Friday, April 22, 2011



తల్లి: చిన్నీ! మీ క్లాస్‌లో ఎప్పుడన్నా దేనిలోనన్నా ఫస్ట్‌ వచ్చావా?
చిన్ని: బెల్‌ కొట్టగానే క్లాస్‌ ఏం ఖర్మ, మొత్తం స్కూల్లోనే బయటికొచ్చేయడంలో నేనేగా ప్రతిరోజూ ఫస్ట్‌.

తండ్రిః ఓ వ్యక్తి రోజుకు పదికిలోమీటర్ల చొప్పున నడిస్తే వారం రోజుల్లో 60 కిలోమీటర్లు ముందుకుపోతాడా? ఇదేం లెక్కరా?!
కుమారుడుః ఆదివారం సెలవు కాబట్టి ఆ రోజు నడవకుండా జాలీగా గడిపేసుంటాడని అలా చెప్పా డాడీ!!!

కస్టమర్‌: మీ హేరాయిల్‌ వాడితే నా బట్ట తల మీద వెంట్రుకలు మొలుస్తాయని చెప్పారు. ఒక వేళ అలా జరగకపోతే...
సేల్స్‌మ్యాన్‌: ఏడాది తర్వాత ఒక విగ్‌ ప్రజెంట్‌ చేస్తాం.

రాత్రి టీవీ సీరియల్‌ చూస్తూ నిద్రఆపుకోవడానికి అవస్తపడుతున్న భర్తతో, 'పగలంతా ఆఫీసులో నిద్రపోకుండా ఎవర్ని ఉద్దరించారు' అని భార్య కోపంగా అరిచింది.
భర్తః భయం, భయంగా 'పక్కసెక్షన్‌ మోహన్‌రావు బలవంతం చేస్తే పేకాట ఆడానే...!

అబ్బా.....! టైమ్‌ చాలా తొందరగా పరిగెత్తుతున్నది కదండీ!! యధాలాపంగా అంది మినిస్టర్‌ గారి భార్యామణి భర్తతో.
నిజమే! నిన్ననే నా నియోజకవర్గమంతా పర్యటించినట్లనిపిస్తోంది. అప్పుడే ఐదేళ్ళ పదవీకాలం అయిపోయిందంటే నమ్మశక్యం కావడంలేదు.... అన్నాడా మంత్రి వర్యుడు దిగాలుగా.

శ్రీపతిరావు మంచి మూడ్‌ లో వున్నాడు. భార్యతో సరదాగా నాలుగు మాటలు మాట్లాడాలనిపించింది. శ్రీమతీ... ఎక్కడున్నావ్‌ ఇలా రావోయ్‌ అన్నాడు గోముగా.
సమాధానం లేదు!
భార్యామణీ, గృహలక్ష్మీ..... ఇలా రావమ్మా!! మళ్ళీ ముద్దుగా పిలిచాడు శ్రీపతిరావు.
అయినా సమాధానం లేదు!!
ఒసేయ్‌ గయ్యాళి గంపా....ఇటు తగలబడు అన్నాడు శ్రీపతి రావు కోపంగా!!
నన్నే పిలిచారనుకుంటా..... ఇదిగో వస్తున్నా.. ఠకీమని సమాధానం ఇచ్చింది భార్యామణి లోపలి నుంచి!!

'అబ్బ... మీరిచ్చిన ఆయింట్‌మెంట్‌ అద్భుతం డాక్టర్‌ గారూ! చేతికి రాసీ రాయగానే నొప్పి పోయి హుషారు వచ్చేసింది' అన్నాడు డల్‌గా వుండే ఓ కుర్రాడు.
'అలాగా? అయితే ఆ ఆయింట్‌మెంట్‌ను నీ బుర్రకు కూడా కాస్తా పట్టించు' అన్నాడు విసుగ్గా డాక్టర్‌

నువ్వెందుకోయ్‌ �ులటరీలో చేరావ్‌..... కొత్తగా జాయిన్‌ అయిన రమేష్‌ ను అడిగాడు సుధీర్‌.
పెళ్ళీ గిళ్ళీ కాలేదుగా సార్‌... అందుకే �ులటరీలో చేరిపోయా.... మరి �dురెందుకు చేరారు సార్‌? గడుసుగా అడిగాడు రమేష్‌.
ఇంట్లో పెళ్ళాం పోరు భరించలేకోయ్‌......!! ఠకీమని చెప్పాడు సుధీర్‌

తల్లిః చూడు రాణీ! పక్కింటి ప్రకాశం గాడు నీకోసం రోజు మనింటికి రావడం ఏమీ బాగాలేదు.
రాణిః ఐతే....రేపణ్నించి నేనే వాళ్ళింటికెళతాలే మమ్మీ!!

సూరిః ఒరే చందూ! మన టీచర్లు చేసేది చాలా అన్యాయం రా...!!
చందుః ఏం.....? ఎందువల్ల?!
సూరిః ఒకటి, రెండు ఇలా తక్కువ ర్యాంక్స్‌ వచ్చిన వాళ్ళని పాస్‌ చేస్తూ.....నా లాగా నలభై, ఏభై ర్యాంక్స్‌ తెచ్చుకున్న వాళ్ళని ఫెయిల్‌ చేస్తున్నార్రా!! .....ఇది అన్యాయం కదూ....?!!!