Saturday, July 5, 2008

బోకే

రాజారామ్ కాస్త మతిమరుపు మనిషి.

ఏం సంగతీ గుర్తుండదు. అందుకే ఒ ఏర్పాటు చేశాడు .
బోకేల దుకాణం వాడికి కొంత డబ్బు అడ్వాన్సు గా ఇచ్చి.
తన భార్య పుట్టినరోజు నాడు బోకే పంపమని పురమయించినాడు.
అనుకున్న ప్రకారమే శ్రీ మతి రాజారామ్ కి అందమైన బుకే అందింది దాని కింద "ఇట్లు .... నీ ప్రియమైన భర్తా" అని రాసుంది.
అది చూసి ఆమె మురిసిపోయింది. "మా వారు ఎంత మారిపోయారు"అని సంబరపడింది.

సాయంత్రానికి రాజారామ్ ఆఫీసు నుంచి వచ్చాడు.
టేబుల్ మీద బుకే కనిపించింది. "నీ భర్త ఎవరో గాని భలే మంచి బుకే పంపాడోయ్" అని మెచ్చుకున్నాడు.

No comments: