ గ్రీన్ లేదా ఆరంజ్ ఆయిల్ ను రెండు పూటలా రెండు చుక్కల చొప్పున చెవిలో వేయాలి.పిట్స్ తో బాధపడేవారు..... బ్లూ మెడిసన్స్ దీర్ఘకాలం వాడటం వల్ల మంచి ఫలితాలు పొందచ్చు.చివరిగా.....ఇంగ్లీషు మందులను దీర్ఘకాలం వాడమంటే ఇష్టపడతాం... కానీ ఇలాంటి వాటిలో మాత్రం వెంటనే తగ్గాలి అనుకుంటాం. ఇవి కూడా దీర్ఘకాలం వాడాలా? అని కొట్టిపారేయ్యకండి. ఓపికగా, నమ్మకంగా ప్రయత్నించి చూడండి. మొదటి భాగంలో సోలరైజ్డ్ మెడిసన్ చేసుకోవటానికి ‘నీరు’ అత్యుత్తమమని తెలుసుకున్నాం కదా!!!. నీరు, సూర్యుడితో పైసా పెట్టుబడి లేని మెడిసన్ తయారవుతుంది. ప్రయత్నిస్తే తప్పు లేదు కదా!!
సర్వేజనాసుఖినోభవంతు

No comments: