Monday, July 7, 2008

బతుకమ్మ

బతుకమ్మ
బతుకమ్మ

బతుకమ్మ పండుగ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తెలంగాణా ప్రాంతములో ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ (గౌరి) పండగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది.

.

విషయ సూచిక


బతుకమ్మ పండుగ విశిష్టత

సెప్టంబరు, అక్టోబరు నెలలు తెలంగాణా ప్రజలకు పండుగల నెలలు. ఈ నెలలలో రెండు పెద్ద పండుగలు జరపబడతాయి. ఈ పండుగలకు కనీసం పదిహేను రోజులు అటువైపు, ఇటువైపు అంతా పండుగ సంరంభాలు, కుటుంబ కోలాహలాలు, కలయకలుతో నిండిపోయుంటుంది. ఈ పండుగలలో ఒకటి బతుకమ్మ పండుగ, మరియొకటి దసరా (విజయ దశమి). అయితే బతుకమ్మ పండుగ మాత్రం, తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమయిన పండుగ. తెలంగాణ సాంస్కృతిక ప్రతీక ఈ పండుగ. ఇతర చోట్ల పూలు, నీళ్లతో జరుపుకునే పండుగలు ఎన్ని ఉన్నా, అవి ఏవీ కూడా బతుకమ్మ పండుగతో సరిపోలవు.


ఈ పండుగ వర్షాకాలపు చివరిలో, శీతాకాలపు తొలి రోజులలో వస్తుంది. అప్పటికే వర్షాల వలన చెరువలన్నీ మంచి నీటితో నిండి ఉంటాయి. రకరకాల పువ్వులు రంగు రంగులలో ఆరుబయలలో పూసి ఉంటాయి. వీటిలో గునుక పూలు, తంగేడి పూలు బాగా ఎక్కువగా పూస్తాయి. బంతి, చేమంతి, నంది వర్ధనం లాంటి పూలకు కూడా ఇదే సమయం. సీతాఫలాలు (శిల్పక్క పండ్లు అంటారు) కూడా ఈ సమయంలో ఒక పెద్ద ఆకర్షణ. సీతాఫలాన్ని పేదవాని ఆపిల్ అంటారనేది తెలిసినదే. అలాగే జొన్న పంట కోతకు సిధ్ధంగా తలలూపుతూ ఉంటుంది. వీటన్నింటి నేపధ్యంలో తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతమయిన రంగురంగుల పువ్వులతో కీరిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు.


పండుగ సంబరాలు

బతుకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ ఆడుతున్న మహిళలు
బతుకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ ఆడుతున్న మహిళలు

ఈ పండుగ సద్దుల బతుకమ్మ (బతుకమ్మ చివరి రోజు మరియు దసరాకు రెండు రోజుల ముందర) రోజుకు ఒక వారం ముందు మొదలవుతుంది. ఈ రోజుల్లో ఆడపడుచులు అందరూ అత్తవారింటి నుంచి కన్నవారింటికి చేరుకుని స్వేచ్ఛావాయువులు పీలుస్తూ ఈ పూల పండుగ జరుపుకోవటానికి తయారవుతారు.ఈ వారం రోజులలో వీరు రోజూ చిన్న బతుకమ్మలు చేసి, ప్రతీ సాయంత్రం దాని చుట్టూ తిరుగుతూ ఆడుతారు. ఆ తరువాత దగ్గరలో ఉన్న జలాలలో నిమజ్జనం చేస్తారు.


అయితే చివరి రోజు అత్యంత మనోహరంగా ఉంటుంది. ఆ రోజు మగవారంతా పచ్చిక బయళ్ళలోనికి పోయి తంగేడి, గునుక పూలను భారీగా ఏరుకుని వస్తారు. ఆ తరువాత ఇంటిళ్ళపాదీ కూర్చుని ఆ గునగ పూలు, తంగేడు, కలువ, మరియు ఇతర రకాల పూలతో బతుకమ్మని తయారు చేస్తారు. ఇందులో గునగ పూలు మరియు తంగెడు పూలు ముఖ్య భూమిక ను పోషిస్తాయి.


ఈ పూలని జాగ్రత్తగా ఒక రాగి పళ్ళెం (తాంబలం)లో వలయాకారంగా, రంగులు మార్చుకుంటూ పేరుస్తారు. ముందుగా తంగెడు ఆకులు, పూలు పళ్లెంలో లేదా తాంబోలం లో పేర్చుతారు, ఆపై తంగేడు పూలతో కట్టలుగా కట్టిన కట్టలను చివరలు కోసి రంగులతో అద్దిన వాటిని పేర్చుతారు. మధ్య మధ్యలో ఇతర రకాల పూలను ఉపయోగిస్తారు. ఈ అమరిక ఎంత పెద్దదిగా ఉంటే అంత అందంగా ఉంటుంది. తెల్లని గునుక పూలను రంగులతో అద్ది, మధ్యలో తంగేడి పూలను పెడతారు. పేర్చడం అయ్యాక పైన పసుపుతో చేసిన గౌరి మాతను పెట్టి చుట్టు దీపాలతో అలంకరిస్తారు. దీనిని గృహంలో దైవ స్థానంలో అమర్చి పూజిస్తారు. ఇలా తయారు చేసిన బతకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరి దేవిని కీర్తిస్తూ ఆడవారు పాడుతారు. ఆడవారు వారికి ఉన్న అన్ని రకాల ఆభరణాలను దరించి కొత్త బట్టలు కట్టుకుంటారు. ఇలా చాలా సేపు ఆడాక మగవారు వాటిని చెరువులో నిమజ్జనం చేస్తారు. ఆపై ఆ పళ్లెంలో తెచ్చిన నీటితో ఆడవారు వాయినమమ్మా వాయినం అంటూ వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు.

ఆపై ఇంటి నుండి తీసుకువచ్చిన పెరుగన్నం మరియు సత్తుపిండి( మొక్కజొన్నలు, లేదా వేరుశనగ లేదా పెసర విత్తనాలను దోరగ వేయించి వాటిని పిండి చేసి వాటితో చక్కెర పిండి లేదా బెల్లం మరియు నెయ్యి తగినంత కలిపి తయారు చేస్తారు)లను ఇచ్చి పుచ్చుకొని తింటారు


మలీద - చక్కెర మరియు రొట్టెతో చేసిన పిండివంటకం
మలీద - చక్కెర మరియు రొట్టెతో చేసిన పిండివంటకం

చివరి రోజు సాయంత్రం, ఆడపడుచులు అందరూ చక్కగా దుస్తులు, అభరణాలు ధరించి బతుకమ్మను వాకిలిలో పెడతారు. చుట్టుపక్కల ఉన్న వారు కూడా వారి బతుకమ్మలను ఇదే విధంగా అమర్చి వాటి చుట్టూ పెద్ద వలయాకారంలో చేరుతారు. ఐక్యత, సోదరభావం, ప్రేమను కలపి రంగరిస్తూ మానవ హారం ఏర్పరిచి పాటలు పాడుతారు. ఒకరు ముందుగా పాట మొదలుపెడితే మిగిలినవారు వారితో గొంతు కలుపుతూ పాడుతారు. ఈ జానపద గీతాలు చుట్టు పక్కలా ప్రతిధ్వనిస్తూ ప్రత్యేకమైన తెలంగాణా సంస్కృతిని ఆవిష్కరిస్తాయి.

చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేస్తున్న దృశ్యం
చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేస్తున్న దృశ్యం

చీకటి పడుతుంది అనగా,స్త్రీలందరూ ఈ బతుకమ్మలను తలపై పెట్టుకుని ఊరిలో ఉన్న పెద్ద చెరువు గానీ, తటాకంవైపు గానీ ఊరేగింపుగా బయలుదేరుతారు. ఈ ఊరేగింపు అందంగా అలంకిరించుకున్న స్త్రీలు, బతుకమ్మలతో అత్యంత సుందరంగా, వైభావయానంగా ఉంటుంది.ఈ ఊరేగింపు కొనసాగినంత సేపూ, జానపద గీతాలతో వీధులు మారుమోగుతాయి. జలాశయం చేరుకున్న తరువాత, మెల్లగా బతుకమ్మలను పాటలు పాడుతూ,ఆడుతూ నీటిలో జారవిడుస్తారు. ఆ తరువాత "మలీద" (చక్కెర మరియు రొట్టెతో చేసినది) అనే పిండి వంటకాన్ని బంధు మిత్రులకు పంచిపెడతారు. ఆ తరువాత ఖాళీ తాంబలంతో పాడుతూ, బతుకమ్మను కీర్తిస్తూ ఇంటికి చేరుతారు. ఈ వారం రోజులూ,ఈ పాటలన్నీ అర్ధరాత్రి వరకూ వీధులలో మారు మ్రోగుతూనే ఉంటాయి.


[మార్చు] పండుగ కధ

ఈ బతుకమ్మ పండుగ వెనుక చాల కథలు ఉన్నాయి. బాగా ప్రాచుర్యంలో ఉన్నదిది : ఒక బాలిక భూస్వాముల ఆకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంటే, ఆమెను ఆ ఊరి ప్రజలు చిరకాలం "బతుకమ్మా !" అని దీవించారంట అందుకనే ఈ పండుగ స్త్రీలకు సంబంధించిన, బతుకమ్మను కీర్తిస్తూ జరుపుకునే పండుగ. స్త్రీలందరూ ఈ సందర్భంగా వారు ఎటువంటి ఆపదల పాలు కారాదనీ, పతులు మరియు కుటుంబం చల్లగా ఉండాలనీ గౌరమ్మను ప్రార్ధిస్తారు.


ఇంకొక వృత్తాంతములో దక్షిణ భారతాన్ని పాలించిన చోళ వంశ చక్రవర్తి ధర్మాంగదుడు సంతానము లేక అనేక పూజలు పునస్కారాలు చేయగా ఈయన భార్య గర్భవతియై లక్ష్మీ దేవి అనుగ్రహముతో ఒక కూతుర్ని కన్నది. పసిబిడ్డైన లక్ష్మి అనేక గండములను గట్టెక్కినది కావున ఈమె తల్లితండ్రులు బతుకమ్మా అని నామకరణము చేసినారు. అప్పటినుండి యువతులు మంచి భర్తను ప్రసాదించాలని కోరుతూ బతుకమ్మను కొలవడము ఆన్వాయితీ అయ్యిందని ఈ కథ చెబుతున్నది.

బతుకమ్మ పండుగ ప్రకృతిని అరాధించే పెద్ద పండుగ. పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృధ్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి, భూమితో, జలంతో, మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకోబడుతుంది. ఈ సంబరాలు జరుపుకునే వారం అంతటా స్త్రీలు "బొడ్డెమ్మ" (మట్టితో చేసే దుర్గాదేవి బొమ్మ) ను బతుకమ్మతో పాటూ చేసి నిమజ్జనం చేస్తారు

దీపావళి

భారతీయ సంస్కృతి కి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి.

దీప మాళికల శోభతో వెలుగొందే గృహాంగణాలు, ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండివంటల ఘుమఘుమలు, బాణసంచా చప్పుళ్ళు, ఈ దివ్య దీపావళి సోయగాలు!

విషయ సూచిక


దీపం జ్యోతి పరబ్రహ్మమ్

భిన్నత్వంలో ఏకత్వాన్ని సృజించే ఈ దీపావళి కోటి కాంతుల రవళి- విరిసే చైతన్య దీప్తుల జావళి. కొత్త ఆశలతో , ఆశయాలతో ఈ దీపావళి మానవ జీవితంలో పారమార్థిక వెలుగు రేఖ లను పూయిస్తుందని హైందవజాతి ప్రగాఢ విశ్వాసం.

" దీపం జ్యోతి పరబ్రహ్మమ్
దీపం సర్వతమోహరమ్
దీపేన సాధ్యతే సర్వమ్
సంధ్యా దీపం నమామ్యహమ్ "

అంటూ మహిళామణులంతా ప్రార్థిస్తూ ఆశ్వయుజ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో దీపాలను వెలిగిస్తారు. చివరకు ఈ దీపాలను ముత్తయిదువులు కార్తీక పౌర్ణమికి సముద్ర స్నానాలను ఆచరించి జీవనదులలో వదులుతారు. ఇవి సౌభాగ్యానికి, సౌశీల్యానికి, సౌజన్యానికి ప్రతీకలుగా భావిస్తారు. పైగా ఈ దీపావళి శరదృతువులో అరుదెంచటం విశేషం. మనోనిశ్చలతకు, సుఖశాంతులకు అనువైన కాలమిది.

సత్యం-శివం-సుందరం

పంచభూతాలలో ప్రధానమైనది అగ్ని. ఈ అగ్ని ప్రాణికోటి మనుగడకు ఉపకరించే తేజస్సును, ఆహారాన్ని ఐహికంగాను, విజ్ఞాన ధర్మగరిమను ఆధ్యాత్మికంగాను ప్రసాదిస్తుంది. ఈ దీపాల వెలిగింపు ద్వారా మూడు రంగులు ప్రధానంగా మనకు గోచరమవుతాయి. నీలము, పసుపు, తెలుపు- ఈ మూడు రంగులు మానవ మనుగడకు అవశ్యకమైన సత్త్వరజస్తమోగుణాల సమ్మేళనంగా ఆర్యులు చెబుతుంటారు. ఈ మూడు రంగులను జగతిని పాలించే లక్ష్మి, సరస్వతి, దుర్గలుగా భావిస్తారుట పౌరాణికులు. అంతేకాక సత్యం-శివం-సుందరం - అవి దీప ప్రజ్వలన ద్వారా త్రిజగన్మాతలను ఆరాధించినట్లును, మానవులకు విజ్ఞానం, వివేకం, వినయాలకు సంకేతమని సందేశాత్మకంగా గైకొంటారు భారతీయులు.

" అంధతమిస్రంచ దక్షిణాయనమేవచ
ఉత్తరాయణే తస్మా జ్యోతిర్దానం ప్రశస్వతే "


అంధ తమ్స్రమనేది ఒక నరకం, దక్షిణాయన పాపకాలం నుండి తప్పించుకొని తరించడానికి ఉత్తరాయణ పుణ్యకాలంలో జ్యోతి ని దానం చేయుట ఉత్తమోత్తమమైన కార్యంగా భావిస్తారు హైందవులు.

ఆశ్వయుజ మాసంలో వచ్చే బహుళ చతుర్ధశి , అమావాస్య లు పరమ పవిత్ర పర్వదినాలు. భక్తి విశ్వాసాలతో , ఆనందోత్సాహాలతో దేశమంతటా పిల్లలూ, పెద్దలూ అందరూ కలసి జరుపుకునే పండుగ రోజులివి.

నరక చతుర్దశి

బాపుబొమ్మ -  http://www.bapuart.com// వారి సౌజన్యంతో
బాపుబొమ్మ - http://www.bapuart.com// వారి సౌజన్యంతో

ఆశ్వయుజ బహుళ చతుర్దశి నరక చతుర్దశి గా ప్రసిద్ధి పొందింది. నరకాసురుడు నే రాక్షసుడు చెలరేగి సాధు జనాలను పీడిస్తూ దేవ, మర్త్య లోకాలలో సంక్షోభాన్ని కలిగిస్తుంటాడు. కృతయుగం లో హిరణ్యాక్షుని వధించిన వరాహస్వామి కి, భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మిస్తాడు నరకుడు. అతడు లోక కంటకుడైనా మహావిష్ణువు వధించరాదని, తల్లియైన తన చేతిలోనే మరణించేలా వరం పొందుతుంది భూదేవి. మహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానునిగా అవతరించినప్పుడు భూదేవి సత్యభామ గా జన్మింస్తుంది.

అప్పటికి నరకాసురుడు లోక కంటకుడై చేస్తున్న అధర్మకృత్యాలను అరికట్టడానికి సత్యభామా సమేతంగా తరలి వెళ్తాడు శ్రీకృష్ణుడు. వారి మధ్యజరిగిన భీకర సంగ్రామంలో భూదేవి అంశ అయిన సత్యభామ శరాఘాతాలకు మరణిస్తాడు నరకుడు.

తన పుత్రుని పేరైనా కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్థశిగా పిలువబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు. నరకుని చెరనుండి సాధుజనులు, పదహారువేలమంది రాజకన్యలు విడిపించబడ్డారు, ధ్రర్మం సుప్రతిష్టమైంది.

నరకుని మరణానికి సంతోషంతో మర్నాడు అమావాస్య చీకటిని పారద్రోలుతూ దీపాలతో తోరణాలు వెలిగించి బాణాసంచా కాల్చి పండుగ జరుపుకోవడం, అదే దీపావళి పండుగగా ప్రసిద్ది చెందడం జరిగాయి.

దీపావళి

దీపావళి అంటే దీపోత్సవం. ఆ రోజు దీప లక్ష్మి తన కిరణాలతో అమావాస్య చీకట్లను పాలద్రోలి జగత్తును తేజోవంతం చేస్తుంది. ఆ వేళ సర్వశుభాలు, సంపదలు ప్రసాదించే లక్ష్మీదేవిని పూజించడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. దివ్వెల పండుగ దీపావళినాడు లక్ష్మీదేవిని పూజించడానికి కారణం శాస్త్రాలలో క్రింది విధంగా చెప్పబడింది.

తైలే లక్ష్మీర్జలే గంగా దీపావళి తిథౌవసేత్!
అలక్ష్మీ పరిహారార్థం తైలాభ్యంగో విధీయతే!.

దీపావళినాడు నూనెలో ( ముఖ్యంగా నువ్వులనూనె) లక్ష్మీదేవి, నదులు, బావులు, చెరువులు మొదలైన నీటి వనరులలో గంగాదేవి సూక్ష్మ రూపంలో నిండి వుంటారు. కనుక ఆ రోజు నువ్వుల నూనెతో తలంటుకుని సూర్యోదయానికి ముందు నాలుగు ఘడియలు అరుణోదయ కాలంలో అభ్యంగన స్నానం తప్పకుండా చేయాలి. ఇలా చేయుడం వల్ల దారిద్ర్యం తొలగుతుంది, గంగానదీ స్నాన ఫలం లభిస్తుంది, నరక భయం ఉండదనేది పురాణాలు చెపుతున్నాయి.

అమావాస్యనాడు స్వర్గస్థులైన పితరులకు తర్పణం విడవడం విధి కనుక దీపావళినాడు తైలాభ్యంగన స్నానం తరువాత పురుషులు జలతర్పణం చేస్తారు. యమాయ తర్పయామి, తర్పయామి తర్పయామి' అంటూ మూడుసార్లు దోసెట్లో నీరు విడిచిపెట్టడం వల్ల పితృదేవతలు సంతుష్టిచెంది ఆశీర్వదిస్తారు.

స్త్రీలు అభ్యంగన స్నానానంతరం కొత్త బట్టలు కట్టుకుని ఇండ్ల ముందు రంగురంగుల ముగ్గులు తీర్చి గుమ్మాలకు పసుపు , కుంకుమలు రాసి మామిడాకు తోరణాలు కట్టి సాయంత్రం లక్ష్మీపూజకు సన్నాహాలు చేసుకొంటారు. రకరకాలైన రుచికరమైన భక్ష్యభోగ్యాలతో నైవేద్యానికి పిండివంటలు సిద్దం చేయడం, మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె పోసి పూజాగృహంలో, ఇంటి బయట దీప తోరణాలు అమర్చడం, ఆ రోజంతా ఎక్కడలేని హడావుడి, ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాంటాయి.

దిబ్బు దిబ్బు దీపావళి

దిబ్బు దిబ్బు దీపావళి
మళ్ళీ వచ్చే నాగులచవితి...

అంటూ చిన్న పిల్లలంతా గోగునార కట్టలకి చిన్న చిన్న గుడ్డ ముక్కల్ని కట్టి వెలిగించి దిష్టి తీయడాన్ని మనం సంప్రదాయం గా కొన్ని ప్రాంతాలల్లో చూస్తూంటాం. సాయంత్రం ప్రదోష సమయంలో దీపాలు వెలిగించి, ముందుగా పిల్లలు దక్షిణ దిశగా నిలబడి దీపం వెలిగించడాన్ని ఉల్కాదానం అంటారు. ఈ దీపం పితృదేవతలకు దారి చూపుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ దీపం వెలిగించిన తరువాత కాళ్ళు కడుక్కుని ఇంటిలోపలకు వచ్చి తీపి పదార్థం తింటారు. అటు తరువాత పూజాగృహంలో నువ్వులనూనెతో ప్రమిదలు వెలిగించి దీపలక్ష్మికి నమస్కరించి కలశంపై లక్ష్మీదేవిని అవాహన చేసి విధివిధానంగా పూజిస్తారు. పూజానంతరం అందరూ ఉత్సాహంగా బాణాసంచా కాల్చడానికి సంసిద్దులౌతారు. చిచ్చుబుడ్లు, విష్ణుచక్రాలు, భూచక్రాలు, మతాబులు, కాకరపువ్వొత్తులు, కళ్ళు మిరుమిట్లుగొలుపుతుంటే మరో ప్రక్క సీమటపాకాయల ఢమఢమ ధ్వనులతో మ్రోగుతుంటాయి పరిసరాలన్నీ. ఈ విధంగా బాణాసంచా కాల్చడానికి ఒక ప్రయోజనం చెప్పబడింది పురాణాలలో, ఆ వెలుగులో, శబ్దతరంగాలలో దారిద్ర్య దు:ఖాలు దూరంగా తరిమి వేయుబడి లక్ష్మీకటాక్షం సిద్దిస్తుందని, అంతేకాక వర్షఋతువులో ఏర్పడిన తేమవల్ల పుట్టుకువచ్చే క్రిమి కీటకాలు బాణాసంచా పొగలకి నశిస్తాయి.

అసుర నాశనానికి, ధర్మ ప్రతిష్టాపనకు గుర్తుగా అమావాస్యనాడు జరుపుకునే దీపావళి పండుగనాడు లక్ష్మీదేవికి ప్రతీకగా వెలుగులు విరజిమ్మే దీపలక్ష్మిని పూజించడం సర్వశుభాలు ప్రసాదిస్తుంది.

దీపావళి చుట్టూ అనేకానేక కథలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు సత్యభామ సహకారంతో నరకాసురుణ్ణీ వధించాడు గనుక ప్రజలు ఆనందంతో మరునాడు దీపావళి సంబరం చేసుకుంటారని ఒక కథ. ఇంకో కథకూడా ఉంది. లంకలో రావణుని సంహరించి , రాముడు సీతాసమేతంగా అయోధ్య కు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు ఆనందంతో ఈ పండుగ జరుపుకున్నారని చెబుతారు. ఉత్తరాదివారు ముఖ్యంగా వ్యాపారులు దీపావళి రోజును కొత్త సంవత్సరంగా పాటిస్తారు. ఆ రోజు లక్ష్మీదేవి పూజచేసి కొత్త ఖాతా పుస్తకాలు తెరుస్తారు. దీపావళి పండుగల్లాంటివే ప్రపంచంలోని అన్ని సమాజాల్లోనూ ఉన్నాయి.

