
తమ ఇష్టానుసారంగా, స్వార్థంతో ఇతరులెవరికీ ఉపయోగం లేని బ్రతుకు గడిపిన వారికి, జీవన సాగరాలను దాటుతూ దేవుని సేవలో, మనుషులకి సహాయపడడంలోనూ ఎన్నో బరువుల్ని మోసిన వారికీ వాళ్ళ గుణలక్షణాల్లో చాలా తేడా ఉంటుంది.సూర్యుడు పశ్చిమ దిశలలో క్రుంగగానే అంధకారం అలుముకోదు. సూర్యబింబం కనిపించకుండా పోయిన తర్వాత దాదాపు గంటవరకూ ఆకాశంలో రంగులు ప్రజ్వరిల్లుతూనే ఉంటాయి. అలానే ఒక మనిషి చనిపోతే అతను కనుమరుగైన తర్వతా చాలాకాలం వరకూ అతనికి చెందిన కాంతులు ప్రపంచంలో వెలుగుతూనే ఉంటాయి. అలాంటి మనిషి చనిపోతే ఆయన జ్ఞాపకాలు ఈ లోకాన్ని వదిలి బయటకి వెళ్ళపోవు. ఆయన వెళ్ళపోతూ తనదైన ఏదో కొంత వదిలి వెళ్తాడు. చనిపోయి కూడా మాట్లాడుతూ ఉంటాడు.‘‘ఆత్మ అంటే కేవలం శరీరంలోని శక్తులకి సంబంధించినది కాదు’’. శారీరక శక్తులు ఉడిగిపోతున్న కొద్దీ ఆధ్యాత్మికంగా ఆత్మ మరిన్ని క్రొత్త కాంతుల్ని సంతరించుకుంటుంది. తలపైన శీతాకాలం వచ్చిపడినా, హృదయంలో మాత్రం నిత్యం వసంతరుతువు నెలకొని ఉంటుంది. యవ్వనంలో ఉన్నట్టుగానే గులాబీలు, గరికపూలు మొదలైన పుష్పాల సౌరభాన్ని వాసన చూసి ఆనందించగలం. అంతం సమీపిస్తున్న కొద్దీ చుట్టూ పరలోకపు ఆనంద గానాల ధ్వని ఆహ్వానిస్తూ మరింత స్పష్టంగా వినబడుతుంది. ఇది అద్భుతం. అదే సమయంలో అతి సాధారణం.
No comments:
Post a Comment