Tuesday, May 17, 2011

అమెరికా మెగా బిలియనీర్ రాక్ ఫెల్లర్ ఓ సారి సమయానికి జేబు లో చిల్లర లేక తన శెకెట్రీ (రావు గోపాల్ రావ్ స్టైల్ ) దగ్గర ఒక సెంట్ అప్పడిగి తీసుకున్నారు !!

మర్చి పోవద్దు …….రేపు గుర్తు చేసి తీసుకో ……..
మర్చి పోవద్దు సుమీ … అని మరీ మరీ చెబుతున్నారు !!

కానీ శెకట్రీ ఫర్వాలేదు సార్ దానిదేముంది అంటూ మొదలెట్టింది !!

ఏం లేదంటావేం ?? అని గద్దించారు రాక్ ఫెల్లర్ .. శెకట్రీ మౌత్ షట్ చేసింది !!

“నువ్విచ్చిన డబ్బు ఒక డాలర్ మీద ఏడాదికి వచ్చే వడ్డీ తో సమానం … ఏం లేదంటావే?? ” .. అని శంటింగ్ ఇచ్చారు రాక్ గారు !!

అందుకే మరి రాక్ ఫెల్లర్ రాక్ ఫెల్లర్ గా … సెకట్రీ … సెకెట్రీ గా మిగిలి పోయారు !!

నేను మరీ రాక్ ఫెల్లర్ గా కాక పోయినా …..
శెకట్రీ గా మాత్రం సెట్టిల్ అవకూడదనుకుంటు న్నాను !!

అద్రుష్టం


బాస్ గారి దగ్గర 300 రెస్యూములు ఉన్నాయి , ఉద్యోగాలు ఉన్నవి నాలుగే …

బాస్ గారు సెకెట్రీ (రావు గోపాల్ రావు స్టైల్ ) అని కేకెట్టారు …. సెకెట్రీ వచ్చింది !!

నీ ఇష్టం వచ్చిన 50 రెస్యూములు తీసి వాల్లని ఇంటర్వూ కీ పిలిచేయ్యి , మిగతావి చెత్త బుట్టలో వేసేయ్ ….. బాస్ గారి ఆర్డర్ ..

సెకెట్రీ : కానీ … సార్ , వాటిలో మంచి రెస్యూములు ఉంటే ????

బాస్ : గుడ్ కొచ్చెన్ ….. పాయింట్ లాగవ్ ….. కానీ నాక్కావలసింది ,
————— అద్రుష్టం ఉన్న వాళ్ళు