దసరా

దసరా పండుగ విజయదశమి నాడు జరుపుకోవడం జరుగుతుంది. తెలుగు వారు దసరాని పది రోజులు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది. తెలంగాణా లో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు. తెలంగాణా పల్లెల్లో ప్రతి అమావాస్య కి స్త్రీలు పట్టు పీఠంబరాలు దరించటం ఆనవాయితీ. విజయదశమి రోజు న చరిత్ర ప్రకారం రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భమున రావణ వధ, జామ్మీ ఆకుల పూజా చేయటం రివాజ.ు శరత్ ఋతువు లో వస్తాయి కాబట్టి (డా.శేషగిరిరావు)వీటిని శరన్నవరాత్రులని అన్నారు. జగన్మాత అయిన దుర్గా దేవి ,మహిషాసురుడనే రాక్షసుని తో 9 రాత్రులు యుద్ధము చేసి ఆయన్ని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషము తో పండగ జరుపుకున్నారు,అదే విజయదశమి.దేవీ పూజ ప్రాధాన్యత ఈశాన్యభారతదేశము లో హెచ్చుగా ఉంటుంది.

ఉగాది

ఉగాది, తెలుగువారు జరుపుకునే పండుగలలో ముఖ్యమయినది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. ఉదయాన లేచి తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. దేవస్థానములకు వెళ్ళి పూజలు చేయిస్తారు. పంచాంగ శ్రవణం వింటారు.

విషయ సూచిక


ఉగాది ప్రాముఖ్యం

చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించారని నమ్ముతారు. అంతే కాదు వసంత ఋతువు కూడా అప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవితానికి నాందికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు. [1]

ఉగాది పచ్చడి

ఉగాదినాడు షడ్రుచుల సమ్మేళనం - తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తింటారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సండేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు.
ఉగాది పచ్చడికి మనశాస్త్రాలలో "నింబ కుసుమ భక్షణం" మరియు "అశోకకళికా ప్రాశనం " అని వ్యవహరించే వారు.ఋతు మార్పు కారణంగా వచ్చే వాత,కఫ ,పిత్త దోషాలను హరించే ఓఉషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైంది.ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్దతిలో ఉప్పు'వేపపువ్వు,చింతపండు,బెల్లం,పచ్చిమిరప కాయలు,మామిడి చిగుళ్ళు మరియు అశోక చిగుళ్ళు వేసి చేసేవాళ్ళు.ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
త్వామష్ఠ శోక నరాభీష్ట
మధుమాస సముద్భవ
నిబామి శోక సంతప్తాం
మమ శోకం సదా కురు
ఈ మంత్రం చదువుతూ ఉగాది పచ్చడి తినాలని శాస్త్రాలు చెప్తున్నాయి.ఉగాది పచ్చడి చేసే ఆచారం ఆహారం లో ఉండే ఓఉషధ గుణాన్ని,వృక్షసంరక్షణ అవసరాన్ని,ఆయుర్వేదానికి ఆహారానికి గల సంభందాన్ని చెప్పాడమే కాక హిందూ పండుగలకు,ఆచారాలకు సముచిత ఆహారానికి గల సంబంధాన్ని చాటిచెప్తుంది.

ఉగాది ప్రసాదం

ఉగాది రోజున దేవునికి నైవేద్యం పెట్టవలసిన ప్రశాదంలో ముఖ్యంగా పానకం ,వడపప్పు చోటు చేసుకుంటాయి.ఉగాదితో వేసవి ఆంభం అవుతుంది కనుక వేసవి తాపం తట్టుకోవడానికి పానకం లాంటి నీరాహారం తినడం ఆవసరాన్నిఇది గుర్తు చేస్తుంది అలాగే వడపప్పు కూడా వడ పప్పు లో వాడే పెసరపప్పు చలవచేస్తుం కనుక వేసవిలో కలిగే అవస్థ లను ఇది కొంత తగ్గిస్తుంది.ఇలాంటి ఆహారాన్ని ఉగాది రోజునే కాక ఈ రుతువు మొత్తం తీసుకోవాలన్నా సూచన ఈ ఆచారంలో నిబిడీకృతమై ఉంది.ఉగాదికి విసన కర్రలను పంచే ఆచారం ఉంది.ప్రస్థుత కాలంలో ఉన్న పంఖా లాంటి,ఏసీ మరియు ఎయిర్ కూలరు లాంటి వసతులు లేనికాలంలో వేసవిలో సంభవించే గాలి లేమిని విసనకర్రాలు కొంత తీరుస్తాయి కనుక ఈ ఆచారం ఉగాదితో ప్రారంభం అవుతుంది.

విశేషాలు

  • ఈ పండుగ తెలుగు వారికి తెలుగు సంవత్సరము ప్రకారముగా తొలి పండుగ.
  • ఈ పండుగ ప్రతీ సంవత్సరము చైత్ర శుద్ధ పాడ్యమి రోజున వస్తుంది.
  • ఈ రోజు ప్రతి ఊరిలో దేవాలయాలలో, కూడళ్ళలో, సాంసృతిక సంస్థలలో ఆ సంవత్సరం అంతటా జరిగే మార్పులు, వార ఫలితాలతో పంచాంగ శ్రవణం జరుగుతుంది.
  • ఈ రోజు ప్రతి వారు కొత్తగా పనులు మొదలు పెట్టడం, కొత్తగా కార్యక్రమాలు ప్రారంబించడం చేస్తారు.
  • ఈ పండుగను యుగాది (యుగ+ఆది) అని కూడా అంటారు.
  • తమిళులు మేష సంక్రాంతి మొదటి రోజు ఉగాది జరుపుకుంటారు.
  • కృతయుగంలో కార్తికశుద్ధ అష్టమి రోజు ఉగాది జరుపుకునేవారు.
  • త్రేతా యుగంలో వైశాఖ శుద్ధ తదియ రోజు ఉగాది జరుకునేవారు.
  • ద్వాపరయుగంలో మాఘశుద్ధ అమావాస్య రోజు ఉగాది జరుపుకునే వారు.
  • శ్రీరాముడు,విక్రమాదిత్యుడు,శాలివాహనుడు పట్టాభిషిక్తులైంది చైత్ర శుద్ధ పాడ్యమి రోజే.
  • వరాహమిహిరుడు పంచాంగాన్ని జాతికి అంకితం చేసింది చైత్ర శుద్ధ పాడ్యమి రోజే.
  • కొత్త లెక్కలు ఆరంభించే రోజు ఉగాది.
  • పంచంగ శ్రవణం చేసేరోజు ఉగాది.

a-z

jokes

temple

exam

journey

results

pancard

bank

statement

online

internet]

india

suryapet

america

names

cheif minsiter

prime minister

assembly

parallament

kashmir

delhi

mumbai

hyderabad

telangana

kolkata

festivals

beatiful

zoo park

flower park

childhern paly gound

games

circket

fun

comedy

movies

bollywood

tollywood

hollywood

hero

herione

make up

Sunday, July 6, 2008

మిగిలింది

భార్య : చూశారా! నాఉపవాసాల ఫలితం! ఈ నెల బియ్యం ఖర్చు రెండువందల రూపాయలు మిగిలింది.
భర్త : అవుననుకో! కాని.. పమాత్రమే ఇంకా ఓ వెయ్యి రూపాయలు

లోపం

"పెళ్లయి పదేళ్ళయినా పిల్లలులేరని Doctorని కలిశాం" చెప్పింది లక్ష్మి.
"ఏమన్నాడు?" ఉత్సాహంగా అడిగింది మాల.
"నలభై రకాల పరీక్షలు చేయించాడు. ఆర్నెల్ల మందులు వాడించాడు. అయినా ఫలితం కనిపించలేదు"
"ఇంతకూ లోపం ఎవరిలో ఉందని నీ అనుమానం?"
"Doctorలో ఉందనుకుంటున్నాను" నిమ్మళంగా అన్నది లక్ష్మి. ళ్ళషాపు వాడికి

బరువు

"ఏమే దుర్గ... ఈ మధ్య బరువు తగ్గాలని నెలరోజుల నుంచీ గుర్రపు స్వారీ చేస్తున్నావటగా? ఏవైనా బరువు తగ్గావా ?" ఆశగా అడిగింది పార్వతి.

"హు.... ఏం తగ్గడమో ఏమో? మా గుర్రం మాత్రం ఇరవై కేజీలు బరువు తగ్గింది" నిట్టూరుస్తూ చెప్పింది దుర్గ. బాకీ ఇవ్వాల్సి ఉంది.

Paper

"ఇదేంట్రా పోయిన వారం weekly చదువుతున్నావు?" అడిగాడు రామేశం.
"ఇదివరుకుట్లా weekly కొనడం మానేశానోయ్. ప్రతి వారం పత్రిక కొనగానే చుట్టుపక్కలున్న ప్రతి గాడిద అడిగేవాడే. విసుగెత్తి మానేశాను." చెప్పాడు కామేశం.
"మరి ఈ weekly ఎవరిది?".
"పక్కింటి వారిది. ఇప్పుడే అడిగి తెచ్చాను."

ప్రశాంతం

"పెళ్ళై ఏభై ఏళ్ళు కాపురం చేసిన తరువాత ఇప్పుడు భార్యకు విడకులివ్వాలనుకుంటున్నారా? నాలుగైదేళ్ళలో మీరు కూడా చావబోతున్నారు?" కోపంగా అడిగాడు Judge.

"చచ్చేముందైనా కాస్త ప్రశాంతంగా చద్దామని యువరానర్" దవడలాడించాడు తాతారావు.

కల

"మాంఛి సినిమా తారలు కలలోకి రావాలని దేవుడిని ప్రార్థించి పడుకున్నాను" అన్నాడు పండు.
"మరి వచ్చిందా?" కుతూహలంగా అడిగాడు నరసింహుడు.
"రాక రాక తెల్లవారుఝామున ఒక కల వచ్చింది" చెప్పాడు పండు.
"ఇంకేం. దేవుడు నీ మొర ఆలకించాడన్నమాట" అన్నాడు నరసింహుడు.

"నా బొంద ఆలకించడం. శాంతకుమారి, ఋష్యేంద్రమణి వచ్చారు" అని అన్నాడు పండు.

చెముడు

"Doctor గారూ. నాలుగేళ్ళ నుంచి బ్రహ్మ చెముడు పట్టుకుంది. చెవి పక్క Bomb పేలినా వినపడి చావడం లేదు. ఎలాగైనా తగ్గేలా చెయ్యండి బాబూ మీకు పుణ్యం ఉంటుంది" బతిమాలాడు పుల్లయ్య.

"అదెంత భాగ్యమోయ్! నా పని అదే కదా. కాకపోతే రెండు వేల రూపాయలు నా Fees అవుతుంది" చెప్పాడు Doctor.

"బాబ్బాబు... చచ్చి మీ కడుపున పుడతాను. పిల్లలు కలవాణ్ణి. అంతిచ్చుకోలేను ఓ మూడు వేలల్లో పని అయ్యేట్లు చూడండి." Doctor కాళ్ళు పట్టుకున్నాడు పుల్లయ్య.

అప్పు

"సుబ్రావ్ చచ్చే ఇబ్బందుల్లో ఉన్నాను. ఇంటినిండా బంధువులున్నారు ఓ వెయ్యి రూపాయలు urgentగా కావాలి. ఎవర్నడగాలో తోచక ఛస్తున్నాను" అన్నాడు ప్రసాద్.

"హమ్మయ్య బతికించావు. ఇంకా నన్ను అడుగుతావేమోనని హడలి ఛస్తున్నా" పారిపోతూ అన్నాడు రఘు.

మంత్రం

"ఈ మధ్య మీ ఆవిడ నువ్వు ఏమన్నాసరే దించిన తల ఎత్తడం లేదా? What a wonder! ఏం మంత్రం వేశావ్?" ఆశ్చర్యంగా అడిగాడు శేఖర్.

"ఏం లేదు. నువ్వు తల ఎత్తినప్పుడు అరవై ఏళ్ళ బామ్మలా, తలదించినప్పుడు ఇరవై ఏళ్ళ అప్సరసలా ఉన్నావన్నా. అంతే!" చెప్పాడు రాజు.

Family Planning

"Doctor గారూ ఇప్పటికి అరడజను మంది పిల్లలతో ఛస్తున్నాను. Operation చేయించుకుంటే బాగుంటుందేమో! నేను చేయించుకోవటం మంచిదేనా?" అడిగాడు శ్రీధర్.

"Oh Yes.... ఎందుకైనా మంచిది మీతోపాటు మీ ఆవిడను కూడా చేయించుకోమని చెప్పాండి" పరధ్యానంగా అన్నాడు Doctor.

శపథం

"నా జీవితంలో వెయ్యిమందిని పేకాట, తాగుడు, వ్యభిచారం దురలవాట్లున్నవారిని ఆ అలవాట్లు మాన్పిస్తానని భీకర శపథం చేశాను" అన్నాడు బ్రాందిమూర్తి.

"Very good.... చాలా మంచి పని. మరి ఎవరిచేతైనా అలామాన్పించావా?" అడిగాడు కృష్ణమూర్తి.

"ఇప్పటికి 999 మంది చేత ఆ అలవాటు మాన్పించాను"

"అద్భుతం! ఇంకొక్కడేగా మిగిలింది! అది కూడా పూర్తి చేయకపోయావా?"

"అదే చూస్తున్నా. నేను కూడా మానేద్దామా, వద్దా అని" గొణిగాడు బ్రాందిమూర్తి.

ఈ bus ఎక్కడికి వెళ్తుంది

"ఈ బస్సు ఎక్కడికి వెళ్తుంది? " అని conductor ని అడిగాడు ఒక ప్రయాణికుడు.
"గుంటూరు వెళ్తుంది" అని బదులిచ్చాడు conductor.
"మరి board మీద విజయవాడ అని రాసి ఉంది కదా?" అని ప్రశ్నించాడు ప్రయాణికుడు.
"నువ్వు బస్సెక్కి వెళ్తావా? లేక బోర్డ్ ఎక్కి వెళ్తావా?" అని కసురుకున్నాడు conductor.

అచ్చొచ్చేది

"మా వాడికి అన్ని subjects లోనూ గుండు సున్నాలొస్తున్నాయి. వాడెలా బాగుపడతాడో అర్థం కావడం లేదు" విచారంగా అన్నాడు నారాయణ.

"దానికంత విచారం దేనికిరా? కోడిగుడ్ల వ్యాపారంలోకి దించు రాణిస్తాడు" చెప్పాడు సీతాపతి.

మళ్ళీ

"ఏంటీ? నాకు మళ్ళీ operation చెయ్యాలా? అదేం? నిన్ననే చేసిన operation success అన్నారుగా?" భయంగా అన్నాడు Patient.
"భయపడకోయ్... operation success అనేదాంట్లో అణుమాత్రం సందేహం లేదు. కానీ నిన్న operation చేస్తున్నప్పుడు మా doctor గారి రత్నాల ఉంగరం మీ పొట్ట్లో జారి పదిపోయిందట" చెప్పాడు compounder.

అవకాశం

వెంకట్రావు పెళ్ళి చూపులకు వెళ్ళాడు. సుందరి సిగ్గు పడుతూ చాప మీద కూర్చుంది. పిల్ల నచ్చింది అన్నాడు వెంకట్రావు.

"చాలా సంతోషం బాబూ. అమ్మాయినేమైనా ప్రశ్నలు అడగదలుచుకుంటే ఇప్పుడే అడుగు. పెళ్ళైన తరువాత నీకు ఆ అవకాశం రాకపోవచ్చు" ఆనందం పట్టలేక అన్నాడు సుందరి తండ్రి రాజనాల

అన్యాయం

"ఇది మరీ అన్యాయం. రేపట్నుంచి నేను స్కూలుకు వెళ్ళనుగాక వెళ్ళను" అన్నాడు ఆరేళ్ళ ప్రమోద్.
"అంత అన్యాయం ఏం జరిగిందిరా?" నవ్వుతూ అడిగాడు తండ్రి.
"లేకపోతే! మా టీచరేమో పుస్తకం చూస్తూ పాఠం చెబుతుంది. మమ్మల్ని మాత్రం చూడకుండా పాఠం అప్పజెప్పమంటుంది, తప్పుకాదూ" ముక్కుపుటలు విశాలం చేస్తూ అన్నాడు ప్రమోద్.

దిష్టి

"కాంపౌండరు గారూ..... నిన్నాటినుండి తలంతా దిమ్ముగా ఉంది. తలపోటుగా ఉంది. డాక్టరు గారు లేరా?" మూలుగుతూ అడిగింది కన్నాంబ.
"మీరు కూర్చోండి. డాక్టరు గారు లోపల ఉన్నారు" అన్నాడు కాంపౌండరు.
"త్వరగా పిలవండి ప్లీజ్"
"వస్తారుండమ్మా డాక్టరుగారికి రాత్రి నుంచి తలపోటుగా వుంటే వాళ్ళమ్మ చేత దిష్టి తీయించుకుంటున్నారు" చెప్పాడు కాంపౌం

విలువ

"రెండు ప్లేట్లు వేడి వేడి గారెలు పట్రావోయ్" ఆర్డరేశాడు బ్రహ్మానందం.
"చిత్తం సార్" వెళ్ళి రెండు నిమిషాల్లో తెచ్చాడు సర్వర్.
"ఆహా... కమ్మగా ఉన్నాయ్... ఉప్పు చక్కగా సరిపోయింది. పిండి రోట్లో రుబ్బారా?" తింటూ అడిగాడు బ్రహ్మానందం.
"అవును సార్"
"ఎంతైనా గ్రైండర్లో రుబ్బితే ఇంత రుచి రాదు. చాలా బాగున్నాయి. మరో నాలుగు పట్రా"
"థ్యాంక్యూ సార్. మీరైనా ‘చెమట’ విలువ గ్రహించారు" వెళ్ళాడు సర్వర్.

jokes

coffee

"ఏంటీ? మామూలు కాఫీ రెండు రూపాయలు. స్పెషల్ కాఫీ ఆర్రూపాయలా? ఏంటో స్పెషల్?" సర్వర్ని అడిగాడు సుందరం.

"అత్తగారింటికి వెళ్ళినప్పుడు మీకు మెదటిసారి కఫీ ఎలా ఇస్తారో మా స్పెషల్ కాఫీ ఎప్పుడూ అలాగే ఉంటుంది" చెప్పాడు సర్వర్.

పేరు

Interview జరుగుతున్నది.
"మీ పేరు?" అడిగాడు అధికారి.
"శ్రీ...శ్రీ...శ్రీ...శ్రీ...శ్రీ...శ్రీ...శ్రీ...శ్రీనివాస్ సర్" చెప్పాడు అభ్యర్థి.
"ఏంటి... అన్ని శ్రీ లెందుకు మీకు?"
"న...న...న...న...న... నాకు నత్తి సార్"

ఇంటివాడు

చిలకజోస్యం చెప్పేవాడి మీద మండిపడిపోతున్నాడు జగన్నాధం "ఏం జ్యోతిష్యమండీ మీ బొంద! త్వరలో నేనొక ఇంటివాడినౌతానన్నారు. సంవత్సరం తిరిగినా పెళ్ళి కాలేదు సరి కదా అప్పులెక్కువై ఉన్న రెండు ఇళ్ళలో ఒక ఇల్లు అమ్మి వేయవలసి వచ్చింది" అన్నాడు.

"మరింకేమండీ! ఇప్పుడు మీరు ఒక్క ఇంటివారే కదా! నా జ్యోతిష్యాన్ని తిడతారేం?" అన్నాడు జ్యోతిష్కుడు.

అలవాటు

ఆరుద్ర, ముళ్ళపుడి ఒకరికొకరు ఎదురయ్యారు.
"సిగరెట్స్ తాగడం మానేశాను" అన్నాడు ఆరుద్ర.
"అదేం పెద్ద గొప్ప? నేను అలా చాలాసార్లు మానేశాను" అన్నారు ముళ్ళపుడి.
ప్రార్ధన


దేవుడా.....
ఓ మంచి దేవుడా.....
నువ్వు నాకు ఫ్లాప్ అవ్వడానికి

  • జాన్నీ ఇచ్చావ్.....

  • గుడుంబా శంకర్ ఇచ్చావ్....

  • బాలు ఇచ్చావ్.....

  • బంగారం కూడా ఇచ్చావ్....


ఇలాగే మన స్టేట్‍లో ఉన్న ఏడుగురు హీరోలకి ఇస్తావని.....
అలాగే మన countryలో ఉన్న 150 మంది హీరోలకి....
అదే చేత్తో ప్రపంచంలో ఉన్న ????? - నాకు number correctగా తెలియదు.....
ఎంత మంది ఉంటే అంతమందికీ ఇవే flops ఇస్తావని
అంటే as it is గా ఇవే flops కాదు...
వాళ్ళు ఏ సినిమా తీస్తే ఆ సినిమా

  • స్టాలిన్

  • అశోక్

  • మున్నా

  • సైనికుడు

  • విక్రమార్కుడు

  • ....


అలాగే ఇస్తావని కోరుకుంటున్నాను.....
నువ్వు ఇస్తావ్ నాకు తెలుసు....
ఎందుకంటే... basically you are GOD....
you are very good GOD....
అంతే....That's all....
నా ప్రార్ధన మీ అందరికీ కొంచెం కొత్తగా అనిపించొచ్చు....
************

బరువు

Doctor వద్దకు పరుగుతో వచ్చాడు కవిరాజు.
"dcotor.. doctor... రేపు సాయంత్రం ఆరుగంటలలోగా నేను కనీసం 20 కిలోల బరువు పెరగాలి. ఏవైనా మంచి మందులు చెప్పండి" రొప్పుతూ అన్నాడు.

"ఇదేంటి కవిగారూ... అందరూ బరువు తగ్గడానికి మందులకోసం వస్తారు. మీరు పెరగాలంటారేంటి?" ఆశ్చర్యంగా అన్నాడు doctor.

ఇల్లు ఇల్లాలు

"ఏంరోయ్ సీతారాం. మొన్న మీ ఇంటికొస్తే తాళం వేసుంది. ఇల్లేమైనా మారావా?" బజార్లో అడిగాడు రాజారాం.
"ఆ.... అదేం లేదురా! ఎన్నేళ్ళు పోయినా అదే ఇల్లు, అదే ఇల్లాలు" నవ్వుతూ అన్నాడు సీతారాం.

"శివం సంస్థవారు రేపు నాకు సన్మానం చేసి రూపాయి నాణాలతో తులాభారం తూస్తారట" చెప్పాడు కవి.

Biscuit

"వెధవా.. దున్నపోతా... నెత్తిమీదకు పదేళ్ళు వచ్చాయి. చెల్లెలికి biscuit చిన్న ముక్క ఇచ్చి పెద్దది నువ్వు తింటూ దాన్నేడిపిస్తున్నావా? వెధవా కాకి చూడు, ఆహారం తెచ్చి ముందు పిల్లలకిచ్చి తరువాత తాను తింటుంది" టింకూను మందలిస్తున్నది రాజేశ్వరి.

"కాకి తినెది ఎంగిలి మెతుకులు. అవైతే నేనూ మొత్తం చెల్లికే ఇచ్చేవాడిని" అన్నాడు టింకు.

నమ్మకం

"ఏదమ్మా.. ఈ బెడ్ మీద పడుకో. పరీక్ష చేస్తాను" అన్నాడు డాక్టర్ మన్మధరావు.
"మనతో పాటు మీ నర్స్ కూడా ఉంటే బాగుంటుంది డాక్టర్..." అన్నది కామేశ్వరి.
"అదేంటమ్మా.... నామీద నమ్మకం లేదా?" బాధగా అన్నాడు డాక్టర్.
"మీ మీద కాదండి. బయటున్న మాఆయనకు నా మీద నమ్మాకం లేదు" చెప్పింది కామేశ్వరి.

బాధ

ఫుల్‍గా తాగి ఇంటికొచ్చాడు పరమేశం.
"ఏంటండీ.... రాత్రి పన్నెండయింది. పైగా మన పెళ్ళిరోజు. ఇలా తాగొచ్చారేంటీ" కోపంగా అంది అంబిక.
"అవును అంబీ... ఆ బాధను మర్చిపోవడానికే ఇలా తాగొచ్చాను" సోఫాలో కూలబడుతూ అన్నాడు పరమేశం.

రచయిత్రి

"నా నవల వెలుగులోకి రావడానికి 20 సంవత్సరాలు పట్టింది" చెప్పింది రచయిత్రి కామాక్షి.
"అబ్బా.. చాలా కష్టపడ్డారన్నమాట" అన్నాడు విలేఖరి.
"అవును రాయడం వారం రోజుల్లో అయింది. Publisher వెతకడానికి 20 సంవత్సరాలు పట్టింది" అన్నది కామాక్షి.

బెలూన్

నాదస్వర విద్వంసుడు నారదన్ వరండాలో కూర్చుని ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఓ బాలుడు వచ్చి నమస్కరించాడు.
"శుభమస్తు.. ఏం బాబూ నాదస్వరం నేర్చుకుంటావా? నెలకు నాలుగు వందలౌతుంది" అన్నాడు నారదన్.
"లేదంకుల్.. నా బెలూన్ ఎంతసేపు ఊదినా గాలి పోవడం లేదు. కొంచెం గాలి ఊది పెడతారేమోనని వచ్చాను" అన్నాడు.

అగ్ని ప్రమాదం

ఒక పెద్ద భవనం మంటల్లో ఆహుతైపోతున్నది. అప్పారావు అటుగా వెళ్తున్నాడు.
"అయ్యో..... అయ్యో... ఆ భవనం అలా కాలిపోతుంటే అలా చోద్యం చూస్తారేంటి. వెంటనే Fire stationకి phone చెయ్యండి" అరిచాడు.
"ఆ కాలిపోయేది Fire Stationఏ నాయనా" బదులిచ్చాడో ఆసామి.

సినిమా

Teacher : ఏంట్రా గోపీ! తలనొప్పి, రొంపమ్ దగ్గు అని బడి ఎగ్గొట్టి సినిమాకు వెళ్ళావట?
గోపీ : అవును Teacher. సినిమా ADsలో ఏ మందు వేసుకోవాలో చూపిస్తారని.

లాంఛనాలు

"అల్లుడుగారూ.. కట్నం విషయం కుదిరింది కాబట్టి లాంఛనాల విషయం మాట్లాడుకుందాం. Scooter, Colour TV, ఇవ్వాలనుకుంటున్నాం ఏవంటారు?" కాబోయే అల్లుడిని అదిగాడు రామనాధం.

"ఎందుకండీ నా కలాంటివేమీ వద్దు. ఒక washing machine, ఒక grinder ఇప్పించండి చాలు. నాకు పని తప్పుతుంది" అనాడు “ముందుచూపుతో” నారాయణ.

దగ్గు

రాఘవయ్య అర్దరాత్రి లేచి విపరీతంగా దగ్గుతున్నాడు.
అరగంట సేపు దగ్గిన తరువాత భార్యకు మండిపోయింది.
"అబ్బబ్బ... మీదగ్గు వినలేకపోతున్నాను" అన్నది.
"నన్ను మాత్రం ఏమి చేయమంటవు. ఇంతకన్న పెద్దగా దగ్గటం నావల్ల కాదు. ఖళ్ ఖళ్ ఖళ్...."

చదువు

ఇద్దరు మిత్రులు తిరుమల ఘాట్ రోడ్డు మీద నడిచి వెళ్తుంటే ఒక పులి ఎదురొచ్చింది. ఇద్దరూ వణికిపోయారు.

"భయపడకు ఆనంద్.... Suddenగా పులి ఎదురొచ్చినప్పుదు చేతులు రెండు పక్కలకు జూపి దిష్ఠి బొమ్మలా కదలకుండా నిలుచుంటే పులి ఏమీ చేయదని మొన్న ఒక పత్రికలో చదివాను." ధైర్యం చెప్పాడు సంజీవి.

"నువ్వు చదివావు సరే. మరి ఆపులి ఆ పత్రిక చదివిందా అని" వణుకుతూ అన్నాడు ఆనంద్.

రహస్యం

భజగోవిందం మీద ఆవేశంతో ఊగిపోతున్నాడు ఆంజనేయులు. "అసలేమిటి మీ ఉద్దేశ్యం? నేను ఒఠ్ఠి అవినీతిపరుడినని, ముండల ముఠాకోరునని, రేసులాడతానని, తాగుతానని, తాగొచ్చి పెళ్లన్ని తంతానని నా మీద ఊరందరికీ చెబుతున్నారట!"

"క్షమించండి సార్.... ఇవన్నీ రహస్యాలని ఇంతవరకూ నాకు తెలియదు" చల్లగా అన్నాడు ఆంజనేయులు.

ఆటగాడు

"మంచి ఆటగాడు అని చెపితే ఏదో పెద్ద player అని పెళ్ళి ఛెశుకున్నా. తీరా చేసుకున్న తరువాత తెలిసింది" విచారంగా అంది సుమలత.
"ఏమైంది? మరి ఆటగాడు కాదా అతను" అడిగింది శ్రీదేవి.
"ఆటగాడే.... తోలుబొమ్మల్ని ఆడిస్తుంటాడటా పల్లెటూర్లలో.." ఏడ్చింది సుమలత.

పరాయి స్త్రీ

"నేను పరాయి స్త్రీని తల్లిలా భావిస్తాను" గొప్ప చెప్పుకున్నాడు రాజేష్ తన Hi-tech loverతో.
"ఏఁ.. మీ నాన్న నీకు ఏ అమ్మాయినీ ప్రేమించడానికి ఛాన్స్ ఇవ్వడా?.... తనే ముందు enter అవుతాడా!!!?" అంటూ అనుమనంగా అడిగిందా Hi-tech lover.

సామెతలు - ప్రేమ, పెళ్ళి

"ఆలస్యం అమృతం విషమంటే?"
"త్వరగా ప్రేమించు అని".
"మరి.. నిదానమే ప్రధానమంటే?"
"కాస్త ఆలోచించి పెళ్ళి చేసుకో అని".

Parking

"సార్... ఇక్కడ scooter park చేసుకోవచ్చా?" ఒక centerలో policeని అడిగాడు చక్రవర్తి.
"Sorry.... ఇది no parking zone", చెప్పాడు police.
"మరిక్కడ వంద scooterలు ఉన్నాయ్?"
"వారెవరూ మీలా నన్ను అడగలేదు" చెప్పడు police. .

తెలివితేటలు

"రాధా రాధా.... మన్ బుజ్జిపండు మాటలు విన్నావా? చూడు రెండేళ్ళకే ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో! నా తెలివితేటలన్నీ వీడికి వచ్చాయి" సంతోషంగా అన్నాడు రమేష్.
"అవును నిజమే. నా తెలివితేటలన్నీ నా దగ్గరే ఉన్నాయి" అన్నది రాధ.

Steel సామాను

"ఏమిటండీ.... suitcase నిండా బట్టలన్నీ సర్దుకుంటున్నారు. ఏదైనా campకి వెళ్తున్నారా?" అడిగింది లత భర్తని.
"Camp ఆ నా బొందా? Steel సామాన్లవాడిని నేను officeకి వెళ్ళగానే రమ్మన్నావుగా. అందుకె నాజాగ్రత్తలో నేనుండాలి" బయలుదేరాడు శ్రీధర్.

మాయం

"రెండు గంటల నుంచి నీతో మాట్లాడుతుంటే అస్సలు కాలం తెలియడం లేదు. నా తలనొప్పంతా మాయమైపోయింది." అన్నడు ధర్మారావు.
"ఓ! ఇప్పుడర్థమైంది. నా తలలోకి వచ్చిన నొప్పి మీదేనా?" తలపట్టుకుని అన్నాడు అర్జున్రావు.

పిసినారితనం

"పిసినిగొట్టుతనానికి ఓ హద్దు అదుపు ఉండాలి. మూరెడు మల్లెపూలు తెమ్మంటే పావలా పెట్టి పది విడి పూలు తెస్తారా?" కోపంగా అన్నది రోహిణి.
"సర్లే, ఈపూలను Fridgeలో పెట్టి రోజుకొకటి జడలో గుచ్చుకో" అన్నాడు శాంతారాం.

సిగ్గు లేదా?

Judge : మళ్ళీ మళ్ళీ courtకి రావటానికి నీకు సిగ్గు లేదా?
నేరస్థుడు : మరి మీకు? నేను అప్పుడప్పుడు మాత్రం వస్తున్నాను. మీరు రోజూ వస్తున్నారుగా?

ఎలా వెళ్ళాలి

"సార్.. సార్... Barber shopకి ఎలా వెళ్ళాలి" అని అడిగాడు ఊరికి వచ్చిన్ గిరిబాబు ఒక పెద్దమనిషిని.
"జుట్టు బాగా పెంచుకుని వెళ్ళాలి." చెప్పాడా పెద్దమనిషి..

తెలుసుకుందామని....

రామనాధం, జోగినాధం సువర్చలగారింటికి వెళ్ళారు. గేటు వేసి ఉంది.
"జోగినాధం.... లోపలికెళ్ళి సువర్చల గారున్నారేమో చూడూ" అన్నాడు రామనాధం.
"అమ్మో... వాళ్ళింట్లో పెద్ద కుక్క ఉన్నది. మీద పడి పీకుతుంది." భయంగా అన్నాడు జోగినాధం.
"అది తెలుసుకుందామనే గదా నేను నిను అడుగుతున్నది...." అన్నడు రామనాధం

పుట్టిన రోజు

Teacher : ఒరేయ్ రాము! నీ పుట్టిన రోజు ఎప్పుడు?
రాము : August 14 న teacher.
Teacher : ఏ సంవత్సరం?
రాము : ప్రతి సంవత్సరం.
Teacher : !!!!!

అమ్మావా??

ఒక రచయిత : నేనీ మధ్య T.V serials కూడా కథలు రాసి అమ్ముతున్నాను, తెలుసా?
శ్రోత : ఇంతవరకు ఏమైనా అమ్మావా?

రచయిత : ఆ!....., ఒక వాచీ, ఉంగరం...

మలుపులు

"ఏంటమ్మా ఇది? మీ కథల్లో దాదాపు ప్రతి పేరాలోనూ స్కూటర్ మలుపు తిరిగింది, కారు మలుపు తిరిగింది, అతను మలుపు తిరిగాడు లాంటి వాక్యాలు కనిపిస్తున్నయి?" రచయిత్రి సులోచనతో అన్నాడు ఎడిటర్.
"అదేంటి సార్.... కథల్లో

గెడ్డం

"నేను ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం రెండుసార్లు గెడ్డంగీస్తాను. మరి నువ్వురా సుధాకర్" అడిగాడు గోవిందరావు.
"ఓ నలభై, ఏభై సార్లు" చెప్పాడు సుధాకర్.
"ఏంటి... అన్నిసార్లా... నీకేమైనా పిచ్చా?"
" కాదురా... ఈమధ్య సెలూన్ స్టార్ట్ చేశాను" ఎన్నో మలుపులుండాలని మీరే కదా అన్నారు?" కళ్ళు విశాలం చేస్తూ అన్నది సులోచన.

పెళ్ళికి తొందర

తనకు తొందరగా పెళ్ళి చెయ్యమని, లేకపోతే ఎవరితోనైనా లేచిపోతానని అమ్మాయి warning ఇచ్చిందండీ" విచారంగా చెప్పింది అన్నపూర్ణ.
"అప్పుడే ఏం తొందర దాని పెళ్ళికి?" ఆశ్చర్యంగా అన్నాడు సహదేవరావు.
"దానికి బట్టలుతుక్కోవడం చాలా శ్రమగా ఉందట" చెప్పింది అన్నపూర్ణ.

నిద్ర

"నాకీ మధ్య నిద్ర సరిగ్గా పట్టడం లేదండీ" Doctorతో అనాడు సూరిబాబు.
"ఏదైనా government ఉద్యోగం సంపాదించండి. మీసమస్య తీరుతుంది." చెప్పాడు Doctor.

రక్షించండి

గండిపేట చెరువు దగ్గర - "రక్షించండి... రక్షించండి... మా అక్క నీళ్ళలో మునిగిపోయింది" పన్నెండేళ్ళ రవి కేకలు పెట్టాడు.
వెంటనే నలుగురు యువకులు నీటొలో దూకి ఒక ముసలమ్మను బయటకు తెచ్చారు. ఎంత వెతికినా అక్కయ్య కనిపించలేదు.
"సారీ బాబూ.... మీ బామ్మను మాత్రమే రక్షించగలిగాం. అక్క కనిపించలేదు" విచారంగా అన్నారు యువకులు.
"Thanks uncles.. మునిగిపోయింది మా బామ్మే" అన్నాడు రవి.
యువకులు తెల్లముఖాలు వేశారు.

ఉత్తరాలు

"కేవలం ఉత్తరాలు రాస్తూ బతుకుతున్నావా? నీ ఉత్తరాలు అంత విలువైనవా? ఏ మ్యాగజైన్సుకు?" కుతూహలంగా అడిగాడు ఆంజనేయులు.

"అవును. డబ్బు పంపమని మానాన్నకు రాస్తూంటాను" నిబ్బరంగా చెప్పాడు రమణ.

(దీన్నే కాస్త modernగా ...

"ఏమిటి కేవలం computer మీద బతుకుతున్నావా? బ్లాగులు వగైరా రాస్తున్నావా ఏమిటి?" కుతూహలంగా అడిగాడు రాజ్.
"అవును. డబ్బు online transfer చెయ్యమని మా Daddyకి E-mail పంపిస్తూ ఉంటాను" నిబ్బరంగా చెప్పాడు అరవింద.)

చినగదు

"సార్.... ఈ షర్టు గుడ్డ తీసుకోడి. అస్సలు చినగదు" తాను చూపుతూ అన్నాడు Salesman.
"గుడ్డ చాలా బాగుంది. కానీ వద్దులే" అన్నాడు అప్పారావు.
"అదేం సార్.. పెద్ద ఖరీదేం కాదు"
"ఖరీదు సంగతి కాదు. నాకు రెండు మీటర్లు చాలు. కానీ చినగదంటున్నావు కదా! ఎలా చించిస్తావు?" అడిగాడు అప్పారావు.

వయసు

"అబ్బ... డాక్టర్ రావు నిజంగా ధన్వంతరే. మాఆవిడ బద్దకాన్ని, ఆయాసాన్ని ఒక్క దెబ్బకు పోగొట్టాడు" సంతోషంగా చెప్పాడు చిదంబరం.
"ఏం మందిచ్చాడేం?" కుతూహలంగా అడిగాడు ఏకాంబరం.
"వయసు పెరుగుతున్నది కదా. అందుకే అలసట అన్నడు. అంతే! మర్నాటి నుంచి నలుగురు మనుషుల పని చకచక చేస్తున్నది" అన్నడు చిదంబరం.

అనుభవం

"మొన్న ఒక పత్రికలో మీ కథ చదివాను. నా కంటే మీరు చిన్నవారైనా అనుభవం మాత్రం పెద్దది" తోటి రచయితతో అన్నాడు సాటి రచయిత.
"ఏం అలా అంటున్నారు?"
"ఏం లేదు. నేను ముప్పై సంవత్సరాల నాటి కథలు కాపీ కొడితే మీరు ఏభై సంవత్సరాల నటి కథలు కాపీ కొడుతున్నారు."

రైలు ప్రయణం - పెళ్ళికి ముందు, తరువాత

పెళ్ళికి ముందు

రాము, సీతల పెళ్ళి నిశ్చితార్ధం అయిపోయింది. ఇద్దరూ హైదరాబాదులో software ఉద్యోగం. వాళ్ళ కుటుంబాలు (అమ్మా, నాన్నలు మటుకు విశాఖపట్టణంలో). ఒక weekend ఇద్దరూ విశాఖపట్టణం కలిసి వెళ్తున్నారు.



సమయం : 22:00 hrs

సీత : ఏంటి ఇంత త్వరగా station కి వచ్చారు?

రాము : నేను మామూలుగా రైలు 22:30 కి అంటే 22:00 కల్లా station కి వచ్చేస్తాను.

రాము : సరే. నేను అలా వెళ్ళి water bottle కొనుక్కొని వస్తాను.

సీత : సరే



ఒక రెండు నిమిషాల తరువాత రాము పరుగెత్తుకుంటూ వస్తాడు. Water bottleతో పాటు చిన్ని చిన్ని గుండెలు (brittania little hearts) biscuit packet కూడా తీసుకు వచ్చాడు.



సీత : ఎందుకు అలా పరుగెత్తి వస్తున్నారు? మెల్లగా రావచ్చు కదా?

రాము : మ్.. అంటే.. నువ్వు ఒక్క దానివే ఉన్నావు కదా. అందుకని.

సీత : అయ్యో.. అసలు ఎప్పుడూ నేను ఒక్కదానినే ప్రయాణం చేస్తాను. ఇదే మొదటిసారి ఇంకొకరితో కలిసి వెళ్ళటం.

రాము : సరే పద వెళ్ళి రైల్లో కూర్చుందాము.



రాము, సీత రైలు ఎక్కుతారు.



సీత : side upper side lower book చేసారా?

రాము : అవును. ఇలా అయితే హాయిగా ఎదురు ఎదురుగా కూర్చుని ఎంచక్కా కబుర్లు చెప్పుకోవచ్చు.

అవీ ఇవీ అన్నీ మాట్లాడుకుంటున్నారు. మిగతా ప్రయాణికులు అంతా నిద్రపోయారు కానీ వీళ్ళు మాత్రం మాట్లాడుటూనే ఉన్నారు. ఇంతలో ఒక పెద్ద మనిషి వచ్చి " మీరు కొంచెం మెల్లగా మాట్లాడుకోండి. మా నిద్రను disturb చేస్తున్నారు".

సరే అని రాము, సీత తలుపు దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక గంటెసేపు కూర్చి, మాట్లాడుకుని వచ్చి తమ తమ berth ల లో పడుకున్నారు.


పెళ్ళైన తరువాత

పెళ్ళైన తొమ్మిది నెలల తరువాత మళ్ళీ రాము, సీత ప్రయాణమయ్యారు. ఇద్దరూ train ఎక్కారు.

సీత : ఏ బెర్త్??

రాము : రెండు upper berths book చేసాను (మనసులో వెధవ నస ఉండదు)

సీత : హమ్....

రాము : సరే water bottle ఇవ్వు.

సీత : water bottle లేదు. Stationలో కొందామని అనుకున్నాను.

రాము : ముందే చెప్పి ఏడవచ్చు కదా? ఇప్పుడు చూడు train బయలుదేరడానికి ఇంకా 5 నిమిషాలు మాత్రమే ఉన్నది.

సీత : మీరు ఇలానే అనుకుంటూ కూర్చుంటే, ఆ 5 నిమిషాలు కూడా ఉండదు.

రాము : (ఛీ ఎధవ బతుకు)

రాము : పరిగెత్తుకుంటూ వెళ్ళి నీళ్ళు తీసుకొని వస్తాడు. (ఈ సారి నీళ్ళు మాత్రమే. చిన్ని చిన్ని గుండెలు లేవు)

train time అయ్యింది , బయలు దేరింది.

సీత (ఆవిలిస్తూ) : సరే నేను బాగా అలసిపోయి ఉన్నాను. నేను పడుకుంటున్నాను.

రాము : సరే పడుకో. (కొంచెం సేపు నేను ప్రశాంతంగా ఉండచ్చు)

TC వచ్చి ticket సరి చూసిన తరువాత రాము కూడా నిద్ర పోవడానికి ఉపక్రమించాడు. కానీ ఎంతకీ నిద్ర పట్టడంలేదు. పక్కనే side upper ,side lower berth లో ఉన్న జంట మాట్లాడుకుంటున్నారు.

ఆ జంట సరేనని, మెల్లగా train తలుపు వైపు వెళ్ళి .........

****************************

జీవిత ప్రయాణం అలా సాగిపోతుంటుంది.....

ముందుగా

"ఆఁ..... ఏవోయ్ వెంకట్రావ్! రాత్రి ఎనిమిదైంది. అసలే కొత్తగా పళ్ళైనవాడివి. ఇంటికి వెళ్ళాలనిపించడంలేదా? ఇంకా పని చేస్తూనే ఉన్నావు?" మెచ్చుకోలుగా అన్నాడు officer.
"ఏం లేదు సార్. మా ఆవిడ కూడా ఉద్యోగం చేస్తుంది. ముందుగా ఎవరైతే ఇంటికి చేరుతారో వాళ్ళు వంట చేయాలి" రహస్యం చెప్పాడు వెంకట్రావు.

జ్ఞాపకశక్తి

"బాబూ.. ’జ్ఞాపకశక్తి వెయ్యిరెట్లు పెంచుకోవటం ఎలా?’ అనే పుస్తకం ఉందా?" అడిగాడు రామకృష్ణ పుస్తకాల షాపులో .
"ఉంది సార్... నూట ఇరవై రూపాయలు" అన్నాడు షాపతను.
"Thank You" డబ్బులిచ్చి పుస్తకం తీసుకునివెళ్తున్నాడు రామకృష్ణ.
"Excuse me sir... చదవనప్పుడు ఈ పుస్తకం మీకెందుకు" అని అడిగాడు షాపతను.
"What?.. నేను చదవనా? ఎవర్న్నారు?" కోపంగా అన్నాడు రామకృష్ణ.
"ఇదే పుస్తకం మీరు గతంలో నాలుగుసార్లు కొన్నారు!!!" గుర్తు చేశాడు షాపతను.

అపరకర్ణుడు

"అయ్యా.. నా పేరు సత్యమూర్తి. ఈ చుట్టుపక్కల పది గ్రామాల్లోకెల్లా ధనవంతులు మీరు. మీరు అపర దానకర్ణులని, చేతికి ఎముక లేకుండా దనధర్మాలు చేస్తారని చాలా మంది చెప్పారు. అందువల్ల ఆశతో చాలాదూరం నుంచి వచ్చాను. ఏదైనా సాయం చేసి పుణ్యం కట్టుకోండి" కోటీశ్వరుడు విశ్వామిత్రతో మొరపెట్టుకున్నాడు.



"ఓ చిన్న సాయం చెయ్యండి. మీరు వెంటనే తిరిగి వెళ్ళి అవన్ని ఒట్టి పుకార్లని వారందరితో చెప్పండి" అన్నాడా కోటీశ్వరుడు

సమ్మక్క సారక్క జాతర



సమ్మక్క సారక్క జాతర


జంపన వాగులో స్నానం చేసే భక్తులు జాతర దృశ్యం

జాతరలో జన సముద్రం
జాతరలో మరొక దృశ్యం.
సమ్మక్క సారక్క జాతర (Sammakka Sarakka Jatara) అనేది వరంగల్ జిల్లా, తాడ్వాయి (వరంగల్ జిల్లా మండలం) మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర.
వరంగల్లు జిల్లాకేంద్రము నుండి 110 కిలోమీటర్ల దూరములోతాడ్వాయి మండలములో ఉన్నమారుమూల అటవీ ప్రాంతమైన మేడారం లో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య ఈచారిత్రాత్మకమైన ఈ జాతర జరుగుతుంది . సమస్త గిరిజనుల సమారాధ్య దేవతలు, కస్టాలను కడతేర్చే కలియుగ దైవాలుగా, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపధ్భాందవులుగా, యావదాంద్ర దేశములోనే గాక అఖిలభారత దేశములోనే వనదేవతులుగా పూజలందుకుంటున్నారీ సమ్మక్క-సారక్క. దేశములోనే అతి పెద్ద గిరిజన జాతరగా గణతికెక్కిన మేడారం జాతర గిరిజన సాంప్రదాయ రీతుల్లో జరుగుతుంది .
మన రాష్ట్రము నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఒరిస్సా ,చత్తీస్‌గఢ్,జార్ఖండ్ రాస్ట్రాల నుండి కూడా లక్షల కొద్ది భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు .1996 లో ఈ జాతరను రాస్ట్రప్రభుత్వము రాష్ట్ర పండుగగా గుర్తించింది .
విషయ సూచిక


1 ఎవరీ సమ్మక్క-సారక్కలు?
2 జాతర విశేషాలు
3 జాతర ఫొటోలు
4 మూలాలు, వనరులు

ఎవరీ సమ్మక్క-సారక్కలు?
12 వ శతాభ్దములో నేటి కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతములోని 'పొలవాసను'పాలించే గిరిజన దొర మేడరాజు ఏకైక కుమార్తె సమ్మక్క ను ఆయన మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్ద రాజుకిచ్చి వివాహము చేసారు. ఈ దంపతులకు సారలమ్మ ,నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానము కలిగారు. రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పొలవాస పై దండెత్తేడు.ఆయన దాడికి తట్టుకోలేక మేడరాజు మేడారం పారిపోయి అజ్ఞాతవాసము గడుపుతుంటాడు. మేడారాన్ని పాలించే కోయరాజు 'పగిడిద్దరాజు' కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటక పరిస్థితుల కారణముగా కప్పము కట్టలేకపోతాడు. కప్పం కట్టకపోవడం, మేడరాజుకు ఆశ్రయం కల్పించడం ..కోయ గిరిజనులలో సార్వభౌమునికి వ్యతిరేకంగా విప్లవభావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణముతో పగిడిద్ద రాజుపై ఆగ్రహం చెందిన ప్రతాపరుద్రుడు అతడిని అణచివేయడానికి తన ప్రధాన మంత్రి యుగంధరుడితో సహా మాఘశుద్ద పౌర్ణమి రోజున మేడారం పై దండెత్తుతాడు.
సాంప్రదాయ ఆయుధాలు ధరించి పగిడిద్ద రాజు, సమ్మక్క, సారక్క,నాగమ్మ, జంపన్న, గోవిందరాజులు వేర్వేరు ప్రాంతాలనుండి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితం గా పోరాటము చేస్తారు. కాని సుశిక్షితులైన అపార కాకతీయ చేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు యుద్ధములో మరణిస్తారు. పరాజయవార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు. అప్పటి నుండి సంపెంగవాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందినది.
ఇక సమ్మక్క యుద్ధభూమిలో కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్పుతిప్పలు పెడుతుంది, వీరోచితం గా పోరాటం సాగించింది. గిరిజన మహిల యుద్ధనైపుణ్యానికి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు ధారలతోనే యుద్ధభూమినుంచి నిష్క్రమించి చిలుక గుట్టవైపు వెళుతూ మార్గమధ్యములోనే అద్రుశ్యమైనది. సమ్మక్క ను వెదుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు, కాని ఆ ప్రాంతములో ఒక పుట్ట దగ్గర పసుపు, కుంకుమలు గల భరిణె లభించినది. దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘ శుద్ద పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపు కుంటున్నారు.

జాతర విశేషాలు
జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు. రెండవ రోజున చిలుకల గుట్టలో భరిణెరూపములో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్టిస్తారు. దేవతలు గద్దెలపై ప్రతిష్టించే సమయములో భక్తులు పూనకంతో ఊగిపోతారు. మూడవ రోజున అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువుతీరుతారు. నాలుగవ రోజు సాయంత్రము ఆవాహన పలికి దేవతలను ఇద్దరినీ తిరిగి యదాస్థానానికి తరలిస్తారు. వంశ పారంపర్యముగా వస్తున్న గిరిజనులే పూజార్లు కావడం ఈ జాతర ప్రత్యేకత. తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారము(బెల్లము)నైవేద్యము గా సమర్పించుకుంటారు.

అప్పులు హద్దులు దాటితే తప్పవు చిక్కులు


అవసరానికి తగ్గ సోమ్ము మనదగ్గర లేనప్పుడు ఇతరుల దగ్గర తిరిగి చెల్లించే ప్రాతిపదికలో సొమ్ము తీసుకోవడాన్ని అప్పుగా చెప్పవచ్చు. అప్పు అన్నది ఎప్పటినుంచో ఉన్నా గతంలో అప్పు అన్నది అందరికీ అందుబాటులో ఉండేది కాదు. అయితే నేడు అప్పు అనేది అనేక రకాలుగా మనకు అందుబాటులో ఉంది. అప్పు రూపంలో కేవలం సోమ్మే కాదు వస్తువుల దగ్గరనుంచి మరెన్నో మనకు అప్పుగా లభిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో అప్పులు మనల్ని వెతుక్కుని మరీ వస్తున్నాయి. అయితే దొరుకుతోంది కదాని మన రాబడికి మించి అప్పులు స్వీకరిస్తే చివరకు అవే మన కొంప ముంచేస్తాయి. నేటి కాలంలో వాయిదాల పేరుతో ప్రతిది అందరికీ అందుబాటులోకి వచ్చింది. దీంతో కొందరు ఆదాయానికి మించి వాయిదాల రూపంలో అప్పులు చేసేస్తుంటారు. చివరకు అన్ని రకాల వాయిదాలు కలిసి నెత్తిన పడ్డప్పుడు లబోదిబో అంటుంటారు. ఇలా వాయిదాల పేరుతోనే, మరో రూపంలోనో అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఉండడానికి ఆర్థిక నిపుణలు కొన్ని సూచనలు చేస్తున్నారు. వాయిదా రూపంలో కానీ, మరో రూపంలో కానీ ఏదైనా అప్పు తీసుకునేటప్పుడు దాని అవసరం మనకు ఏమాత్రం ఉందన్న విషయాన్ని ముందుగా ఆలోచించాలి. అలాగే ప్రస్తుతం తీసుకుంటున్న అప్పుతో కలిపి నెలవారీ మనం చెల్లించాల్సిన వాయిదాలు ఎంత అన్న విషయాన్ని ఈ సందర్భంగా పునః సమిక్షించుకోవాలి. ఇలా ఆలోచించడం వల్ల తాజాగా తీసుకోబోయే రుణం మిమ్మల్ని బాధించే అవకాశాలు తగ్గుతాయి. అలాగే వాయిదాల రూపంలో ఏదైనా వస్తువో గృహ అలంకరణ సాముగ్రినో కొనుగోలు చేసే ముందు అది తమ తాహత్తుకు తగినిదా, దాని అవసరం తమకు నిజంగా ఉందా అన్న విషయం కూడా ఆలోచించాలి. ఎందుకంటే మనకొచ్చే ఆదాయాన్ని బట్టి మన ఖర్చులు, హోదాలు ఉన్నప్పుడే జీవితం సాఫీగా సాగిపోతుంది. అలా కాక ఆదాయాన్ని మించి ఖర్చులు ఉంటే బరువెక్కిన ఓడలా బ్రతుకుబండి సైతం ఎప్పుడో ఒకప్పుడు మునిగిపోక తప్పదు. అందుకే వాయిదాల రూపంలో తీసుకునే అప్పుల విషయంలోనూ జాగ్రత్త వహించక తప్పుదు. మొత్తంగా చెప్పాలంటే మీ ఆదాయంతో పోల్చినపుడు మీ వాయిదాల చెల్లింపు నిష్పత్తి 30 శాతానికి మించకుండా ఉన్నప్పుడే మీరు అవసరానికి మాత్రమే అప్పుల వైపు చూస్తున్నారని అర్థం. అలాంటి పరిస్థిలో మీ ఆర్థిక స్థితి ఉంటేనే మీరు జీవితంలో ఆనందంగా ఉండగలరు.

నిజాం తలవంచిన రోజు…

భారత సేన హైదరాబాద్‌ సంస్థాన విమోచన కోసం పథ సంచలనం ప్రారంభించింది. ‘ఉక్కు మనిషి’ సర్దార్‌ పటేల్‌ మార్గదర్శనం, లెఫ్టినెంట్‌ మేజర్‌ జనరల్‌ మహరాజ్‌ రాజేంద్రసింగ్‌ నిర్దేశకత్వంలో మేజర్‌ జనరల్‌ జె.ఎన్‌. చౌదరి నాయకత్వాన జరిగింది ఈ ‘పోలీసు చర్య’. చౌధరి సేనలతో షోలాపూర్‌ నుంచి బయలుదేరారు. బొంబాయి సెక్టార్‌లో కమాండర్‌ మేజర్‌ జనరల్‌ ఎల్‌.ఎస్‌. బ్రార్‌, మద్రాస్‌ సెక్టార్‌లో ఆపరేషన్స్‌ కమాండర్‌ మేజర్‌ జనరల్‌ ఎ.ఎ. రుద్ర, బేరార్‌ సెక్టార్‌లో బ్రిగేడియర్‌ శివదత్‌ సింగ్‌ ఆయనకు సహకరిస్తున్నారు. ఎయిర్‌ వైస్‌మార్షల్‌ ముఖర్జీ కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. యూనియన్‌ సేనలు మొత్తం ఎనిమిది విభిన్న ప్రాంతాల నుంచి హైదరాబాద్‌ సంస్థానాన్ని ముట్టడించాయి. అయితే ప్రధానమైన ముట్టడి షోలాపూర్‌, బెజవాడల నుంచే. భారత సేనల వ్యూహమేమిటో నిజాం సేనలకు అంతే పట్టలేదు. ఎర్రకోట మీద అసఫియా పతాకాన్ని ఎగరేస్తామని బోరవిరిచి బీరాలు పలికిన వారు కనీసం భారత సేనలను నిలువరించలేకపోయారు. ఎక్కడా పెద్ద ప్రతిఘటన లేదు. ఒక్క నల్‌దుర్గ్‌లో తప్ప. భారత సేనలు వెంటతెచ్చిన అధునాతన శకటాలూ యుద్ధవిమానాలూ నిజాం సైన్యాన్ని పూర్తిగా స్థైర్యం కోల్పోయేలా చేశాయి. చాలాచోట్ల నిజాం సైనికులు ఆయుధాల్ని పారేసి పారిపోయారు. కొన్నిచోట్లయితే వాళ్ల తికమకతో స్వపక్షంమీదే కాల్పులు జరుపుకున్నారు, ఫస్ట్‌ నిజాం ఇన్‌ఫాంట్రీ మీద ఘట్‌కేసర్‌ దగ్గర లెఫ్టినెంట్‌ అహ్మద్‌ అలీ ఇట్లా అయోమయంలో కాల్పులు సాగించాడు. పారిపోతున్నప్పుడు ఇన్నాళ్లూ హింసలకు గురైన పల్లెజనం నిజాం సైనికులను వెంటబడి తరిమారు. చాలాచోట్ల వాళ్లకి దేహశుద్ధి జరిగింది. మొదటిరోజు జరిగిన యుద్ధంలో ఏడుగురు భారత సైనికులు మరణించగా 632 మంది నిజాం సైనికులు వధించబడ్డారు. మొదటిరోజే నల్దుర్గ్‌ భారత సేనల వశమైంది, ఆ తర్వాత ఆదిలాబాద్‌, జల్కోట్‌లు భారత దళాల అధీనంలోకి వచ్చాయి. తల్మాడ్‌, తిరూరి ప్రాంతాలు సైతం భారత బలగాల పరమైనాయి. మునగాల మీద దాడి చేసినప్పుడు నిజాం సేన ప్రతిఘటించింది. అయితే అది ఎక్కువసేపు సాగలేదు. అదేరోజు ఉస్మానాబాద్‌ జిల్లాకి చెందిన తుల్జాపూర్‌, పర్బణీ జిల్లాకి చెందిన మానిక్‌ గఢ్‌, కనౌడ్‌గావ్‌, బెజవాడ వైపున్న బోనకల్లు భారత సేనల వశమమ్యాయి. ఆనాడే ఔరంగాబాద్‌లోని జాల్నా దారిన యూనియన్‌ బలగాలు ముందుకు సాగిపోయాయి. వరంగల్‌, బీదర్‌లలోని విమానాశ్రయాల మీద బాంబింగ్‌ జరిగింది. సైనికచర్య దృష్ట్యా హైదరాబాద్‌- బెజవాడ మధ్యనున్న ట్రంక్‌ టెలిఫోన్‌ తప్ప భారత్‌- హైదరాబాద్‌ మధ్యగల రాకపోకలనన్నిటినీ నిలిపివేశారు. రెండోరోజున సెప్టెంబర్‌ 14 నాడు దౌలతాబాద్‌, జాల్నా యూనియన్‌ పరమయ్యాయి. దాంతో ఔరంగాబాద్‌ తేలిగ్గానే చేజిక్కింది. చౌధరి నేతృత్వంలోని సేనలు పురోగమిస్తూ రాజేశ్వర్‌కి చేరాయి. అది సరిగ్గా షోలాపూర్‌- సికింద్రాబాద్‌ పట్టణాలకి మధ్యన ఉంటుంది. ఉస్మానాబాద్‌, నిర్మల్‌ చాలా తేలిగ్గా పట్టుబడ్డాయి. దక్షిణాన ఖాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్ల ప్రతిఘటన స్వల్పంగానే ఉండింది. సికింద్రాబాద్‌ నుంచి 60 మైళ్ల దూరాన ఉన్న సూర్యాపేట దగ్గర భారత సేనలు ముందడుగు వేస్తున్నాయి. రెండోనాడు కూడా వరంగల్‌, బీదర్‌ విమానాశ్రయాలపై బాంబింగ్‌ జరిగింది. సెస్టెంబర్‌ 15 నాడు మూడోరోజున తెల్లవారుజామున 4 గంటలకి మురాద్‌లోని నిజాం సైన్యం లాతూర్‌ రోడ్డువైపు తిరోగమించింది. లాతూర్‌ నుంచి జహీరాబాద్‌కి రైల్లో బయలుదేరిన హైదరాబాద్‌ సెంకడ్‌ ఇన్ఫంటరీ సైనికులమీద విమానాల నుంచి బాంబులు కురిసాయి. దీంతో నిజాం సైన్యం ఉక్కిరిబిక్కిరయింది. చేసేదిలేక ఈ బ్యాటరీ సైనికులు రైలెక్కి హైదరాబాద్‌కి బయలుదేరారు. రైలు వికారాబాద్‌ స్టేషన్‌కి చేరగానే ఈ దళం వెంటనే జహీరాబాద్‌ తిరిగివెళ్లి అక్కడ యుద్ధం సంగతి చూడాలని ఆజ్ఞ వచ్చింది. అయితే ఈ దళం దగ్గర మరఫిరంగులు లేవు. వీళ్లంతా జహీరాబాద్‌కి వెళ్లి మాత్రం చేసేదేమిటి? వెళితే చావు తప్పదని తలచి హైదరాబాద్‌ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌ ఆజ్ఞను ధిక్కరించి ఈ దళం హైదరాబాద్‌కే వెళ్లింది. వాయువ్యంలో ఔరంగాబాద్‌, షోలాపూర్‌- హైదరాబాద్‌ లైన్‌లోని హుమ్నాబాద్‌ యూనియన్‌ దళాల వశమయ్యాయి. జాల్నా నుంచి దక్షిణాన 40 మైళ్ల దూరాన షాదన్‌ దగ్గర ఉన్న ఒక ముఖ్యమైన బ్రిడ్జీ కూడా భారత బలగాల పరమైంది. వరంగల్‌ జిల్లాలో అర్తర్భాగంగా ఉన్న ఖమ్మం సైతం భారత సేనల ఆధీనమైంది. బీదర్‌ విమానాశ్రయం మీద బాంబింగ్‌ జరిగింది. సెప్టెంబర్‌ 16నాడు నాల్గవ రోజు జహీరాబాద్‌ క్రాసింగ్‌ దగ్గరున్న రోడ్డును నిజాం సైన్యం పేల్చివేసింది. భారతదళాల ధాటిని తట్టుకోలేక అక్కడినుంచి తిరోగమిస్తూ నిజాం సైనికులు ఎఖ్‌లీ వంతెనను పేల్చివేశారు. అయితే సాపర్ల సహాయంతో ఈ వంతెనని తిరిగి యూనియన్‌ సైనికులు కట్టారు. అక్కడి నుంచి పురోగమిస్తూ ముఖ్య రైల్‌, రహదారి కూడలి అయిన జహీరాబాద్‌ టౌన్‌ను వశం చేసుకుంది. ఆరోజే పర్బణీ జిల్లాలోని హింగోలీ పట్టణంమీద దాడి జరిగింది. ఇటు సూర్యాపేట నుంచి యూనియన్‌ సైన్యం హైదరాబాద్‌ దారిన వస్తూ ఉంటే సూర్యాపేటకి నాలుగు మైళ్ల దూరాన మూసీ నదిపై ఉన్న వంతెనని నిజాం సైన్యం పేల్చివేసింది. అయితే, మద్రాసు సాపర్స్‌ సాయంతో భారత దళాలు బ్రిడ్జీని పునర్నిర్మించాయి. సుటెర్‌ దిశన మునీరాబాద్‌ రైల్స్స్టేషన్‌ను భారత బలగాలు తమ వశం చేసుకున్నాయి. అక్కడ భారత సేనలకు భారీఎత్తున ఆయుధాలూ మందుగుండు సామగ్రీ దొరికాయి. చాలామంది రజాకార్లూ చిక్కారు. సెప్టెంబర్‌ 17న ఐదవరోజు హైదరాబాద్‌ దళాలు భారతీయ సేనల్ని రానీయకుండా చేయటానికి పటన్‌చెరు దగ్గరి బ్రిడ్జీని పేల్చివేశాయి. రోడ్డుమీద పెద్ద ఎత్తున మందుపాతరలు పెట్టి గచ్చిబౌలి, లింగంపల్లి మధ్యకు చేరుకున్నాయి. మల్కాపూర్‌ దగ్గర కూడా మందుపాతరలు అమర్చారు. అదేరోజు సాయంత్రం 5 గంటలకు నిజాం యుద్ధవిరమణని ప్రకటించి యూనియన్‌ సేనలను సికింద్రాబాద్‌లోకి స్వేచ్ఛగా రావడానికి అనుమతించాడు. సెప్టెంబర్‌ 18నాడు సాయంత్రం 4 గంటలకు ప్రజలంతా హారతులిస్తూ విజయతిలకాలు దిద్దుతూ హర్షాతిరేకాన స్వాగతిస్తుండగా భారతసేనలు సికింద్రాబాద్‌లోకి అడుగుపెట్టాయి. మేజర్‌ జనరల్‌ చౌధరి ఎదుట నిజాం సైన్యాధ్యక్షుడు అహ్మద్‌ అల్‌ ఎడ్రూస్‌, నిజాం యువరాజు ఆజంజా అసఫియా పతాకాన్ని దింపి లాంఛనంగా లొంగిపోయి శరణువేడారు. ఇక్కడితో పోలీసుచర్య పూర్తయింది. మొత్తం అంతా కలిపి 108 గంటల్లోనే హైదరాబాద్‌ సంస్థానం యూనియన్‌ వశమైంది. హైదరాబాద్‌మీద దాడిచేస్తే మద్రాసు, కలకత్తా, బొంబాయి, ఢిల్లీ నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తానన్న రజ్వీ తోకముడిచాడు. అతడి అనుచరులూ మద్దతుదారులూ పిక్కబలం చూపారు. పెద్ద రక్తపాతమేదీ లేకుండానే నిజాం రాజ్యం విముక్తమయింది

సూర్యాపేట

సూర్యాపేట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని నల్గొండ జిల్లాకు చెందిన ఒక ముఖ్య మండలము మరియూ ప్రముఖ వ్యాపారకేంద్రం
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
టైం జోన్
భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము
సూర్యాపేట
జిల్లా(లు)
నల్గొండ
గ్రామాలు
17
జనాభాజనసాంద్రత• మగ• ఆడ• అక్షరాశ్యత శాతం• మగ• ఆడ
240,662 (2001)• 40/కి.మీ² (104/చ.మై)• 122605• 118057• 70.00• 79.51• 59.86