Saturday, July 5, 2008

ముద్రా వైద్యము - 2.పృధ్వీ ముద్ర - చేయు విధానము - ఉపయోగములు




చేయు విధానము :ఇక్కడ చిత్రంలో చూపిన విధంగా ఉంగరపు వ్రేలు కొన బొటనవ్రేలుతో తాకించాలి. ఈ ముద్ర మన దేహంలోని భూతత్త్వానికి సంబంధించినది.ప్రాధాన్యత :అన్ని రకములు శరీర సంబంధమైన అలసటను, నీరసాన్ని తగ్గిస్తుంది. ఉంగరపు వ్రేలు చాలా ముఖ్యమైన వ్రేలు. బొటన వ్రేలు లాగానే ఈ వ్రేలి ద్వారా కూడా ఎక్కువ విద్యుత్తరంగాలు ప్రసారమవుతాయి. యోగ శాస్ర్తరీత్యా మన నుదుటి మీద రెండు దళముల పద్మముంటుంది. ఉంగరపు వ్రేలి కొన బొటనవ్రేలి కొనతో కలిపి కుంకుమ తీసుకొని నుదుట బొట్టుంచుకున్నట్లైతే ఆ మనిషి తన దైవశక్తులను పెంచుకోవటమే కాక ఎదుటి సాధకుల శక్తిని కూడా అభివృద్ధి చేయగలరు.ఉపయోగములు :ఈ ముద్రవలన వారి శరీరాకృతి తగినంతగా ఏర్పడుతుంది. ముఖ్యంగా బరువు సమంగా ఉంచుతుంది. చర్మం కాంతివంతమవుతంది. శరీరంలో చైతన్యశక్తి పెరుగుతుంది. బద్ధకాన్ని వదిలిస్తుంది. మానసిక, హృదయ ఆనందాన్ని పెంచుతుంది. ఆధ్యాత్మక సాధనలలో నిజమైన మిత్రునిలా సహకరిస్తుంది.
శుభం!!!

No comments: